వోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ: కొనవచ్చా, కొనకూడదా...?

Written By:

వోక్స్‌వ్యాగన్: జర్మనీలో పుట్టిన ఈ సంస్థ గత 80 ఏళ్లు ప్రపంచ ఆటోమోటివ్ పరిశ్రమలో ఎనలేని కీర్తిని గడించింది. ఒకప్పటి ఇకానిక్ కార్లయిన బీటిల్, గోల్ఫ్ మరియు ట్రాన్స్‍‌పోర్టర్ వ్యాన్లతో పాటు ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులను ఆవిష్కరిస్తూ తనదైన శైలిలో ప్యాసింజర్ కార్ల మార్కెట్‌ను శాసిస్తోంది. కాని, నేడు ఇండియన్ మార్కెట్ విషయానికి వస్తే ఆ పరిస్థితి లేదు. అరకొర మోడళ్లతో దేశీయ మరియు జపాన్ కంపెనీల పోరును ఎదుర్కోలేకపోతోంది.

అయితే ప్రీమియ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో దేశీయంగా మంచి అవకాశాలు ఉన్న నేపథ్యంలో టిగువాన్ ఎస్‌యూవీని విడుదల చేసింది. నేటి కథనంలో టిగువాన్ శక్తి సామర్థ్యాలు మరియు ఇందులోని గుడ్ అండ్ బ్యాడ్ ఎంటో చూద్దాం రండి...

వోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

వోక్స్‌వ్యాగన్ తమ టూరెగ్ ఎస్‌యూవీ తరువాత రెండవ ఎస్‌యూవీగా టిగువాన్‌ను ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసింది. తొలుత 2016 ఫ్రాంక్ ఫర్ట్ మోటార్ షో వేదిక మీద ఆవిష్కరించబడిన ఇది దేశీయంగా ప్రీమియమ్ ఎస్‌యూవీలైన టయోటా ఫార్చ్యూనర్ మరియు ఫోర్డ్ ఎండీవర్‌ లకు గట్టి పోటీగా నిలిచింది.

డిజైన్ పరంగా వోక్స్‌వ్యాగన్ టిగువాన్ మీద భారీ దృష్టే పెట్టింది. కానీ ప్రపంచ శ్రేణి మార్కెట్ అనుగుణంగా ఉన్న ఈ డిజైన్ ఇండియన్ కస్టమర్ల అంచనాలకు సరితూగదని చెప్పవచ్చు.

వోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

ముందువైపు డిజైన్ పరంగా వోక్స్‌వ్యాగన్ ఇంజనీరింగ్ బృందం తీసుకున్న శ్రద్ధ గమనించవచ్చు. స్వల్ప వాలుతో అధిక క్యారెక్టర్ లైన్స్‌ లేకుండా సింపుల్ బానెట్ అందివ్వడం జరిగింది. ఫ్రంట్ డిజైన్‌లో ఉన్న డబుల్ స్లాట్ క్రోమ్ గ్రిల్ మరియు దానికి లోపలి వైపున్న బ్లాక్ ఎయిర్ ఇంటేకర్ కలదు. గ్రిల్‌కు ఇరువైపులా పగటి పూట వెలిగే లైట్ల జోడింపుతో ఉన్న ఎల్ఇడి హెడ్ ల్యాంప్స్ అత్యంత ఆకర్షణీయంగా ఉన్నాయి.

వోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

ఫ్రంట్ గ్రిల్ మధ్యలో వోక్స్‌వ్యాగన్ ఇకానిక్ చిహ్నాన్ని యథావిధిగా అందివ్వడం జరిగింది. ఫ్రంట్ గ్రిల్‌కు క్రింది భాగంలో ఇంజన్‌కు గాలి చేరే విధంగా విశాలమైన ఫ్రంట్ ఎయిర్ ఇంటేకర్ సమ్మేళిత ఫ్రంట్ బంపర్ కలదు. బంపర్‌కు ఇరువైపులా ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి. ఎలక్ట్రిక్ పవర్ ద్వారా సీటులో కూర్చునే రియర్ వ్యూవ్ మిర్రర్స్ అడ్జెస్ట్ చేసుకునే అవకాశం కలదు.

వోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

ప్రక్కవైపు డిజైన్‌లో స్పోర్టివ్ ఎస్‌యూవీ లక్షణాలను గుర్తించవచ్చు. రియర్ టెయిల్ ల్యాంప్స్ నుండి ప్రారంభమయ్యే సైడ్ క్యారెక్టర్ లైన్స్ రెండు డోర్ల మీదుగా ముందువైపు ఉన్న రియర్ వ్యూవ్ మిర్రర్ వరకు ఉంది. ధృడమైన మరియు కడలు తిరిగిన భుజం లాంటి బాడీ ఆకృతి దీనికి కలిసొచ్చింది. టిగువాన్ 18-అంగుళాల అల్లాయ్ వీల్స్ మరియు హంకూక్ టైర్ల మీద కూర్చుంది.

వోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

రియర్ డిజైన్‌లో చిన్న పరిమాణంలో ఉన్న స్పాయిలర్(వెనుక వైపు రూఫ్ టాప్ ముగిసే చోట చివర్లో ఉన్న తోక లాంటి భాగం) గుర్తించవచ్చు. ఎల్ఇడి టెయిల్ లైట్ సెక్షన్‌లో F ఆకారంలో వెలిగే టెయిల్ ల్లాంప్స్ అందివ్వడం జరిగింది.

వోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

మొత్తానికి, టిగువాన్ అన్ని కొలతల్లో సరైన డిజైన్ క్రమంలో రూపొందించబడింది. భారీ కాయం ఆకారంలో, ఎలాంటి అదనపు బరువులు, ఆకృతులు లేకుండా పదునైన డిజైన్ లక్షణాలతో సాలిడ్ శరీర నిర్మాణాన్ని కలిగి ఉంది. సెగ్మెంట్ పరంగా గట్టి పోటీనిచ్చే ఓ శక్తివంతమైన ప్రీయమిమ్ ఎస్‌యూవీ శైలికి ఏ మాత్రం తగ్గలేదు.

ఇంటీరియర్

ఇంటీరియర్

టిగువాన్ ఇంటీరియర్‌లోకి ఎంటర్ అయ్యాక్ తొలుత గమనించే అంశం, ఐదు మంది సౌకర్యవంతంగా కూర్చునే క్యాబిన్ స్పేస్. అధిక స్టోరేజ్ సామర్థ్యం, ఏ-1 లగ్జరీ ఫీచర్లు మరియు లాజిక్ ప్రకారం అందించిన కంట్రోల్స్ మరియు ఫీచర్లు ఇందులో గుర్తించవచ్చ.

వోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

ముందు మరియు వెనుక ప్రయాణికులు కాళ్లు మరియు తలకు చుట్టు ప్రక్కల ఉన్న విశాలమైన స్పేస్ అందివ్వడంలో వోక్స్‌వ్యాగన్ సఫలం చెందింది. పొడవుగా ఉన్న వాళ్లు సీట్లను కాస్త వెనుకకు జరుపుకోవచ్చు, అయినప్పటిరీ రియర్ రో ప్యాసింజర్స్‌కు కంఫర్ట్‌గానే ఉంటుంది.

వోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

క్యాబిన్ స్పేస్ మరియు కంఫర్ట్ పరంగా వోక్స్‌వ్యాగన్ తమ టిగువాన్ ఇంటీరియర్ ద్వారా కొత్త నిర్వచనాన్ని ఇచ్చిందని చెప్పవచ్చు. అన్ని రకాల కస్టమర్లు కోరుకునే రీతిలో పోటీదారులకు ధీటుగా కంఫర్ట్ ఫీచర్స్ ఇవ్వడంలో జర్మన్ దిగ్గజం పూర్తి స్థాయిలో సఫలం చెందింది.

ఫీచర్లు

ఫీచర్లు

వోక్స్‌వ్యాగన్ తమ టిగువాన్ ఎస్‌యూవీలో ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే జోడింపుతో 12.3-అంగుళాల పరిమాణం ఉన్న ఆక్టివ్ ఇన్ఫో డిస్ల్పేను స్డాండర్డ్‌గా అందించింది. 8-స్పీకర్లున్న ఎంటర్‌టైన్‌‌మెంట్ సిస్టమ్‌కు ఇన్ఫోటైన్‌మెంట్ డిస్ల్పే అనుసంధానం కలదు.

మరిన్ని ఫీచర్లు

మరిన్ని ఫీచర్లు

మూడు జోన్ల క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్, వెనుక వైపుకు ఎయిర్ కండీషనింగ్ వెంట్స్ కలవు. ఏదేమయినప్పటికీ ఇండియన్స్ కోరుకునే స్టాండ్ అవుట్ ఫీచర్ ప్యానరోమిక్ సన్ రూఫ్ కలదు. సన్ రూఫ్, క్యాబిన్ ఎల్ఇడి లైట్లను చీకటిలో ఆన్ చేస్తే, గదిని పోలి ఉండే క్యాబిన్ గుర్తించగలం.

బూట్ స్పేస్

బూట్ స్పేస్

ఈ సెగ్మెంట్లో అత్యుత్తమ బూట్ స్పేస్ కలిగి ఉంది టిగువాన్. లాంగ్ రోడ్ ట్రిప్‌కు అనుగుణంగా 615-లీటర్ల స్పేస్ కలదు. మరింత స్పేస్ కోరుకునే వారు, వెనుక వరుస సీటును 170ఎమ్ఎమ్ వరకు ముందుకు జరిపితే 1665-లీటర్లకు బూట్ స్పేస్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు.

వోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

బూట్ స్పేస్ యాక్సెస్ చేయడం టిగువాన్ చాలా సలభతరం చేసింది. రియర్ డోర్ అంచువరకు వెళ్లి, బంపర్ క్రిందకు పాదాన్ని తీసుకెళ్తే అక్కడ ఉన్న సెన్సార్లు ఆటోమేటిక్‌గా డోర్‌ను ఓపెన్ చేస్తాయి. క్లోచ్ చేయాలనుకుంటే డోర్ నుండి దూరంగా జరిగినా లేదంటే అక్కడే ఉన్న బటన్ ప్రెస్ చేసినా డోర్ ఆటోమేటిక్‌గా క్లోజ్ అవుతుంది.

వోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

డిక్కీలో మాత్రమే కాదు క్యాబిన్ ఫ్రంట్ పోర్షన్‌లో కూడా ఖాళీ ప్రదేశాన్ని అందివ్వడం జరిగింది. ఫ్రంట్ సీట్ క్రింద, ఆర్మ్ రెస్ట్ క్రింద, డ్యాష్ బోర్డ్ క్రింద చల్లటి గ్లూవ్ బాక్స్ కలదు. వేసవి మరియు ఉక్కపోస్తున్న వాతావరణంలో చల్లటి పానీయాలు మరియు ఫుడ్ ఐటమ్స్ ఇందులో స్టోర్ చేసుకోవచ్చు.

భద్రత ఫీచర్లు

భద్రత ఫీచర్లు

భద్రత పరంగా వోక్స్‌వ్యాగన్ తమ టిగువాన్ ప్రీమియమ్ కాంపాక్ట్ ఎస్‌యూవీలో ఆరు ఎయిర్ బ్యాగులు, పాదచారుల సేఫ్టీ కోసం రీయాక్టివ్ బానెట్, సెల్ఫ్ సీలింగ్ టైర్లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ ఉన్నాయి. ఎలక్ట్రానిక్ ఫీచర్లయిన యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ట్రాక్షన్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాక్, ఇంజన్ డ్రాగ్ టార్క్ కంట్రోల్ మరియు హిల్ డిసెంట్ కంట్రోల్ ఫీచర్లున్నాయి. దీనికి నిర్వహించిన యూరో ఎన్‌సిఎపి క్రాష్ పరీక్షల్లో పెద్దల భద్రత పరంగా 100కు 96శాతం మార్కులు పొందింది.

