చెన్నైలో నేటి నుంచి సీట్ బెల్ట్ రూప్ తప్పనిసరి!

By Ravi

చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలో నేటి కారు నడిపే వారు సీట్ బెల్ట్ ధరించడం తప్పనిసరి కానుంది. ఈ నిబంధనను అతిక్రమించన వారిపై అక్కడి ట్రాఫిక్ పోలీసులు భారీ జరిమానాను విధించనున్నారు. వాస్తవానికి ఈ నిబంధన గడచిన వారంలోనే అమలు కావల్సి ఉండగా, తమిళనాడు ట్రాఫిక్ పోలీసులు దీనిని మరో వారం వాయిదా వేసి, నేటి నుంచి అమల్లోకి తీసుకువచ్చేలా చేశారు.

కేవలం వాహనం నడిపే వారే కాకుండా, ఫ్రంట్ సీట్లో కూర్చునే ప్యాసింజర్లు కూడా సీట్ బెల్టులను ధరించడం తప్పనిసరి. ఈ నిబంధన టాక్సీ డ్రైవర్లు, అందులో ప్రయాణించే ప్యాసింజర్లకు కూడా వర్తిస్తుంది. ఈ అవగాహన క్యాంపైన్‌కు మంచి స్పందన లభిస్తోందని, మోటారిస్టులందరూ ఈ నిబంధనకు కట్టుబడి ఉంటారని ఆశిస్తున్నామని ట్రాఫిక్ అధికారులు చెప్పారు.

Seat Belt

సీట్ బెల్టులు ధరించకపోయినట్లయితే, అత్యవసర సమయాల్లో ప్రమాదం జరిగినప్పుడు ఫ్రంట్ సీట్లలో ఉండే డ్రైవర్, ప్యాసింజర్లకు తీవ్ర గాయాలు కావటం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు పోయే ఆస్కారం కూడా ఉంటుంది.

సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్, 1989లోని సెక్షన్ 138 (3) ప్రకారం, వాహనాలు చలనంలో ఉన్నప్పుడు సీట్ బెల్టును ఉపయోగించటం తప్పనిసరి. ఈ నిబంధనను ఉల్లంఘించిన వారికి మోటార్ వెహికల్ యాక్ట్, 1988లోని సెక్షన్ 177 ప్రకారం మొదటిసారి జరిమానాగా రూ.100 లను వసూలు చేస్తారు. ఆ తర్వాత కూడా ఇదే తప్పుకు పాల్పడినట్లయితే, ప్రతిసారి రూ.300ల చొప్పున జరిమానా వసూలు చేస్తారు.

Most Read Articles

English summary
Chennai Traffic Police will start enforcing eat-belt rule in the city from December 9. Drivers including taxi drivers and front-seat passengers too will have to wear the seat belts.
Story first published: Monday, December 9, 2013, 11:02 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X