టయోటా ప్లాటినమ్‌ ఎటియోస్ రివ్యూ: ఇది నిజంగానే ప్లాటినమా...?

By Anil

టయోటా మోటార్స్ ఇండియ్ మార్కెట్లోకి 2010 తమ అత్యంత సరసమైన ఎటియోస్ సెడాన్‌ను విడుదదల చేసింది. మంచి నాణ్యమైన, విశ్వసనీయమైన ఉత్పత్తి మరియు ధర కూడా తక్కువే వంటి కారణాల వలన దేశీయంగా మంచి అమ్మకాలే సాధించింది. అయితే టయోటా ఇప్పుడు దీనిని అప్ గ్రేడ్ చేస్తూ ప్లాటినమ్ ఎటియోస్ పేరుతో మళ్లీ మార్కెట్లోకి విడుదల చేసింది.

టయోటా ప్లాటినమ్ ఎటియోస్ సెడాన్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ పూర్తిగా మీ కోసం తెలుగులో...

టయోటా ప్లాటినమ్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

టయోటా మోటార్స్ ప్రస్తుతం మార్కెట్ విధానాలను దృష్టిలో ఉంచుకుని ధృడమైన బాడీ నిర్మాణంతో అధునాతన డిజైన్ శైలిలో ఫ్యామిలీ కారుగా రూపొందించి ప్లాటినమ్ ఎటియోస్ అనే పేరును నిర్ణయించి విపణిలోకి విడుదల చేసింది.

టయోటా ప్లాటినమ్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

అయితే ఈ సరికొత్త ప్లాటినమ్ ఎటియోస్ సెడాన్, ధరకు తగ్గ ఉత్పత్తేనా మరియు మరియు ఇది కొనుగోలుయోగ్యమైనదేనా అని విషయాలతో పాటు దీని సాధ్యాఅసాద్యాలను తెలుసుకుందాం.

టయోటా ప్లాటినమ్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

డిజైన్ పరంగా ప్లాటినమ్ ఎటియోస్ పూర్తిగా ఆధునికతను సంతరించుకుంది. ఇందులోని ముందు మరియు వెనుక వైపున ఉన్ బంపర్లను రీ డిజైన్ చేసారు. మునుపటి తరానికి చెందిన ఎటియోస్‌తో పోల్చినపుడు మార్పును గుర్తించేందుకు అన్నట్లు సరికొత్త ప్రంట్ గ్రిల్‌ను డిజైన్ చేసారు.

టయోటా ప్లాటినమ్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

డిజైన్ మరియు మార్పులు గురించి ప్రస్తావించినపుడు ముఖ్యమైన అంశం రియర్ టెయిల్ ల్యాంప్స్ చాలా అదునాతనంగా ఉన్నాయి. అయితే ఇంటీరియర్ పరంగా పెద్దగా మార్పులు చోటు చేసుకోలేదు. నిర్మాణాత్మకంగా చాలానే మర్పులు జరిగాయి.

టయోటా ప్లాటినమ్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

సాంకేతంగా టయోటా మోటార్స్ ఈ ప్లాటినమ్ ఎటియోస్ సెడాన్‌లలో శక్తివంతమైన సెడాన్‌లకు కావాల్సిన రీతిలో ఇంజన్‌ను రీ ట్యూనింగ్ చేసి అందించారు.

టయోటా ప్లాటినమ్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

సరికొత్త టయోటా ప్లాటినమ్ ఎటియోస్‌లలో 89బిహెచ్‌పి పవర్ మరియు 132ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగల 1.5-లీటర్ పెట్రోల్ మరియు 67బిహెచ్‌పి మరియు 170ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగల 1.4-లీటర్ డీజల్ ఇంజన్‌లను అందించారు.

టయోటా ప్లాటినమ్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

టయోటా తమ ప్లాటినమ్ ఎటియోస్‌లోని రెండు ఇంజన్‌లకు 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేశారు.

టయోటా ప్లాటినమ్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

ప్లాటినమ్ ఎటియోస్‌లోని పెట్రోల్ వేరియంట్ లీటర్‌కు 16.7కిలోమీటర్లు మరియు డీజల్ వేరియంట్ లీటర్‌కు 23.5కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలవు.

టయోటా ప్లాటినమ్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

ప్లాటినమ్ ఎటియోస్ నడిపేటపుడు గొప్ప కారును అని ఖచ్చితంగా అంటారు. ఎందుకంటే ఇంజన్‌ను నుండి వచ్చే శబ్దం క్యాబిన్‌లోకి రాకుండా అద్భుతమైన డిజైన్, కుదుపులు రాకుండా ఎక్కువ స్ప్రింగ్‌లు గల సస్పెన్షన్ సిస్టమ్ ఎంతో మంచి రైడింగ్ సౌలభ్యాన్ని కల్పిస్తాయి.

టయోటా ప్లాటినమ్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

సిటి డ్రైవింగ్‌ కోసం ఎక్కువ ఉపయుక్తంగా ఉండటానికి ఇందులోని క్లచ్‌ పెడల్‌ను రీడిజైన్ చేసారు. ఇందులో క్లచ్‌ను మరియు పెడల్‌ను కనెక్ట్ చేసి ఉండే స్ప్రింగ్ పొడవు పెంచడం, క్లచ్ పెడల్ వెడల్పును పెంచడం జరగింది. తద్వారా క్లచ్‌ను ఉపయోగిస్తున్నపుడు స్మూత్‌గా ఉంటుంది.

టయోటా ప్లాటినమ్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

టయోటా ఈ ప్లాటినమ్ ఎటియోస్‌లోని ఇంటీరియర్‌లో బ్లాక్ మరియు ఇవోరీ ఇంటీరియర్ రంగులను అందించింది. మరియు మునుపటి ఎటియోస్‌లో మధ్యలో నిర్మించిన ఇంస్ట్రుమెంట్ కన్సోల్‌ను నూతన కలర్ థీమ్‌లో అందించింది.

టయోటా ప్లాటినమ్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

ఇంస్ట్రుమెంట్ కన్సోల్‌లో నల్లటి బోర్డు మీద తెల్లటి అక్షరలు వచ్చే విధంగా రూపొందించారు. మరియు అనలాగ్ టాకో మీటర్‌ను

డిజటల్ రూపంలోకి మార్చారు. మునుపటి వార్నింగ్ లైట్లతో పోల్చితే ఇందులో చాలా బెటర్‌గా ఉన్నాయి. ఇప్పుడు కన్సోల్ యొక్క లైటింగ్‌ను అడ్జెస్ట్ చేసుకోవచ్చు.

టయోటా ప్లాటినమ్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

ఫీచర్ల పరంగా ఇందులో ముందు మరియు వెనుక వైపున ప్యాసింజర్ సీటర్లకు అడ్జెస్ట్ చేసుకునే సదుపాయం గల తలగడలు, లెథర్ తొడుగుల ఫినిషింగ్‌లో స్టీరింగ్ వీల్, ఎలక్ట్రిక్ ద్వారా అడ్జెస్ట్ చేసుకునే వీలున్న అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్స్, స్టీరింగ్ ఆధారిత నియంత్రికలు మరియు అడ్జెస్ట్ చేసుకునే వీలున్న డ్రైవర్ సీట్.

టయోటా ప్లాటినమ్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

టయోటా ప్లాటినమ్‌ ఎటియోస్‌లో డ్రైవర్ మరియు ఫ్రంట్ ప్యాసింజర్‌కు ఎయిర్ బ్యాగ్, యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ వంటి భద్రత ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

తీర్పు

తీర్పు

చాలా మంది టయోటా ఎటియోస్ సెడాన్‌ను కొనుగోలు చేయడానికి సుముఖతను చూపరు. ఎందుకంటే ఇది ట్యాక్సీ రూపంలో ఉంటుందనే భావన. అయితే సరికొత్త ప్లాటినమ్ ఎటియోస్ అందుకు పూర్తిగా విభిన్నం. ఇందులోని డిజైన్, ఫీచర్లు, డ్రైవింగ్ లక్షణాలు, శైలి మరియు ఎక్ట్సీరియర్ విభాగం వంటి అనేక అంశాలు ఈ ప్లాటినమ్‌ ఎటియోస్‌ను ఎంతో ప్రత్యేకం చేశాయి.

టయోటా ప్లాటినమ్ ఎటియోస్ వేరియంట్లు మరియు ధర వివరాలు

టయోటా ప్లాటినమ్ ఎటియోస్ వేరియంట్లు మరియు ధర వివరాలు

పెట్రోల్ వేరియంట్లు

  • ఎటియోస్ ప్లాటినమ్ జిఎక్స్ ధర రూ. 6,94,430 లు
  • ఎటియోస్ ప్లాటినమ్ వి ధర రూ. 7,22,141 లు
  • ఎటియోస్ ప్లాటినమ్ విఎక్స్ ధర రూ. 7,85,256 లు
  • డీజల్ వేరియంట్లు

    డీజల్ వేరియంట్లు

    • ఎటియోస్ ప్లాటినమ్ జిఎక్స్‌డి ధర రూ. 8,07,470 లు
    • ఎటియోస్ ప్లాటినమ్ విడి ధర రూ. 8,35,181 లు
    • ఎటియోస్ ప్లాటినమ్ విఎక్స్‌డి ధర రూ. 8,98,296 లు
    • అన్ని ధరలు ఎక్స్ షోరూమ్ ఢిల్లీగా ఉన్నాయి.

      .

      • విపణిలోకి హీరో అచీవర్ 150 విడుదల: ప్రారంభ ధర రూ. 61,800 లు
      • ప్రతి చుక్క లెక్కలోకే....ఉత్తమ మైలేజ్ ఇవ్వగల టాప్-10 కార్లు
      • భారత్‌కు పొంచి ఉన్న ముప్పు....!!

Most Read Articles

English summary
Read In Telugu: Toyota Platinum Etios Review — Is This Sedan Worthy Of The ‘Platinum’ Title?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X