వీడియో : బెంట్లీ ఎస్‌యూవీ టీజర్

By Ravi

బ్రిటీష్ లగ్జరీ కార్ కంపెనీ బెంట్లీ మోటార్స్, తమ మొట్టమొదటి ఎస్‌యూవీని వీలైనంత త్వరగా మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. గడచిన 2012 జెనీవా మోటార్ షోలో ఆవిష్కరించిన బెంట్లీ ఈఎక్స్‌‌పి 9 ఎఫ్ కాన్సెప్ట్‌ను ఆధారంగా చేసుకొని కంపెనీ ఓ పవర్‌ఫుల్ ఎస్‌యూవీని అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసినదే.

తాజాగా.. ఈ మోడల్‌కు సంబంధించిన ఓ టీజర్ వీడియోని బెంట్లీ విడుదల చేసింది. ఈ టీజర్ వీడియోని చూస్తుంటే, కొత్త బెంట్లీ ఎస్‌యూవీ డిటేలింగ్‌ను ఎడారి ఇసుక నుంచి స్ఫూర్తి పొంది డిజైన్ చేసినట్లు అనిపిస్తుంది. వచ్చే ఏడాది చివరి నాటికి కానీ లేదా 2016 ఆరంభంలో కానీ ప్రొడక్షన్ వెర్షన్ బెంట్లీ ఎస్‌యూవీ అందుబాటులోకి రానుంది.

Bentley SUV Teaser

ప్రస్తుతం బెంట్లీ కార్ బ్రాండ్‌ జర్మనీకి చెందిన ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ చేతిలో ఉంది. ఈ నేపథ్యంలో, బెంట్లీ ఎస్‌యూవీని ఫోక్స్‌వ్యాగన్ గ్రూపుకు చెందిన ఎమ్ఎల్‌బి ఈవిఓ ప్లాట్‌ఫామ్‌పై తయారు చేసే అవకాశం ఉంది. (ఇదే ప్లాట్‌ఫామ్‌పై పోర్షే మకన్, ఆడి ఏ8 మోడళ్లను తయారు చేస్తున్నారు).

బెంట్లీ ఎస్‌‌‌యూవీలో ప్రస్తుతం కంపెనీ ఆఫర్ చేస్తున్న ట్విన్ టర్బోఛార్జ్‌డ్ 4.0 లీటర్ వి8 ఇంజన్‌ను కానీ లేదా మరింత శక్తివంతమైన 6.0 లీటర్, డబ్ల్యూ12 ఇంజన్‌ను ఉపయోగించే ఆస్కారం ఉంది. కాగా.. 2017 నాటికి ఇందులో హైబ్రిడ్ వెర్షన్ ఎస్‌యూవీని కూడా అందుబాటులోకి తీసుకురావాలని బెంట్లీ యోచిస్తోంది. మరి ఈ బెంట్లీ ఎస్‌యూవీ టీజర్‌ని మనం కూడా చూసేద్దాం రండి..!
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/YUnBwnLU9Lw?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>

Most Read Articles

English summary
For the first time after previewing the EXP-9 SUV concept at the Geneva Motor Show 2012, Bentley has released the first teaser video of what is the production version of the SUV.&#13;
Story first published: Tuesday, November 11, 2014, 11:12 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X