న్యూజెర్సీలో బయటపడిన అడాల్ఫ్ హిట్లర్ బెంజ్ కారు

Posted By:

జాత్యహంకారంతో మహా మారణహోమం సృష్టించిన జర్మన్ నియంత 'అడాల్ఫ్‌ హిట్లర్‌' గురించి తెలియని వారంటూ ఎవ్వరూ ఉండరేమో..? జర్మనీ సైన్యంలో ఓ సైనికుడిగా పనిచేస్తూ, మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత సర్వం కోల్పోయి, తన దేశానికి జరిగిన అవమానాన్ని తట్టుకోలేక నేషనల్ సోషలిస్ట్ జర్మన్ వర్కర్స్ పార్టీ (నాజీ)ని స్థాపించి, తుదిశ్వాస వరకూ జర్మనీని పాలించి వ్యక్తి హిట్లర్.

To Follow DriveSpark On Facebook, Click The Like Button

సరే హిట్లర్ కధ అటుంచింతే.. 1942లో హిట్లర్ క్యాంప్ కోసం మెర్సిడెస్ బెంజ్ ప్రత్యేకంగా ఎనిమిది కార్లను తయారు చేసి ఇచ్చింది. అందులో ఓ కారు ఇటీవలే న్యూజెర్సీలో బయటపడింది. న్యూజెర్సీకి చెందిన ఓ ఆటో డీలర్ వద్దకు పురాతన మెర్సిడెస్ బెంజ్ కారు ఒకటి వచ్చింది. దీనిని రిపేరు చేసేందుకు గానూ సదరు డీలర్ మెర్సిడెస్ బెంజ్ కంపెనీ వద్ద స్పేర్ పార్ట్‌ల కోసం ఆర్డర్‌ను ప్లేస్ చేయగా, కారు సీరియల్ నెంబర్‌ను పరిశీలించిన మెర్సిడెస్ బెంజ్ కంపెనీ, ఈ కారును హిట్లర్ క్యాంప్ కోసం తయారు చేసిన 8 కార్లలో ఒకటని ధృవీకరించింది.

ఈ కారు నిజమైనదేనని, నాజీ అధికారుల కోసం ప్రత్యేకంగా ఇలాంటివి కేవలం ఎనిమిది కార్లను మాత్రమే తయారు చేశామని మెర్సిడెస్ బెంజ్ పేర్కొంది. 1942వ సంవత్సరానికి చెందిన ఈ "మెర్సిడెస్ 370 క్యాబ్రియోలెట్ డి" కారును రెండవ ప్రపంచ యుద్ధం (వరల్డ్ వార్ 2) సమయంలో థర్డీ రీచ్ ఉన్నతాధికారుల కోసం కంపెనీ ఈ కారును తయారు చేసింది.

అయితే, ప్రస్తుతం న్యూజెర్సీలో రిపేర్‌కు వచ్చిన స్వయానా హిట్లర్ డ్రైవ్ చేసిన కారు కాకపోయి ఉండొచ్చని, ఇది అతని జనరల్స్ నడిపిన వాటిలో ఒకటై ఉండొచ్చని అంచనా. న్యూజెర్సీకి చెందిన జెనోప్ ట్యూన్సర్ అనే ఆటో డీలర్ తన కస్టమర్ తరఫున ఈబేలో పాత కార్ల శోధిస్తుండగా, ఈ కారును గుర్తించానని తెలిపాడు. ఈ కారును సుమారు 1,80,000 డాలర్లు వెచ్చించి కొనుగోలు చేసినట్లు సమాచారం.

English summary
A Mercedes Benz specially built for German dictator Adolf Hitler's Generals has been found by an American car dealer. The 1942 Mercedes 320 Cabriolet D could have been a car used by one of Hitler's generals.
Story first published: Thursday, July 12, 2012, 16:11 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark