మాక్సిమో మినీ ట్రక్కును విడుదల చేసిన మహీంద్రా

By Ravi

ఆటోమొబైల్ రంగంలో వివిధ విభాగాల్లో ఉత్పత్తులను అందిస్తున్న దేశీయ ఆటో దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా, చిన్న తరహా వాణిజ్య అవసరాల కోసం రూపొందించిన ఓ సరికొత్త మినీ ట్రక్కును మార్కెట్లో విడుదల చేసింది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన మాక్సిమో ప్లస్ మినీ ట్రక్కును కంపెనీ ప్రవేశపెట్టింది.

మహీంద్రా మాక్సిమో ప్లస్ మినీ ట్రక్ 0.85 టన్నుల పేలోడ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇందులో శక్తివంతమైన 26 హెచ్‌పి ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది లీటరుకు 21.9 కిలోమీటర్ల మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది.

కొత్త మాక్సిమో ప్లస్ 2 ఏళ్లు లేదా 60,000 కిలోమీటర్ల వారంటీతో లభిస్తుంది. ఇది ఆప్పీ రెడ్, డైమండ్ వైట్ అనే రంగులలో లభిస్తుంది. 2012లో విడుదల చేసిన మహీంద్రా మాక్సిమో ట్రక్కును మరింత అప్‌గ్రేడ్ చేసి ఈ మాక్సిమో మినీ ట్రక్కును రూపొందించామని కంపెనీ వివరించింది. దేశీయ విపణిలో ఈ మహీంద్రా మాక్సిమో ప్లస్ మినీ ట్రక్కు ధర రూ.3.46 లక్షలు (ఎక్స్-షోరూమ్, బెంగుళూరు)గా ఉంది.

Mahindra Launches Maxximo Plus Mini Truck
Most Read Articles

English summary
Mahindra & Mahindra has launched the new Maxximo Plus in Bengaluru On Tuesday. Equipped with the pioneering yet simple-to-use Fuel Smart technology, the new Maxximo Plus allows the customer to choose between higher power (26 HP; 19.2 kW) OR higher mileage (21.9 KMPL), as and when he needs, at the press of a switch. Maxximo Plus is attractively priced at Rs. 3.46 Lac (BS3, Ex-showroom Bengaluru).
Story first published: Wednesday, March 6, 2013, 12:48 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X