అసెంబ్లీ ముట్టడి; హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఇక్కట్లు

తెలంగా పొలిటికల్ జాయింట్ యాక్షన్ కమిటీ నేడు 'చలో అసెంబ్లీ' అంటూ అసెంబ్లీని ముట్టడించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో రాజధానిలో కొన్ని రూట్లలో ట్రాఫిక్‌ అధికారులు ఆంక్షలు విధించారు. ఓ వైపు తెలంగాణా వాదుల ఆందోళన మరోవైపు వర్షం కారణంగా రాజధాని రోడ్లన్నీ ట్రాఫిక్‌తో నిండిపోయాయి. పలు రూట్లలో బస్సు సర్వీసులు కూడా నిలిచిపోయాయి.

మరోవైపు ప్రజలకు ప్రత్యామ్నాయంగా ఉన్న లోకల్ ట్రైన్ సర్వీసులకు కూడా అంతరాయం వాటిళ్లింది. దీంతో ప్రజలు తమ స్వంత వాహనాలకు పనిచెప్పి రోడ్డెక్కడంతో ఎటు చూసినా ట్రాఫిక్ జామ్ కనిపిస్తోంది. పెద్ద పెద్ద కూడళ్లు, జంక్షన్ల వద్ద ట్రాఫిక్ గంటల తరబడి నిలిచిపోతుంది. తెలంగా పొలిటికల్ జాయింట్ యాక్షన్ కమిటీ చలో సందర్భంగా పలు రూట్లలో ట్రాఫిక్‌ను మళ్లించారు.

కవాడిగూడ క్రాస్ రోడ్స్, ప్రాగా టూల్స్ టి జంక్షన్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, నారాయణగూడా క్రాస్ రోడ్స్, అశోక్ నగర్ క్రాస్ రోడ్స్, వివి స్టాచ్యూ, నిరంకారి భవన్, మాసబ్ ట్యాంక్ క్రాస్ రోడ్స్, కెసిపి, పంజాగుట్ట క్రాస్ రోడ్స్ ప్రాంతాల నుండి అసెంబ్లీ వైపుకు వెళ్లే ట్రాఫిక్‌ను ఉదయం 6.00 గంటల నుంచి అనుమతించడం మానేశారు. నగరంలో హై అలర్ట్‌ను ప్రకటించారు. భారీ భద్రతను ఏర్పాటు కూడా చేశారు. ఏదేమైనప్పటికీ, ఈ ఆందోళన వలన హైదరాబాద్‌లో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

Traffic Divertions Due To Chalo Assembly By TPJAC
Most Read Articles

English summary
Due to chalo assembly programme in Hyderabad by Telangana Political Joint action committee today traffic has been diverted in some areas. If possible please take alternative routes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X