ఈ ఆర్థిక సంవత్సరంలో 1000 స్టైల్ ఎమ్‌పివిలను విక్రయిస్తాం!

By Ravi

హిందూజా గ్రూపుకు చెందిన ఫ్లాగ్‌షిప్ ఆటోమొబైల్ కంపెనీ అశోక్ లేలాండ్ ఇటీవలే మార్కెట్లో విడుదల చేసిన తమ తొలి ప్యాసింజర్ కారు 'అశోక్ లేలాండ్ స్టైల్' ఎమ్‌పివిని ఈ ఆర్థిక సంవత్సరంలో 1000 యూనిట్లను విక్రయిస్తామని కంపెనీ అధికారి ఒకరు వెల్లడించారు.

అశోక్ లేలాండా తమ జపాన్ భాగస్వామి నిస్సాన్‌తో చేతులు కలిపి రూపొందించిన మొదటి ఉత్పత్తి దోస్త్ ఎల్‌సివి తర్వాత వస్తున్న రెండవ ఉత్పత్తి స్టైల్ ఎమ్‌పివి. దోస్త్ వాణిజ్య వాణిజ్య వాహనం కాగా, స్టైల్ ప్యాసింజర్ వాహనం. హైదరాబాద్ మార్కెట్లో అశోక్ లేలాండ్ స్టైల్ ఎమ్‌పివి ధరలు రూ.7.49 లక్షల నుంచి రూ.9.29 లక్షల రేంజ్‌లో ఉన్నాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, హైదరాబాద్).

Ashok Leyland Stile

తాజాగా, ఈ ఎమ్‌పివిని తమిళనాడు, కేరళ మార్కెట్లలో విడుదల చేసిన సందర్భంగా, కంపెనీ రీజనల్ మేనేజర్ (సౌత్) నాగ సెంథిల్ ప్రభు మాట్లాడుతూ.. మార్కెట్ నుంచి స్టైల్ ఎమ్‌పివికి మంచి స్పందన లభిస్తోందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 1000 యూనిట్ల స్టైల్ ఎమ్‌పివిలను విక్రయించాలనే లక్ష్యంతో ఉన్నామని చెప్పారు.

నిస్సాన్ ఇవాలియా ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని అభివృద్ధి చేసిన ఈ కొత్త అశోక్ లేలాండ్ స్టైల్ 7-సీటర్ ఎమ్‌పి డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తో మొత్తం 3 వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో నిస్సాన్ నుంచి గ్రహించిన 1.5 లీటర్ కె9కె డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 75 పిఎస్‌ల గరిష్ట శక్తిని, 185 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్‌‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం ఇది లీటరుకు 20.7 కి.మీ. మైలేజీనిస్తుంది.

Most Read Articles

English summary
Ashok Leyland targets to sell about 1,000 units of newly launched multi purpose vehicle STILE by this fiscal-end. Priced at Rs 7.50 lakh (ex-showroom, Delhi), the Stile is basically a rebadged version of the Nissan Evalia which will be manufactured at Nissan's production facility at Oragadam in Tamil Nadu.
Story first published: Saturday, October 26, 2013, 11:50 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X