గుర్ఖా ఆఫ్‌రోడర్‌ను తిరిగి ప్రవేశపెట్టనున్న ఫోర్స్ మోటార్స్

ఫోర్స్ మోటార్స్ కంపెనీ గుర్తుందా..? టెంపో ట్రావెలర్, ట్రాక్స్ వంటి ప్యాసింజర్ కమర్షియల్ వాహనాలను తయారు చేసే ఫోర్స్ మోటార్స్ ఇటీవల్ "ఫోర్స్ వన్" అనే ఎస్‌యూవీ (స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం)ను విడుదల చేయటం ద్వారా ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్లోకి కూడా ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఒకప్పుడు ఫోర్స్ మోటార్స్ నుండి అత్యంత పాపులర్ అయిన ఆఫ్-రోడర్ వెహికల్ "ఫోర్స్ గుర్ఖా"ను తిరిగి మార్కెట్లో పునఃప్రవేశపెట్టేందుకు ఫోర్స్ మోటార్స్ సన్నాహాలు చేస్తుంది.

గతంలో ఈ మోడల్ ఉత్పత్తి, డీలర్‌షిప్ నెట్‌వర్క్, సర్వీసింగ్ ఫెసిలిటీ వంటి సౌకర్యాలు సరిగ్గా అందుబాటులో లేని కారణంగా మూడేళ్ల క్రితం గుర్ఖా ఆఫ్-రోడర్ ఉత్పత్తిని ఫోర్స్ మోటార్స్ నిలిపి వేసింది. అయితే.. ఫోర్స్ వన్ ఎస్‌‌యూవీ అభివృద్ధి కోసం ప్రముఖ జర్మన్ కంపెనీ డైమ్లర్ ఏజి (మెర్సిడెస్ బెంజ్ మాతృ సంస్థ)తో చేతులు కలిపిన ఫోర్స్ మోటార్స్ ఇండియన్ మార్కెట్లో మరిన్ని ఉత్పత్తులను ప్రవేశపెట్టి తమ మార్కెట్ వాటాను పెంచుకోవాలని భావిస్తోంది.

ఇందులో భాగంగానే, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేయబడిన ఫోర్స్ గుర్ఖాను మరోసారి మార్కెట్లోకి తీసుకు వచ్చేందుకు కంపెనీ ప్రయత్నిస్తోంది. ఫోర్స్ గుర్ఖా చూడటానికి అచ్చం మెర్సిడెస్ బెంజ్ జి వ్యాగన్ మాదిరిగా ఉంటుంది. అయితే, దీని ధర మాత్రం మెర్సిడెస్ బెంజ్ జి వ్యాగన్ ధరలో పదవ వంతు మాత్రమే ఉంటుంది. ఇండియన్ మార్కెట్లో మెర్సిడెస్ బెంజ్ జి వ్యాగన్ ధర రూ.1.1 కోట్లకు పైమాటే. అదే ఫోర్స్ గుర్ఖా కేవలం రూ.10 లక్షలకే లభిస్తుంది.

ఫోర్స్ గుర్ఖా బేసిక్ ఇంటీరియర్స్ కలిగి ఉన్నప్పటికీ, అఫ్-రోడింగ్‌లో అద్భుతమైన హ్యాండ్లింగ్, కంట్రోల్‌ను కలిగి ఉంటుంది. అందుకే, ఈ ఎస్‌యూవీ అత్యంత పాపులర్ అయింది. ఇప్పటికీ ఈ మోడల్‌ను కోరుకునే వారు లేకపోలేదు. అందుకే దీనిని తిరిగి మార్కెట్లోకి తీసుకురావాలని ఫోర్స్ భావిస్తోంది. అంతేకాకుండా.. మెర్సిడెస్ బెంజ్‌కు, ఫోర్స్ మోటార్స్ కంపెనీలకు మధ్య కుదిరిన టెక్నాలజీ ఒప్పందాన్ని ఆసరాగా చేసుకొని టొయోటా ఇన్నోవాకు పోటీగా ఓ ఎమ్‌పివిని కూడా ఫోర్స్ మోటార్స్ అభివృద్ధి చేస్తోంది. త్వరలోనే ఫోర్స్ మోటార్స్ నుంచి కొత్త వాహనాలు మార్కెట్‌ను తాకనున్నాయి.

Most Read Articles

English summary
Commercial vehicles maker Force Motors Ltd is planing to re-launch its popular off-roader Force Gurkha in India. Recently Force Motors has signed a license agreement with Daimler AG, to supply technology for their multi purpose vehicle (MPV), which is due for launch by end-2012 in Indian market.
Story first published: Friday, June 29, 2012, 16:58 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X