56,000 బుకింగ్స్ దక్కించుకున్న హ్యుందాయ్ ఎలైట్ ఐ20

By Ravi

భారతదేశపు ద్వితీయ అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియా, గడచిన ఆగస్ట్ నెలలో మార్కెట్లో విడుదల చేసిన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ 'హ్యుందాయ్ ఎలైట్ ఐ20' (Hyundai Elite i20), తన ఆకర్షనీయమైన డిజైన్‌తో కొనుగోలుదారులను అయస్కాంతంలా ఆకర్షిస్తోంది. ఈ కొత్త మోడల్ మార్కెట్లో విడుదలైన 4 నెలల వ్యవధిలోనే 56,000 యూనిట్లకు పైగా బుకింగ్‌లను దక్కించుకున్నట్లు కంపెనీ పేర్కొంది.

కేవలం రూ.4.89 లక్షల ప్రారంభ ధరకే (బేస్ పెట్రోల్ వేరియంట్ ధర, ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) హ్యుందాయ్ మోటార్ ఇండియా తమ ఎలైట్ ఐ20 హ్యాచ్‌బ్యాక్‌ను విడుదల చేసింది. ఇది మొత్తం 8 వేరియంట్లలో (4 పెట్రోల్, 4 డీజిల్) లభిస్తుంది. ఈ కారును ఫ్లూయిడిక్ స్కల్ప్చర్ 2.0 డిజైన్ ఫిలాసఫీ ఆధారంగా, జర్మనీలోని రుస్సెల్స్‌హీమ్‌లో హ్యుందాయ్ డిజైన్ సెంటర్ యూరప్ వద్ద డిజైన్ చేశారు.

Hyundai Elite i20 Bookings

పెట్రోల్ వెర్షన్ ఎలైట్ ఐ20లో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 83 పిఎస్‌ల శక్తిని, 11.7 కెజిఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో లభిస్తుంది. పెట్రోల్ వెర్షన్ ఎరా, మాగ్నా వేరియంట్స్ - 18.60 కెఎమ్‌పిఎల్ మైలేజీని, స్పోర్ట్స్, స్పోర్ట్స్ (ఆప్షనల్), ఆస్టా వేరియంట్స్ - 18.24 కెఎమ్‌పిఎల్ మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది.

డీజిల్ వెర్షన్ ఎలైట్ ఐ20లో 1.4 లీటర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 90 పిఎస్‌ల శక్తిని, 22.4 కెజిఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో లభిస్తుంది. డీజిల్ వెర్షన్ ఎరా, మాగ్నా వేరియంట్స్ - 22.54 కెఎమ్‌పిఎల్ మైలేజీని, స్పోర్ట్స్, స్పోర్ట్స్ (ఆప్షనల్), ఆస్టా వేరియంట్స్ - 21.76 కెఎమ్‌పిఎల్ మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది.

Most Read Articles

English summary
Hyundai had launched their Elite i20 four months ago in India. The manufacturer has achieved securing 56,000 booking for the hatchback out of 3,00,000 enquiries since its launch. They have also achieved another milestone by selling 10,500 Elite i20 in November, 2014 alone.
Story first published: Tuesday, December 2, 2014, 17:57 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X