నో పార్కిగ్ స్థలంలో వాహనం పార్క్ చేస్తే రూ.1,000 ఫైన్

By Ravi

Traffic Violation
హైదరాబాద్: మీకు తరచూ నో పార్కిగ్ స్థలంలో వాహనం పార్క్ చేసే అలవాటు ఉందా? సిగ్నల్ వద్ద ట్రాఫిక్ పోలీసులు ఎవరూ లేరని సిగ్నల్ జంప్ చేస్తున్నారా? సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ వాహనం నడుపే అలవాటుందా..? అయితే, ఇకపై మీ ఆటలు ఎట్టి పరిస్థితుల్లోను సాగవు. ఇలాంటి ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనకు ఇప్పుడు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు రూ.1,000 జరిమానా విధిస్తున్నారు.

గడచిన సోమవారం నుంచి కొత్త ట్రాఫిక్ జరిమానాలను హైదరబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసులు అమల్లోకి తీసుకువచ్చారు. ఇప్పటికే 50 కేసులను వ్రాంగ్ పార్కింగ్ క్రింద బుక్ చేసినట్లు ఓ ఉన్నత పోలీసు అధికారి వెల్లడించారు. నోపార్కింగ్ స్థలాల్లో పార్క్ చేయటం, మొబైల్ ఫోన్ ఉపయోగిస్తూ డ్రైవ్ చేయటం, సిగ్నల్ జంపింగ్, సరైన పరిమితులు లేకుండా డ్రైవ్ చేయటం, ప్రమాదకరంగా డ్రైవ్ చేయటం వంటి తప్పులు ఇక నుంచి రూ.1,000 జరిమానా విధించనున్నారు.

భారత ప్రభుత్వం 2011లో జారీ చేసిన జీవో ఎమ్ఎస్ 108 ప్రకారం పెనాల్టీలను రూ.1,000 లకు పెంచడం జరిగింది. ఈ కొత్త జరిమానాలను ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో అమల్లో ఉన్నాయి. మన రాష్ట్రంలో వీటిని తాజాగా అమల్లోకి తీసుకువచ్చారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన కోసం జరిమానాలో పెంపును విధిస్తూ ప్రభుత్వం జారీ చేసిన పాత ఆదేశాలను హైదరాబాద్ పోలీసులు ఇప్పుడు అమల్లోకి తీసుకువచ్చారు.

ఇది వరకు ప్రమాదకరంగా/తప్పుగా పార్కింగ్ చేసినందుకు గాను రూ.200-300 ఉండే జరిమానా ఇప్పుడు రూ.1,000 లకు పెరిగింది. అలాగే, సిగ్నల్ జంప్ చేసిన వారి నుంచి ఇదివరకు రూ.200-300 వసూలు చేసే జరిమానా ఇప్పుడు రూ.1,000 లకు పెరిగింది. ఇకపోతే సెల్‌ఫోన్ డ్రైవింగ్ విషయంలో ఇదివరకూ రూ.500 లుగా ఉన్న జరిమానా ఇప్పుడు రూ.1,000 లకు పెరిగింది.
మూలం: హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్

Most Read Articles

English summary
Traffic police on Monday pressed ahead with the implementation of high fine amounts of Rs.1,000 for traffic violations with more than 50 cases booked for wrong parking, a senior police official said. The heavy fines were also imposed on those driving while talking on mobile phones, signal jumping, driving without proper permits and dangerous driving.
Story first published: Tuesday, August 13, 2013, 14:37 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X