50 వేల సేల్స్ మార్క్‌కు దగ్గర్లో ఉన్న హోండా అమేజ్
హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ గడచిన ఏప్రిల్ నెలలో తమ సరికొత్త కాంపాక్ట్ కారు అమేజ్ సెడాన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. అప్పటి నుండి ఈ కారు దేశీయ విపణిలో హాట్ కేకుల్లా అమ్ముడుపోతుంది. దాదాపు 7 నెలల సమయంలోనే హోండా అమేజ్, అమ్మకాల పరంగా ఓ కొత్త మైలురాయిని చేరుకోబోతుంది. ఇది హోండా నుంచి లభిస్తున్న తొలి డీజిల్ కారు కావటంతో, అమేజ్ ఇంతటి సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకోగలిగింది.
విజయాన్ని పురస్కరించుకొని హోండా తమ అమేజ్ కస్టమర్లకు చాక్లెట్ బాక్సులను కానుకగా ఇచ్చి సంబరాలు చేసుకుంటుంది. అంతేకాకుండా, ఈ ఏడాది చివరి లోపుగా హోండా అమేజ్ కాంపాక్ట్ సెడాన్ కారును బుక్ చేసుకునే వారికి ఫారిన్ ట్రిప్‌ను గెలుచుకునే అవకాశాన్ని కూడా హోండా కల్పిస్తోంది. హోండా అమేజ్ డీజిల్ సక్సెస్ కావటంతో మరిన్ని డీజిల్ కార్లను విడుదల చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తుంది.
ఇది కూడా చదవండి.. 2014 హోండా సిటీ డీజిల్ విడుదల
హోండా ఇటీవలే తమ సరికొత్త 2014 హోండా సిటీ సెడాన్‌ను ఆవిష్కరించిన సంగతి తెలిసినదే. ఈ కొత్త సిటీ సెడాన్ 1.5 లీటర్ ఐ-విటెక్ పెట్రోల్ ఇంజన్‌తో పాటుగా, 1.5 లీటర్ ఐ-డిటెక్ డీజిల్ ఇంజన్‌తో కూడా లభ్యం కానుంది. సిటీ సెడాన్ విడుదల తర్వాత బ్రయో ఆధారిత ఎమ్‌పివి 'హోండా మొబిలో', అలాగే సరికొత్త ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ '2014 హోండా జాజ్' మోడళ్లకు భారత్‌కు రానున్నాయి. ఈ రెండు మోడళ్ల కూడా పెట్రోల్ ఇంజన్‌తో పాటుగా డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తో కూడా లభ్యం కానున్నాయి. వీటి తర్వాత హోండా కాంపాక్ట్ ఎస్‌యూవీ '2014 హోండా వెజెల్' కూడా ఇండియాకు రానుంది.
హోండా అమేజ్ సెడాన్ పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తో మొత్తం 10 వేరియంట్లలో (6 పెట్రోల్, 4 డీజిల్) లబిస్తుంది. హోండాకు అమేజ్ మొట్టమొదటి డీజిల్ కారు. భారత్‌లో లభిస్తున్న డీజిల్ కార్లలో కెల్లా అత్యధిక మైలేజీనిచ్చే కారు కూడా అమేజ్ కావటం విశేషం.


Click it and Unblock the Notifications









