లాంబోర్గినీ హురాకన్ లాంచ్ ఖరారు; సెప్టెంబర్ 22న విడుదల

By Ravi

ఇటాలియన్ సూపర్‌కార్ కంపెనీ లాంబోర్గినీ తమ పాపులర్ గల్లార్డో సూపర్ కారు స్థానాన్ని రీప్లేస్ చేస్తూ అంతర్జాతీయ మార్కెట్లలో ప్రవేశపెట్టిన లేటెస్ట్ మోడల్ 'లాంబోర్గినీ హురాకన్' (Lamborghini Huracan) మరికొద్ది రోజుల్లోనే భారత మార్కెట్లో విడుదల కానుంది. లాంబోర్గినీ హురాకన్ విడుదల తేదీని కంపెనీ ఖరారు చేసింది. సెప్టెంబర్ 22, 2014న ఈ మోడల్‌ను దేశీయ విపణిలో విడుదల చేయనున్నట్లు లాంబోర్గినీ ఇండియా ప్రకటించింది.

ఈ మేరకు లాంబోర్గినీ ఇండియా మీడియా ప్రతినిధులకు ఆహ్వానాలు కూడా పంపింది. ముంబైలోని తాజ్ ల్యాండ్స్ ఎండ్ హోటల్‌లో నిర్వహించబోయే కార్యక్రమంలో ఈ కారును విడుదల చేయనున్నారు.

లాంబోర్గిని హురాకన్‌‌ను 1879 కాలానికి చెందిన స్పానిష్ ఫైటింగ్ బుల్ (దున్నపోతు) నుంచి స్ఫూర్తి పొంది ఈ పేరును పెట్టడం జరిగింది. 'లాంబోర్గినీ హురాకన్ ఎల్‌పి 640-4' పేరులో ఎల్‌పి అంటే, 'లాంగిట్యూడినేల్ పోస్టెరీయోర్'. ఇది ఇంజన్ ఓరియంటేషన్‌ను ప్రతిభింభింపజేస్తుంది. ఇందులో 610 అంటే ఇంజన్ నుంచి వెలవడే శక్తి (పిఎస్‌లలో), 4 అంటే ఫోర్ వీల్ డ్రైవ్ అని అర్థం.

Lamborghini Huracan

ఈ సూపర్ కారులో 5.2 లీటర్ వి10 ఫోర్ సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 8250 ఆర్‌పిఎమ్ వద్ద 610 పిఎస్‌ల శక్తిని, 560 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ పవర్‌ఫుల్ ఇంజన్ లాంబోర్గినీ డోపియా ఫ్రిజియోన్ (ఎల్‌డిఎఫ్) సెవన్-స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.

ఈ కారు కేవలం 3.2 సెకండ్ల వ్యవధిలో 0-100 కి.మీ. వేగాన్ని, 9.9 సెకండ్ల వ్యవధిలో 0-200 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్టం వేగం గంటకు 325 కిలోమీటర్లు. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఆప్షనల్ లాంబోర్గినీ డైనమిక్ స్టీరింగ్, మ్యాగ్నెటో-రియోలాజికల్ డ్యాంపర్స్ వంటి ఫీచర్లు ఇందులో ప్రధానంగా చెప్పుకోదగినవి. ఈ కారుకు సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
The Italian automobile manufacturer Lamborghini will be launching its Huracan in India on the 22nd of September, 2014. Lamborghini has already launched the Huracan in other countries across the globe.
Story first published: Friday, September 12, 2014, 16:35 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X