అప్పర్ ట్యాంక్ బండ్‌పై స్పీడ్ లిమిట్ 30 kmph మాత్రమే
హైదరాబాద్: రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో, అప్పర్ ట్యాంక్ బండ్‌పై వేగ పరిమితి (స్పీడ్ లిమిట్)ను కేవలం గంటకు 30 కి.మీ. ( 30 కెఎమ్‌పిహెచ్) మాత్రమే పరిమితం చేస్తూ నగర పోలీష్ కమిషనర్ అనురాగ్ శర్మ ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల అప్పర్ ట్యాంక్ బండ్‌పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ జంట మరణించటం, వారి ఇద్దరు పిల్లలు గాయాల పాలవ్వటం జరిగింది.
ఈ కేసును ప్రత్యేకంగా స్వీకరించిన లోకాయుక్త జస్టిస్ బి సుభాషన్ రెడ్డి సుమోటుగా తీసుకున్న తర్వాత ఈ ఆదేశాలు వెలువడ్డాయి. ఇకపై హైదరాబాద్‌లోని అప్పర్ ట్యాంక్ బండ్‌పై మోటారిస్టులు 30 కి.మీ. కంటే ఎక్కువ వేగంతో వాహనాలు నడపకూడదు. అలా చేస్తే అది ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినట్లు అవుతుంది. ఈ సంఘటన నేపథ్యంలో వాహన చోదకులు జాగ్రత్త చర్యలు తీసుకుని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సిటీ పోలీసులు ప్రజల్ని కోరారు.
గడచిన అక్టోబర్ 22న అప్పర్ ట్యాంక్ బండ్‌పై తమ ఇద్దరు పిల్లలతో రోడ్డు దాటుతున్న ఓ జంటను వేగంగా వస్తున్న ఆర్టీసి బస్సు ఢీకొట్టింది. దీంతో ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సుభాషన్ రెడ్డి, ఆ రోడ్డుపై వేగ పరిమితిని 30 కి.మీ. పరిమితం చేయాలని కోరడంతో ఈ ఆదేశాలు వెలువడ్డాయి.



Click it and Unblock the Notifications