ఇంజన్,పనితీరు మరియు డ్రైవ్

ఇంజన్,పనితీరు మరియు డ్రైవ్

మేము పరీక్షించిన టిగువాన్ ఎస్‌యూవీలో 2-లీటర్ల సామర్థ్యం ఉన్న నాలుగు సిలిండర్ల టుర్భో ఛార్జ్‌డ్ డీజల్ ఇంజన్ కలదు. దీనికి అనుసంధానం చేసిన డ్యూయల్ క్లచ్ 7-స్పీడ్ డైరెక్ట్ షిఫ్ట్ గేర్‌బాక్స్ గుండా ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ ద్వారా ఇంజన్ ఉత్పత్తి చేసే 141బిహెచ్‌పి పవర్ మరియు 340ఎన్ఎమ్ టార్క్ చక్రాలకు సరఫరా అవుతుంది.

వోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

టిగువాన్ నిలకడగా పవర్ ఉత్పత్తి చేయగలిగింది. అయితే ఇంజన్ వేగం 1750ఆర్‌పిఎమ్ నుండే 340ఎన్ఎమ్ టార్క్ లభించింది. సిటీ మరియు హై వే మీద మంచి డ్రైవబిలిటి ఇచ్చింది. చాలా వరకు డీజల్ ఇంజన్ వాహనాలలో ప్రారంభంలో తక్కువ స్పీడ్ వద్ద వచ్చే కంపనం ఇందులో లేదు.

వోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

ఓపెన్ రోడ్ల మీద క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్ ఉన్నపుడు టాప్ గేర్‌లో 2,000ఆర్‌పిఎమ్ టిగువాన్ గంటకు 120కిలోమీటర్ల వేగాన్ని సునాయసంగా అందుకుంది. మరియు టిగువాన్ తెలిపిన దానికంటే గంటకు 200కిలోమీటర్లకు పైబడి వేగాన్ని అందుకున్నాము(ఫోటోలోని స్పీడ్ మీటర్‌లో గమనించగలరు).

వోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

హై వే ల మీద మత్రమే కాదండోయ్, ఆఫ్ రోడింగ్ కండీషన్‍‌లో వివిధ భూ భాగాల మీద టిగువాన్‌ను డ్రైవ్ చేసి పరీక్షించడం జరిగింది. 4మోషన్ ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌ మరియు ట్రాక్షన్ కంట్రోల్ ద్వారా టైర్లకు మంచి గ్రిప్ లభించింది. దీంతో అన్ని మట్టి మరియు బురద రోడ్లను తేలికగా ఛేదించింది.

వోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

టిగువాన్ ఎస్‌యూవీలో నాలుగు విభిన్న డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి. అవి, స్నో, చదును రోడ్లు(paved roads), ఆఫ్-రోడ్ మరియు డ్రైవర్‌కు ఇష్టమైన రీతిలో సెట్ చేసుకునే ఆఫ్ రోడ్ సెట్టింగ్స్. సెంటర్ కన్సోల్ మీద ఉన్న 4మోషన్ యాక్టివ్ కంట్రోల్ నాబ్ ద్వారా ఈ డ్రైవింగ్ మోడ్స్ ఎంచుకోవచ్చు.

వోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

పాలిష్ బండల మీద జారినట్లుగా, స్మూత్ డ్రైవింగ్ అనుభూతిని కల్పించింది టిగువాన్ డ్రైవ్. ఇందుకు కారణమైన తేలికపాటి స్టీరింగ్ వీల్, అదుపు చేయబడ్డ ఇంజన్ మరియు గాలి ద్వారా వచ్చే శబ్దం, స్మూత్‌గా జరిగే గేర్ల మార్పిడి, వేగానికి తగ్గట్లుగా ఆటోమేటిక్‌గా గేర్ సెలక్ట్ చేసుకోవడం, అత్యుత్తమ సస్పెన్షన్ వ్యవస్థ వంటి వాటికి థ్యాంక్స్ చెప్పుకోవాల్సిందే.

వోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

బాడీ కంట్రోల్ అత్యుత్తమ స్థిరత్వాన్ని కలిగి ఉంది. అధిక వేగం వద్ద కంట్రోల్ కోల్పోకుండా పదునైన మలుపులను తేలకగా అధిగమించడం జరిగింది. మొత్తానికి టిగువాన్ ప్రయాణం గాలిని వేగంగా చీల్చుకుంటూ దూసుకెళ్లిన అనుభూతి కలిగింది.

వారంటీ

వారంటీ

వోక్స్‌వ్యాగన్ తమ టిగువాన్ మీద రెండేళ్ల పాటు అపరిమిత కిలోమీటర్లకు వారంటీ కల్పిస్తోంది మరియు 12-సంవత్సరాల పాటు యాంటి-కరోషన్ వారంటీ ఉంది. దీని మీద ఎక్స్‌టెండెడ్ వారంటీని కూడా కల్పిస్తోంది.

వోక్స్‌వ్యాగన్ టిగువాన్

వోక్స్‌వ్యాగన్ టిగువాన్

  • పరీక్షించిన మోడల్: 1968సీసీ డీజల్, ఆటోమేటిక్, హైలైన్ టిడిఐ
  • ధర: రూ. 40 లక్షలు (ఆన్-రోడ్)
  • ఇంధన ట్యాంక్ కెపాసిటీ: 71-లీటర్లు
  • మైలేజ్(అంచనా): 12కిమీలు(సిటీ/హైవే/ఆఫ్-రోడ్)
  • మైలేజ్(ARAI): 17.06కిమీ/లీ
  • ఫ్యూయల్ ట్యాంక్ రేంజ్: పూర్తిగా నింపితే 850కిమీలు ప్రయాణించవచ్చు
  • పవర్ మరియు టార్క్: 141బిహెచ్‌/340ఎన్ఎమ్
  • గరిష్ట వేగం: గంటకు 210కిమీ
పోటీదారులు

పోటీదారులు

  • టయోటా ఫార్చూనర్ 2755సీసీ డీజల్ ఇంజన్, 4X4 ఆటోమేటిక్: రూ. 40 లక్షలు
  • ఫోర్డ్ ఎండీవర్ ట్రెండ్ 3198సీసీ డీజల్ ఇంజన్, 4X4 ఆటోమేటిక్: రూ. 40 లక్షలు
తీర్పు

తీర్పు

మధ్య స్థాయి లగ్జరీ ఎస్‌యూవీ మార్కెట్ ఇప్పుడు శరవేగంగా పుంజుకుంటోంది, ఇదే సమయంలో వోక్స్‌వ్యాగన్ తమ టిగువాన్ సాలిడ్ ఎస్‌యూవీని ప్రవేశపెట్టింది. పనితీరు, ఆధ్బుతమైన డిజైన్, ఫీచర్లు మరియు ప్రమియమ్ ప్రైస్ అంశాల పరంగా చూస్తే, పోటీగా ఉన్న మోడళ్లకు బలమైన పోటీనివ్వడం ఖాయం.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ప్రతి ఒక్కరి లైఫ్ స్టైల్‌కి అనుగుణంగా నచ్చిన కారును ఎంచుకుంటారు. మీరు ఎస్‌యూవీ ప్రేమికులైతే, శక్తివంతమైన పనితీరు, సేఫ్టీ, ఫీచర్లు, ఫ్యూయల్ ఎకానమీ వంటి లక్షణాలున్న వోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఎంచుకోవచ్చు.

English summary
Read In Telugu: First Drive: Volkswagen Tiguan 2.0 TDI — A Germanic Blend Of Flair And Practicality

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Drivespark sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Drivespark website. However, you can change your cookie settings at any time. Learn more