రాష్ట్రంలో నేటి నుంచి అమల్లోకి వచ్చిన సన్ ఫిల్మ్‌ల వాడకంపై నిషేధం

హైదరాబాద్‌‌: రాష్ట్ర రాజధానిలో వాహనాలకు బ్లాక్ ఫిల్ముల వాడకాన్ని నిషేధిస్తున్నట్లు గతంలో తెలుగు డ్రైవ్ స్పార్క్ ఓ కథనంలో ప్రచురించిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు.. రాష్ట్రంలో నేటి (అక్టోబర్ 25, 2012) నుంచి అమల్లోకి వచ్చింది. మోటార్ వాహన చట్టానికి విరుద్ధం, పరిమితులకు మించి వాహనాలకు నల్లటి అద్దాలను ఉపయోగించినా లేదా గ్లాసులపై నల్లటి ఫిల్ములను (సన్ ఫిల్మ్) అంటించినా అది చట్టరీత్యా నేరం అవుతుంది. అందుకు బాధ్యులైన వాహన యజమానుల నుంచి భారీ మొత్తాలలో జరిమానాలు వసూలు చేయటం జరుగుతుంది.

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఇప్పటికే నగరంలో సంచరించే వాహనాలకు సన్ ఫిల్ముల వాడకంపై నిషేధం గురించి పలు ప్రసార మాధ్యమాల ద్వారా భారీ ఎత్తున ప్రచారం నిర్వహించారు. అంతేకాకుండా, నగరంలో సన్ ఫిల్ముల వ్యాపారం చేసే విడిభాగాల కంపెనీల డీలర్లు, షాపు ఓనర్లను కూడా పిలిపించి పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఇకపై మార్కెట్లో వీటిని విక్రయించడం, అక్రమంగా వాహన అద్దాలకు వీటిని అంటించడం చేయరాదని హెచ్చరికలు కూడా జారీ చేశారు. సన్ ఫిల్ములు తొలగించని వాహనాలపై అక్టోబర్ 25, 2012 నుంచి ట్రాఫిక్ అధికారులు జరిమానాలను విధిస్తున్నారు.

Hyderabad: Using Black Films On Cars Banned From Today

"కేంద్ర మోటార్ వాహన చట్టంలోని 100వ నిబంధన ప్రకారం, వాహనాల తయారీదారులు బిగించే ఫ్రంట్ విండ్‌స్క్రీన్స్ (ముందు వైపు అద్దం), రియర్ విండ్‌స్క్రీన్ (వెనుక వైపు అద్దం)లు 70 శాతం విజువల్ లైట్ ట్రాన్స్‌మిషన్ (విఎల్‌టి)ను, కారుకు పక్కల ఉండే అద్దాలు (కారు డోర్లకు అమర్చిన అద్దాలు) 50 విఎల్‌టిని కలిగి ఉండాలి". ఒక్కమాటలో చెప్పాలంటే, వాహనాల తయారీదారులు బిగించే అద్దాలపై (ఫ్యాక్టరీ ఫిట్టెడ్ గ్లాసెస్) ఎలాంటి నల్లటి ఫిల్ములను, విజబలిటీని తగ్గించే పదార్థాలు/వస్తువులను ఉపయోగించరాదు.

సాధారణంగా వాహనాలను తయారు చేసే కంపెనీలు ఈ నియమాన్ని దృష్టిలో ఉంచుకొనే అద్దాలను ఉపయోగించడం జరుగుతుంది. కాబట్టి, ఫ్యాక్టరీ ఫిట్టెడ్ గ్లాసెస్‌లపై ఏ రకమైన సన్ ఫిల్ములను ఉపయోగించిన అది చట్ట వ్యతిరేకమే అవుతుంది. దుండగులు వాహనాలకు నల్లటి ఫిల్ములు కలిగిన అద్దాలను ఉపయోగించి తద్వారా అత్యాచారాలు, అపహరణలు మొదలైన అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న నేపథ్యంలో, వీటిని అదుపు చేసేందుకు గానూ వాహనాలకు నల్లటి ఫిల్ముల ఉపయోన్ని సుప్రీం కోర్టు నిషేధించింది. మరి మీ కారుకు బ్లాక్ ఫిల్ములను తొలగించారా..?

Most Read Articles

English summary
Enforcement of Supreme Court Order to remove Black Films from vehicles has started from today. Have you taken necessary steps to comply with this rule..?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X