పవర్‌ఫుల్ ఆడి క్యూ7లో బాలయ్య పవర్‌ఫుల్ సవారీ

Posted By:

ఎప్పుడూ పవర్‌ఫుల్ క్యారెక్టర్లు చేస్తూ, పవర్‌ఫుల్‌గా కనిపించే మన పవర్‌ఫుల్ బాలయ్య ఉపయోగించే పవర్‌ఫుల్ వాహనం ఏంటో తెల్సా..? ఇప్పటికే అనేకమంది బాలీవుడ్ భామలు, నటీనటుల పార్కింగ్ గ్యారేజ్‌లో కొలువుదీరి ఉండే 'ఆడి క్యూ7' లగ్జరీ ఎస్‌యూవీ మన బాలయ్య బాబు కార్ కలెక్షన్‌లో భాగంగా మారిపోయింది. నందమూరి బాలకృష్ణ వద్ద ఓ నలుపు రంగు ఆడి క్యూ7 ఎస్‌యూవీ ఉన్నట్లు సమాచారం. ఇదిగో ఆ కారులో ప్రయాణిస్తూ, కెమెరాకు చిక్కిన బాలయ్యను ఈ ఫోటోల్లో గమనించవచ్చు.

ఆడి క్యూ7 ఎస్‌యూవీ విలాసానికే కాకుండా, ప్రచారాలకు లేదా ప్రజా సమావేశాలకు వెళ్లేటప్పుడు కారు దిగకుండానే కారులో నుంచి ప్రజలకు అభివాదం చేసేందుకు ఇందులో ఆటోమేటిక్ సన్‌రూఫ్ అంటుంది. ఒక్క చిన్న బటన్‌ను నొక్కగానే రూఫ్ వెనక్కు వెళ్లిపోయి, కారులోనుంచి ఒక వ్యక్తి బయటకు వచ్చి నిలుచుకునేందుకు వీలుగా ఉంటుంది. జర్మనీకు చెందిన ప్రముఖ లగ్జరీ కార్ కంపెనీ ఆడి ఇండియా దేశీయ విపణిలో క్యూ సిరీస్‌లో అందిస్తున్న అత్యంత విలాసవంతమైన మరియు ఖరీదైన కారు కూడా ఇదే.

ఆడి క్యూ7 మూడు విభిన్న ఇంజన్ ఆప్షన్లతో పెట్రోల్ మరియు డీజిల్ వేరియంట్లలో లభ్యమవుతుంది. 3.0 లీటర్ టిడి క్వాట్రో డీజిల్ ఇంజన్ 180 కి.వా. శక్తిని, 550 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది లీటరుకు 12.62 కి.మీ. మైలేజీనిస్తుంది. అలాగే, 4.2 లీటర్ టిడిఐ క్వాట్రో డీజిల్ వేరియంట్ గరిష్టంగా 250 కి.వా. శక్తిని, 800 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇది లీటర్ డీజిల్‌కు 10.10 కి.మీ. మైలేజీని ఆఫర్ చేస్తుంది. ఇకపోతే 3 లీటర్ టిఎఫ్ఎస్ఐ క్వాట్రో వి6-సిలిండర్ పెట్రోల్ వేరియంట్ గరిష్టంగా 245 కి.వా. శక్తిని, 440 ఎన్‌ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇది లీటర్ పెట్రోల్‌కు 8.62 కి.మీ. మైలేజీని ఆఫర్ చేస్తుంది.

ఈ మూడు ఇంజన్లు కూడా 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభ్యమవుతాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, అధునాతన భద్రతా ఫీచర్లతో ఆడి ఇండియా తమ పవర్‌ఫుల్ క్యూ7 ఎస్‌యూవీని అభివృద్ధి చేసింది భారత మార్కెట్లో ఆడి క్యూ7 ఎస్‌‌యూవీ ప్రారంభ ధర రూ.60 లక్షలకు పైగానే ఉంది. ఆడి క్యూ7 లగ్జరీ ఎస్‌యూవీని కంపెనీ ఇప్పటి వరకూ సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్‌లో ఇండియన్ మార్కెట్లో దిగుమతి చేసుకొని కంపెనీ ఇక్కడి మార్కెట్లో విక్రయించడం జరుగుతోంది. కాగా.. ఆడి ఇండియా ఇటీవలే ఔరంగాబాద్‌లోని ప్లాంట్‌లో ఆడి ఈ క్యూ7 ఎస్‌యూవీ అసెంబ్లింగ్‌ను ప్రారంభించింది.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
బాలకృష్ణ - ఆడి క్యూ7

బాలకృష్ణ - ఆడి క్యూ7

బాలకృష్ణ - ఆడి క్యూ7

బాలకృష్ణ - ఆడి క్యూ7

బాలకృష్ణ - ఆడి క్యూ7

బాలకృష్ణ - ఆడి క్యూ7

బాలకృష్ణ - ఆడి క్యూ7

బాలకృష్ణ - ఆడి క్యూ7

బాలకృష్ణ - ఆడి క్యూ7

బాలకృష్ణ - ఆడి క్యూ7

బాలకృష్ణ - ఆడి క్యూ7

బాలకృష్ణ - ఆడి క్యూ7

ఆడి క్యూ7

ఆడి క్యూ7

ఆడి క్యూ7

ఆడి క్యూ7

ఆడి క్యూ7

ఆడి క్యూ7

ఆడి క్యూ7

ఆడి క్యూ7

ఆడి క్యూ7

ఆడి క్యూ7

ఆడి క్యూ7

ఆడి క్యూ7

ఆడి క్యూ7

ఆడి క్యూ7

ఆడి క్యూ7

ఆడి క్యూ7

ఆడి క్యూ7

ఆడి క్యూ7

ఆడి క్యూ7

ఆడి క్యూ7

ఆడి క్యూ7

ఆడి క్యూ7

ఆడి క్యూ7

ఆడి క్యూ7

ఆడి క్యూ7

ఆడి క్యూ7

ఆడి క్యూ7

ఆడి క్యూ7

ఆడి క్యూ7

ఆడి క్యూ7

ఆడి క్యూ7

ఆడి క్యూ7

ఆడి క్యూ7

ఆడి క్యూ7

English summary
Tollywood powerful hero Nandamuri Balakrishna seems to be a great fan of German luxury car brand Audi. You can see in the above pics, where Balakrishna is enjoying the drive in his black colour Audi Q7 premium SUV.
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark