జర్మన్ ట్రాక్టర్ మార్కెట్లోకి ప్రవేశించిన సోనాలికా

Written By:
Sonalika
ఇంటర్నేషనల్స్ ట్రాక్టర్స్ లిమిటెడ్‌లో భాగమైన పంజాబ్‌కు చెందిన సోనాలికా గ్రూప్ ఇప్పుడు జర్మన్ ట్రాక్టర్ మార్కెట్లో కాలు మోపింది. భారత్‌లని టాప్ 4 ట్రాక్టర్ తయారీల కంపెనీలో ఒకటైన సోనాలికా ట్రాక్టర్స్ తమ హెవీ డ్యూటీ రేంజ్ ట్రాక్టర్లను జర్మనీలో జరుగుతున్న లీప్‌జింగ్‌లో జరిగిన ఓ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శనకు ఉంచింది.

సోనాలికా ఇప్పటికే 65 దేశాలకు తమ ట్రాక్టర్లను ఎగుమతి చేస్తుంది. తాజాగా జర్మనీ మార్కెట్‌లోకి ప్రవేశించడంతో మొత్తం యూరప్ మార్కెట్‌లో తమ పరిధిని మరింత విస్తరించుకున్నట్లయ్యిందని కంపెనీ తెలిపింది. జర్మన్ రైతుల అవసరాలకు తగిన విధంగా సోనాలికా ట్రాక్టర్లు ఉంటాయని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ దీపక్ మిట్టల్ తెలిపారు.

రైతులకు నిజమైన స్నేహితుడిగా పేరు తెచ్చుకున్న సోనాలికా అందిస్తున్న హెవీ డ్యూటీ ట్రాక్టర్ల శ్రేణిని జర్మన్ రైతులు, డీలర్లు చక్కగా ఆదరిస్తారని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తుంది. సింపుల్‌గా ఉండే డిజైన్ సాటిలేని సామర్థ్యాలు సోనాలికా హెవీ డ్యూటీ ట్రాక్టర్ల ప్రత్యేకతలు. సోనాలికా ట్రాక్టర్లలో ఉపయోగించే ఇంజన్లు యూరోపియన్ నిబంధనలకు లోబడి ఉంటాయి.

English summary
India's leading tractor manufacturers Sonalika Tractors had entered into the German tractor market with the introduction of its heavy duty range of tractors by taking part in the exhibition at Leipzig.
Story first published: Wednesday, June 5, 2013, 14:29 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark