ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్ 2015: హ్యుందాయ్ ఎలైట్ ఐ20

By Ravi

హ్యుందాయ్ మోటార్ ఇండియా, గడచిన ఆగస్ట్ నెలలో మార్కెట్లో విడుదల చేసిన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ 'హ్యుందాయ్ ఎలైట్ ఐ20' (Hyundai Elite i20), ప్రతిష్టాత్మక 'ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ 2015' (ICOTY)ను గెలుచుకుంది. గడచిన సంవత్సరంలో కూడా కంపెనీ విడుదల చేసిన హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 ఈ వార్డును దక్కించుకుంది.

దీంతో వరుసగా రెండు సార్లు ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డును దక్కించుకున్న ఘనత హ్యుందాయ్‌కే చెందింది. ఎలైట్ ఐ20 కారును పాపులర్ ఫ్లూయిడిక్ స్కల్ప్చర్ 2.0 డిజైన్ ఫిలాసఫీ ఆధారంగా, జర్మనీలోని రుస్సెల్స్‌హీమ్‌లో హ్యుందాయ్ డిజైన్ సెంటర్ యూరప్ వద్ద డిజైన్ చేశారు. ఇండియాలో ఈ మోడల్‌కు ఇప్పటికే 60,000 లకు పైగా ఆర్డర్లు వచ్చాయి.

Hyundai Elite i20 Award

గడచిన పదేళ్లలో హ్యుందాయ్ మొత్తం మూడు సార్లు ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డును సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా, హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ బిఎస్ సియో మాట్లాడుతూ.. తమ ప్రపంచ స్థాయి ఉత్పత్తి ఎలైట్ ఐ20, ఈ అత్యంత ప్రతిష్టాత్మక ఆటోమోటివ్ అవార్డుతో సత్కరించబడటం సంతోషంగా ఉందని, వరుసగా రెండు సార్లు ఈ అవార్డును దక్కించుకోవటం అనేది ప్రపంచ స్థాయి నాణ్యతా ప్రమాణాలతో కూడిన ఉత్పత్తి, డిజైన్, బ్రాండింగ్‌ను భారతీయ కస్టమర్లకు ఆఫర్ చేయటంలో హ్యుందాయ్ యొక్క కట్టుబాటుతనాన్ని తెలియజేస్తుందని అన్నారు.

పెట్రోల్ వెర్షన్ ఎలైట్ ఐ20లో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 83 పిఎస్‌ల శక్తిని, 11.7 కెజిఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో లభిస్తుంది. పెట్రోల్ వెర్షన్ ఎరా, మాగ్నా వేరియంట్స్ - 18.60 కెఎమ్‌పిఎల్ మైలేజీని, స్పోర్ట్స్, స్పోర్ట్స్ (ఆప్షనల్), ఆస్టా వేరియంట్స్ - 18.24 కెఎమ్‌పిఎల్ మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది.

Hyundai Elite i20 Wins Indian Car Of The Year 2015 Award

డీజిల్ వెర్షన్ ఎలైట్ ఐ20లో 1.4 లీటర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 90 పిఎస్‌ల శక్తిని, 22.4 కెజిఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో లభిస్తుంది. డీజిల్ వెర్షన్ ఎరా, మాగ్నా వేరియంట్స్ - 22.54 కెఎమ్‌పిఎల్ మైలేజీని, స్పోర్ట్స్, స్పోర్ట్స్ (ఆప్షనల్), ఆస్టా వేరియంట్స్ - 21.76 కెఎమ్‌పిఎల్ మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది.
Most Read Articles

English summary
Hyundai Motor India Ltd, the country’s second largest car manufacturer and the largest passenger car exporter has won the most coveted Indian Car of the Year 2015 (ICOTY) award for the Elite i20.
Story first published: Thursday, December 18, 2014, 11:17 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X