జపాన్ మార్కెట్ల కోసం హోండా సిటీ హైబ్రిడ్ వేరియంట్

జపనీస్ కార్ కంపెనీ హోండా మోటార్ కార్పోరేషన్, భారత మార్కెట్లో అందిస్తున్న హోండా సిటీ సెడాన్‌ను జపాన్ మార్కెట్లో హోండా గ్రేస్ పేరిట విక్రయిస్తోంది. ఇప్పుడు ఈ హోండా గ్రేస్ సెడాన్‌లో కంపెనీ ఓ హైబ్రిడ్ వెర్షన్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

డిసెంబర్ 1వ తేదీన జపాన్‌లో ఈ సరికొత్త హోండా సిటీ (అక్కడి మార్కెట్లో గ్రేస్)ని విడుదల చేయనున్నారు. ఇందులో ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్, క్లియర్ లెన్స్ హెడ్‌లైట్స్, సరికొత్త ఫ్రంట్ బంపర్ వంటి మార్పులు ఉన్నాయి. అన్నింటి కన్నా ప్రధానంగా, జపాన్ మార్కెట్లో కొత్త హోండా సిటీ (గ్రేస్) పెట్రోల్ ఇంజన్‍‌తో పాటుగా ఓ ఎలక్ట్రిక్ మోటార్ కూడా కలిగిన హైబ్రిడ్ వెర్షన్‌తోనూ లభ్యం కానుంది.

Japan To Get Honda City Hybrid Variant

ప్రస్తుతానికి హోండా సిటీ హైబ్రిడ్ వెర్షన్‌ను జపాన్ మార్కెట్లో మాత్రమే విడుదల చేయనున్నారు. ఇతర మార్కెట్లలో ఈ హైబ్రిడ్ సిటీ సెడాన్‌ను విడుదల చేసే అంశంపై కంపెనీ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా.. కొత్త హోండా సిటీ హైబ్రిడ్‌లో ఉపయోగించనున్న ఇంజన్, ఎలక్ట్రిక్ మోటార్ స్పెసిఫికేషన్లను కంపెనీ ఇంకా వెల్లడి చేయలేదు. అయితే, కొత్త హోండా వెజెల్ హైబ్రిడ్‌లోని పవర్‌ట్రైన్‌నే ఇందులోను ఉపయోగించవచ్చని అంచనా.

హోండా వెజెల్ హైబ్రిడ్‌లో 1.5 లీటర్ డైరెక్ట్ ఇంజెక్షన్ పెట్రోల్ ఇంజన్, ఓ హై అవుట్‌పుట్ ఎలక్ట్రిక్ మోటార్‌ను ఉపయోగించారు. ఇవి రెండూ కలిసి గరిష్టంగా 132 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తాయి. ఈ ఇంజన్ ఐ-డిసిడి డ్యూయెల్ క్లచ్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది. హోండా సిటీ హైబ్రిడ్ 4-వీల్ డ్రైవ్ ఆప్షన్‌తో కూడా లభ్యం కావచ్చని సమాచారం. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ని గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Japan will get the new Honda City on 1st December, where it will be sold as Honda Grace. The new Honda Grace will also be available in hybrid version. The new Honda City Hybrid variant will be exclusive for Japan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X