ఏడు కొండల ఎంకన్నకు అశోక్ లేలాండ్ స్టైల్ ఎమ్‌పివి

By Ravi

ఏడు కొండల వెంకన్న స్వామికి భక్తులు తమకు నచ్చిన వస్తువులను కానుకగా ఇస్తుంటారు. గతంలో ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ రెనో రెనో ఇండియా భారత మార్కెట్లోకి ప్రవేశించిన సందర్భంగా తమ మొట్టమొదటి కారు (రెనో ఫ్లూయెన్స్)ను స్వామి వారికిగా కానుకగా సమర్పించుకుంటే, కర్నూలు జిల్లాకు చెందిన సత్య మోటార్స్ పియాజ్జియో ఆపే మినీ ట్రక్కును, మహీంద్రా టూవీలర్స్ తమ కొత్త డ్యూరో డిజెడ్ స్కూటర్లను తిరుమల తిరుపతి దేవస్థానానికి కానుకగా సమర్పించుకున్నారు.

తాజాగా.. భారతదేశపు అతిపెద్ద వాణిజ్య వాహనాల తయారీ కంపెనీ అశోక్ లేలాండ్ తమ తొలి ప్యాసింజర్ కారు 'అశోక్ లేలాండ్ స్టైల్'ను తితిదేకి సమర్పించింది. అశోక్ లేలాండ్ వైస్ ఛైర్మన్ శ్రీ సంపత్ ఇటీవలే విడుదల చేసిన అశోక్ లేలాండ్ స్టైల్ ఎమ్‌పివి తొలి వాహనాన్ని తితిదేకు అందజేశారు. ఈ వాహనం విలువ సుమారు రూ.9.2 లక్షలు. తితిదే చైర్మన్ కె. బాపి రాజు వాహనం తాళం చెవులను అందుకున్నారు. జిఎమ్ ట్రాన్స్‌పోర్ట్ శేషారెడ్డి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

Ashok Leyland Stile

హిందూజా గ్రూపుకు చెందిన ఫ్లాగ్‌షిప్ ఆటోమొబైల్ కంపెనీ అశోక్ లేలాండ్ తమ జపాన్ భాగస్వామి నిస్సాన్‌తో చేతులు కలిపి రూపొందించిన తమ తొలి ప్యాసింజర్ కారు 'అశోక్ లేలాండ్ స్టైల్' ఎమ్‌పివిని గడచిన అక్టోబర్ నెలలో రాష్ట్ర మార్కెట్లో విడుదల చేసింది. మార్కెట్లో దీని ధరలు రూ.7.49 లక్షల నుంచి రూ.9.29 లక్షల రేంజ్‌లో ఉన్నాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, హైదరాబాద్).

నిస్సాన్ ఇవాలియా ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని అభివృద్ధి చేసిన ఈ కొత్త అశోక్ లేలాండ్ స్టైల్ 7-సీటర్ ఎమ్‌పి డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తో మొత్తం 3 వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో నిస్సాన్ నుంచి గ్రహించిన 1.5 లీటర్ కె9కె డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 75 పిఎస్‌ల గరిష్ట శక్తిని, 185 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్‌‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.
Most Read Articles

English summary
Sri Sampath, Vice Chairman of Ashok Leyland has donated Ashok Leyland Stile Car first vehicle of a newly launched model car worth about Rs. 9.2 lakhs introduced for the first time in the country to TTDs. The donation has been received by TTD Chairman Sri K.Bapi Raju on Friday morning in front of Tirumala Shrine.
Story first published: Saturday, December 21, 2013, 15:20 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X