'మాసేరటి' బ్రాండ్‌ను ఇండియాకు తీసుకురానున్న ఫియట్

By Ravi

ఇటాలియన్ ఆటోమొబైల్ దిగ్గజం ఫియట్ వద్ద పలు కార్ బ్రాండ్ ఉన్నాయి. అందులో అత్యంత పాపులర్ అయిన లగ్జరీ కార్ బ్రాండ్ మాసేరటి. ఫియట్ తమ మాసేరటి లగ్జరీ కార్లను మరిన్ని అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఫియట్ ఇప్పటికే తమ పెర్ఫార్మెన్స్ బ్రాండ్ అబార్త్, ఎస్‌యూవీ బ్రాండ్ జీప్‌లను 2015లో భారత్‌లో విడుదల చేస్తామని ప్రకటించిన ఫియట్ ఇండియా, ఇప్పుడు తాజాగా తమ లగ్జరీ కార్ బ్రాండ్ మాసేరటిని ఇక్కడకు తీసుకురావాలని యోచిస్తోంది.

ఇది కూడా చదవండి: ఫియట్ పుంటో ఇవో విడుదల, ధరలు, ఫీచర్లు

ఈమేరకు మాసేరటి అధికారులు ఇప్పటికే భారత్‌ను సందర్శించి మార్కెట్ అధ్యయనం కూడా చేసినట్లు సమాచారం. దేశంలోని ఢిల్లీ, ముంబై, బెంగుళూరు వంటి ప్రధాన మెట్రో నగరాల్లో, ధనికులను లక్ష్యంగా చేసుకొని మాసేరటి తమ కార్ల కోసం అధీకృత డీలర్‌షిప్‌లను ఏర్పాటు చేయాలని భావిస్తోంది.


తమ అంతర్జాతీయ ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియో నుంచి కొన్ని ఆసక్తికర ఉత్పత్తులను ఇండియాకు తీసుకురావటంపై చర్చలు జరుపుతున్నామని, ప్రస్తుతాని ఈ విషయంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేమని ఫియట్ క్రైస్లర్ ఇండియా ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ నాగేష్ బసవనహల్లి తెలిపారు.

ప్రస్తుతం భారత లగ్జరీ కార్ మార్కెట్ స్థిరంగా వృద్ధిని సాధిస్తోంది. ఈ విభాగంలో ఆడి, బిఎమ్‌డబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్ వంటి జర్మన్ లగ్జరీ కార్ కంపెనీలు అగ్రగాములుగా కొనసాగుతున్నాయి. సరసమైన ధరలకే లగ్జరీ కార్లను విడుదల చేస్తూ, ఈ మూడు కంపెనీ లగ్జరీ కార్ విభాగంలో ధరల యుద్ధానికి తెరలేపుతున్నాయి.

Maserati

ఒకప్పుడు లగ్జరీ కార్ అంటే, చాలా పరిమిత సంఖ్యలో మాత్రమే మోడళ్లు అందుబాటులో ఉండేవి. కానీ, ఇప్పుడు కస్టమర్ల అభిరుచి, బడ్జెట్‌కు అనుకుణంగా రూ.20 లక్షల నుంచి కోట్ల రూపాయల వరకు వివిధ శ్రేణుల్లో ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి.

మాసేరటి ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లలో గిబ్లి సెడాన్, గ్రాన్ తురిస్మో కూపే, గ్రాన్ కాబ్రియో కన్వర్టిబల్, క్వాట్రోపోర్టే సెడాన్ వంటి మోడళ్లను విక్రయిస్తోంది. సిబియూ రూట్లో ఈ మోడళ్లను ఇండియాకు దిగుమతి చేసుకొని విక్రయిస్తే, ఇక్కడి మార్కెట్లో వీటి ధరలు రూ.1.50 కోట్ల నుంచి రూ.3 కోట్ల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా.

Most Read Articles

English summary
Italian automobile giant Fiat has several brands under its belt. Among the many is a luxury automotive brand 'Maserati'. Fiat Group is planning to launch several new products in new as well as upcoming markets. They have already confirmed its Abarth and Jeep brand to launch within 2015.
Story first published: Tuesday, August 12, 2014, 10:04 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X