ముగిసిన 2014 ఆటో ఎక్స్‌పో; 69 కొత్త వాహనాల లాంచ్

By Ravi

ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే భారత ఆటోమొబైల్ ఫెస్టివల్ 'ఆటో ఎక్స్‌పో' నిన్నటితో (ఫిబ్రవరి 11, 2014) ముగిసింది. ఫిబ్రవరి 5, 2014వ తేదీన ప్రారంభమైన ఈ 12వ ఎడిషన్ ఆటో ఎక్స్‌ను గతంలో నిర్వహించిన వేదిక (ప్రగతి మైదాన్)పై కాకుండా, ఈసారి గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్‌పో మార్ట్ వద్ద నిర్వహించారు.

ఫిబ్రవరి 5 నుంచి 11వ తేది వరకు మొత్తం ఏడు రోజుల పాటు జరిగిన ఈ ఆటో ఎక్స్‌పో 2014లో ఫిబ్రవరి 5, 6 తేదీలను కేవలం ప్రెస్ సందర్శనకు మాత్రమే కేటాయించగా, ఫిబ్రవరి 7 నుంచి 11 వరకు సాధారణ ప్రజానీకం యొక్క సందర్శనార్థం కేటాయించారు. ప్రెస్ డేస్‌లో భాగంగా, మొదటి రెండు రోజుల్లో 60,000 మందికి పైగా మీడియా ప్రతినిధులు హాజరయ్యారు.

ఈ 12వ ఎడిషన్ ఆటో ఎక్స్‌కు మొత్తం 5,61,000 మందికి పైగా వీక్షకలు విచ్చేశారు. ఈ సమయంలో సుమారు 69 కొత్త వాహనాలను వివిధ ఆటోమొబైల్ కంపెనీలు విడుదల చేశాయి. ఇంకా 26 కొత్త కార్లకు వరల్డ్ ప్రీమియర్ నిర్వహించారు. కాగా.. విడిభాగాలకు సంబంధించిన ఆటో ఎక్స్‌పోను ఇదివరకు న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ఫిబ్రవరి 6 నుంచి 9వ తేది వరకు నిర్వహించారు.

ఈ కార్యక్రమాన్ని మా డ్రైవ్‌స్పార్క్ బృందం ప్రత్యక్షంగా కవర్ చేసింది. ఈ 2014 ఆటో ఎక్స్‌పోకి సంబంధించిన అన్ని అప్‌డేట్లను ఈ లింక్‌పై కానీ లేదా క్రింది ఫొటోపై కానీ క్లిక్ చేసి పొందవచ్చు.

Most Read Articles

English summary
The Auto Expo 2014 ended on Tuesday with more than 560,000 people visiting the seven-day event, during the course of which, 69 vehicles were launched.
Story first published: Wednesday, February 12, 2014, 12:36 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X