వచ్చే ఏప్రిల్ నుంచి వాణిజ్య వాహనాలకు ఏబిఎస్ తప్పనిసరి!

Written By:

అన్ని రకాల ట్రక్కులు, బస్సులు మొదలైన వాణిజ్య వాహనాలు సైతం తప్పనిసరిగా యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌ (ఏబిఎస్)ను కలిగి ఉండేలా భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు గడచిన సంవత్సరం జూన్ నెలలో మేము ఓ కథనంలో ప్రచురించడం జరిగింది. ఈ విషయంలో తాజా అప్‌డేట్ ప్రకారం, వచ్చే ఏప్రిల్ (2015) నుంచి అన్ని కొత్త మోడళ్ల వాణిజ్య వాహనాలు తప్పనిసరిగా ఏబిఎస్‌ను కలిగి ఉండాలి.

గతంలో పేర్కొన్న ప్రతిపాదన ప్రకారం, ఉత్తమ రోడ్డు భద్రత కోసం 5 టన్నులకు పైబడి బరువు కలిగి ఉండే అన్ని బస్సులు అలాగే 12 టన్నుల కన్నా ఎక్కువ బరువును కలిగి ఉండే అన్ని ట్రక్కులు ఏబిఎస్ సేఫ్టీ ఫీచర్‌ను తప్పనిసరిగా కలిగి ఉండాలని భారత ప్రభుత్వం పేర్కొంది. అయితే, వాణిజ్య వాహనాల్లో ఏబిఎస్ ఫీచర్‌ను జోడించడం వలన అసలే ఖరీదైన ఈ రకం వాహనాలు ఈ ఫీచర్ చేరిక వలన మరింత ఎక్కువ ధరను కలిగి ఉండే ఆస్కారం ఉంది.

ABS Becomes Mandatory

ఏబిఎస్ అంటే ఏమిటి..? అదెలా పనిచేస్తుంది..?

సాదారణ బ్రేకింగ్ సిస్టమ్ (డ్రమ్/డిస్క్)లో రోడ్డుపై అత్యవసరంగా బ్రేక్ వేయాల్సిన పరిస్థితుల్లో బ్రేక్ వేసినప్పుడు టైర్లు తిరిగడం (టైర్ రోలింగ్) ఆగిపోయి టైర్లు రోడ్డపై రాచుకుంటూ, బ్రేకింగ్ దూరం పెరిగి వాహనం జారిపోయే ఆస్కారం ఉంది. అయితే, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌లో అత్యవసర పరిస్థితుల్లో బ్రేక్ వేసినప్పుడు టైర్లు తిరగడం ఆగిపోకుండానే వాహన వేగాన్ని పూర్తిగా నియంత్రించి, బ్రేకింగ్ దూరాన్ని (బ్రేకింగ్ డిస్టన్స్) తగ్గించి ప్రమాదం నుండి తప్పించుకోవడం జరుగుతుంది.

English summary
Staring April 2015, all new models of commercial vehicles need to have anti-lock braking system (ABS) compulsory for better road safety.
Story first published: Monday, June 30, 2014, 16:04 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark