ఫోర్స్ వన్ ఎస్‌యూవీలో చవక వేరియంట్ వస్తోంది

By Ravi

గతేడాది ఆగస్ట్ నెలలో ప్రఖ్యాత బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా భారత మార్కెట్లో విడుదలైన ఫోర్స్ మోటార్స్ మొట్టమొదటి ఎస్‌యూవీ 'ఫోర్స్ వన్' (Force One)లో ఓ చవక వేరియంట్‌ను తీసుకువచ్చేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తుంది. వాణిజ్య వానాల తయారీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాధించుకున్న ఫోర్స్ మోటార్స్, ఫోర్స్ వన్‌ను దేశీయ విపణిలోకి విడుదల చేయటం ద్వారా ప్యాసింజర్ వాహన విభాగంలోకి అడుగుపెట్టింది. అయితే, ఈ ఉత్పత్తిని మార్కెటింగ్ చేయటంలో కంపెనీ పెద్దగా సక్సెస్‌ను సాధించలేకపోయింది. ఫోర్స్ వన్‌కు అమితాబ్ బచ్చన్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించినప్పటికీ ఆశించిన ఫలితాలు మాత్రం కనిపించలేదు.

ఈ నేపథ్యంలో, తమ ఫోర్స్ వన్ అమ్మకాలును పెంచుకునేందుకు, ఎస్‌యూవీ సెగ్మెంట్లోని ధరల యుద్దాన్ని ధీటుగా ఎదుర్కునేందుకు ఫోర్స్ మోటార్స్ ఇందులో ఓ చవక వేరియంట్‌ను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. అంతేకాకుండా, ఈ మోడల్‌కు మరిన్ని విలాసవంతమైన ఫీచర్లను జోడించిన ఓ టాప్-ఎండ్ వేరియంట్‌ను కూడా విడుదల చేయాలని ఫోర్స్ మోటార్స్ భావిస్తోంది. ఈ రెండు వేరియంట్లు కూడా వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి మార్కెట్లోకి రావచ్చని అంచనా. అయితే, యాంత్రికపరంగా ఈ రెండు వేరియంట్లలోనూ ఎలాంటి మార్పులు ఉండబోవు, కేవలం ఫీచర్లలో మాత్రమే మార్పులు ఉండనున్నాయి. ప్రస్తుతం ఫోర్స్ వన్ కోసం ఇండియాలో 25 డీలర్‌షిప్ కేంద్రాలున్నాయి. త్వరలోనే ఈ సంఖ్యను 50కు పెంచుకోవాలని కంపెనీ యోచిస్తోంది.

ఫోర్స్ వన్ ఎస్‌యూవీ

ఫోర్స్ వన్ ఎస్‌యూవీ

గతేడాది ఆగస్ట్ నెలలో ప్రఖ్యాత బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా భారత మార్కెట్లో విడుదలైన ఫోర్స్ మోటార్స్ మొట్టమొదటి ఎస్‌యూవీ 'ఫోర్స్ వన్' (Force One)లో ఓ చవక వేరియంట్‌ను తీసుకువచ్చేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తుంది.

ఫోర్స్ వన్ ఎస్‌యూవీ

ఫోర్స్ వన్ ఎస్‌యూవీ

వాణిజ్య వానాల తయారీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాధించుకున్న ఫోర్స్ మోటార్స్, ఫోర్స్ వన్‌ను దేశీయ విపణిలోకి విడుదల చేయటం ద్వారా ప్యాసింజర్ వాహన విభాగంలోకి అడుగుపెట్టింది.

ఫోర్స్ వన్ ఎస్‌యూవీ

ఫోర్స్ వన్ ఎస్‌యూవీ

ఫోర్స్ వన్‌ను మార్కెటింగ్ చేయటంలో కంపెనీ పెద్దగా సక్సెస్‌ను సాధించలేకపోయింది. ఈ మోడల్‌కు అమితాబ్ బచ్చన్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించినప్పటికీ ఆశించిన ఫలితాలు మాత్రం కనిపించలేదు.

ఫోర్స్ వన్ ఎస్‌యూవీ

ఫోర్స్ వన్ ఎస్‌యూవీ

ఈ నేపథ్యంలో, తమ ఫోర్స్ వన్ అమ్మకాలును పెంచుకునేందుకు, ఎస్‌యూవీ సెగ్మెంట్లోని ధరల యుద్దాన్ని ధీటుగా ఎదుర్కునేందుకు ఫోర్స్ మోటార్స్ ఇందులో ఓ చవక వేరియంట్‌ను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది.

ఫోర్స్ వన్ ఎస్‌యూవీ

ఫోర్స్ వన్ ఎస్‌యూవీ

అంతేకాకుండా, ఈ మోడల్‌కు మరిన్ని విలాసవంతమైన ఫీచర్లను జోడించిన ఓ టాప్-ఎండ్ వేరియంట్‌ను కూడా విడుదల చేయాలని ఫోర్స్ మోటార్స్ భావిస్తోంది.

ఫోర్స్ వన్ ఎస్‌యూవీ

ఫోర్స్ వన్ ఎస్‌యూవీ

అయితే, యాంత్రికపరంగా ఈ రెండు వేరియంట్లలోనూ ఎలాంటి మార్పులు ఉండబోవు, కేవలం ఫీచర్లలో మాత్రమే మార్పులు ఉండనున్నాయి.

ఫోర్స్ వన్ ఎస్‌యూవీ

ఫోర్స్ వన్ ఎస్‌యూవీ

ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ఫోర్స్ వన్ ఎస్‌యూవీలో 2148 సీసీ (2.2 లీటర్) ఇన్‌లైన్-ఫోర్ సిలిండర్ టర్బో డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 3800 ఆర్‌పిఎమ్ వద్ద 140 బిహెచ్‌పిల శక్తిని, 1600 ఆర్‌పిఎమ్ వద్ద 321 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఫోర్స్ వన్ ఎస్‌యూవీ

ఫోర్స్ వన్ ఎస్‌యూవీ

ఫోర్స్ వన్ ఎస్‌యూవీ స్పెసిఫికేషన్స్:

* వీల్ బేస్ : 3025 ఎమ్ఎమ్

* పొడవు : 4860 ఎమ్ఎమ్

* వెడల్పు : 1780 ఎమ్ఎమ్

* ఎత్తు : 1885 ఎమ్ఎమ్

* బరువు : 2510 ఎమ్ఎమ్

* వారంటీ : 3 సంవత్సరాలు / 100000 కి.మీ.

ఫోర్స్ వన్ ఎస్‌యూవీ

ఫోర్స్ వన్ ఎస్‌యూవీ

అల్లాయ్ వీల్స్

ఫోర్స్ వన్ ఎస్‌యూవీ

ఫోర్స్ వన్ ఎస్‌యూవీ

సెంటర్ కన్సోల్

ఫోర్స్ వన్ ఎస్‌యూవీ

ఫోర్స్ వన్ ఎస్‌యూవీ

స్ప్లిట్ సైలెన్సర్

ఫోర్స్ వన్ ఎస్‌యూవీ

ఫోర్స్ వన్ ఎస్‌యూవీ

క్లచ్ రెస్ట్, క్లచ్, బ్రేక్, యాక్సిలరేటర్ పెడల్స్

ఫోర్స్ వన్ ఎస్‌యూవీ

ఫోర్స్ వన్ ఎస్‌యూవీ

ఎలక్ట్రిక్ సైడ్ వ్యూ మిర్రర్

ఫోర్స్ వన్ ఎస్‌యూవీ

ఫోర్స్ వన్ ఎస్‌యూవీ

సైడ్ స్కర్ట్స్

ఫోర్స్ వన్ ఎస్‌యూవీ

ఫోర్స్ వన్ ఎస్‌యూవీ

క్లియర్ లెన్స్ టెయిల్ ల్యాంప్స్

ఫోర్స్ వన్ ఎస్‌యూవీ

ఫోర్స్ వన్ ఎస్‌యూవీ

పవర్, టైటబిల్ స్టీరింగ్

ఫోర్స్ వన్ ఎస్‌యూవీ

ఫోర్స్ వన్ ఎస్‌యూవీ

ఆల్ పవర్ విండోస్

ఫోర్స్ వన్ ఎస్‌యూవీ

ఫోర్స్ వన్ ఎస్‌యూవీ

హైట్ అడ్జస్టబల్ డ్రైవర్ సీట్

ఫోర్స్ వన్ ఎస్‌యూవీ

ఫోర్స్ వన్ ఎస్‌యూవీ

విశాలమైన బూట్ స్పేస్

ఫోర్స్ వన్ ఎస్‌యూవీ

ఫోర్స్ వన్ ఎస్‌యూవీ

సెంటర్ రియర్ వ్యూ మిర్రర్

ఫోర్స్ వన్ ఎస్‌యూవీ

ఫోర్స్ వన్ ఎస్‌యూవీ

5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్

ఫోర్స్ వన్ ఎస్‌యూవీ

ఫోర్స్ వన్ ఎస్‌యూవీ

డే / నైట్ అడ్జస్టమెంట్‌తో కూడిన ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్


ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ఫోర్స్ వన్ ఎస్‌యూవీలో 2148 సీసీ (2.2 లీటర్) ఇన్‌లైన్-ఫోర్ సిలిండర్ టర్బో డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 3800 ఆర్‌పిఎమ్ వద్ద 140 బిహెచ్‌పిల శక్తిని, 1600 ఆర్‌పిఎమ్ వద్ద 321 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఫోర్స్ మోటార్స్ ఈ ఇంజన్‌ను మెర్సిడెస్ బెంజ్‌ నుంచి గ్రహించబడినది. ఇది ఫైవ్ స్పీడ్ మ్యాన్యువల్ గేర్ సిస్టమ్‌తో జతచేయబడి ఉంటుంది. ప్రస్తుతం ఇది టూ-వీల్ (4x2) డ్రైవ్ ఆప్షన్‌లో మాత్రమే లభిస్తోంది. వచ్చే ఏడాదిలో ఇందులో ఫోర్-వీల్ (4x4) డ్రైవ్ ఆప్షన్ కలిగిన వేరియంట్‌ను కూడా ఫోర్స్ మోటార్స్ విడుదల చేయనుంది.

ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం, ఫోర్స్ వన్ ఎస్‌యూవీ లీటరుకు 11.6 కిలోమీటర్ల మైలేజీనిస్తుంది. రాష్ట్ర మార్కెట్లో ఫోర్స్ వన్ ఎస్‌యూవీ ధరలు రూ.11.72 లక్షలు (5+డి), ధరలు రూ.11.64 లక్షలు (6+డి)గా ఉన్నాయి (అన్ని ధరలు కూడా ఎక్స్-షోరూమ్, హైదరాబాద్).

ఫోర్స్ వన్ ఎస్‌యూవీ ఫీచర్లు:
* పవర్ స్టీరింగ్, టైటబిల్ స్టీరింగ్, సెంట్రల్ లాక్, పవర్ విండోస్, రియర్ స్పాయిలర్
* డే / నైట్ అడ్జస్టమెంట్‌తో కూడిన ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్
* వుడెన్ ఫినిష్ ప్యానెల్
* మూడు సీట్ల వరుసల్లోనూ ఏసి ప్రసరించేలా ఏర్పాటు చేసిన వెంట్స్ (రంధ్రాలు)
* నాలుగు స్పీకర్లు, యూఎస్‌బి, ఆక్స్ ఇన్, బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన ఆడియో సిస్టమ్
* స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్
* క్రూయిజ్ కంట్రోల్
* కీలెస్ ఎంట్రీ సిస్టమ్
* రివర్స్ సెన్సార్
* రియర్ డిఫాగ్గర్
* మొబైల్, ల్యాప్‌టాప్స్ వంటి పరికరాలను చార్జ్ చేసుకునేందుకు వీలుగా ముందు/వెనుక సీట్లలో ఏర్పాటు చేసిన సాకెట్లు
* 16 పాయింట్ మల్టీ ఇన్‌ఫర్మేషన్ డిస్‌ప్లే సిస్టమ్
* ఇల్యుమినేషన్ కంట్రోల్
* ఇంకా ఇందులో టాకో మీటర్, ఓడోమీటర్, గ్లోవ్ బాక్స్, సన్ విజర్, ఫ్రంట్ ఫాంగ్ ల్యాంప్స్, డోర్ వార్నింగ్ వంటి ఎన్నో ఆకర్షనీయమైన ఫీచర్లు ఉన్నాయి.

Most Read Articles

English summary
Force Motors is planning to launch a price cut variant as well as a top-end variant of its one and only Force One SUV. Both of these variants are expected to be rolled out in February 2013.
Story first published: Monday, December 17, 2012, 18:12 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X