మహీంద్రా నుంచి 4 కొత్త ద్విచక్ర వాహనాలు

By Ravi

మహీంద్రా గ్రూప్‌కు చెందిన ద్విచక్ర వాహన విభాగం మహీంద్రా టూవీలర్స్ ఈ ఏడాది దేశీయ విపణిలో 4 కొత్త ద్విచక్ర వాహనాలను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఇందులో ఓ సరికొత్త స్కూటర్, మరో సరికొత్త బైక్‌తో పాటుగా ప్రస్తు మార్కెట్లో మోడళ్లకు రెండు ఫేస్‌లిఫ్ట్ వెర్షన్లను విడుదల చేస్తామని మహీంద్రా టూవీలర్స్ చీఫ్ (ఆపరేషన్స్ డివిజన్) వీరేన్ పొప్లి వివరించారు.

ఇదికూడా చదవండి: బిఎండబ్ల్యూ ఆర్ నైన్ టి బైక్ విడుదల, ఫీచర్లు

మహీంద్రా టూవీలర్స్ నుంచి ఎంత కాలంగానో వేచి చూస్తున్న మోజో మోటార్‌సైకిల్ ఈ ఏడాదే మార్కెట్లో విడుదల కానుంది. ప్రస్తుతం తాము అందిస్తున్న టూవీలర్లను నిలిపివేయబోమని కంపెనీ పేర్కొంది. కాగా.. తమ ఎగుమతులు మూడింతలు పెంచుకోవడం లక్ష్యంతో మహీంద్రా టూవీలర్స్, తమ ఉత్పత్తులను మరో నాలుగు కొత్త దేశాలకు ఎగుమతి చేయనున్నట్లు ఆయన తెలిపారు.


మహీంద్రా టూవీలర్స్ ప్రస్తుతం సెంచురో, పాంటెరో మోటార్‌సైకిళ్లను విక్రయిస్తోంది. ఇందులో సెంచురో అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. అయితే, పాంటెరో అమ్మకాలు అంతంత మాత్రంగానే ఉండటంతో, కంపెనీ ఈ మోడల్ ఉత్పత్తిని నిలిపివేయవచ్చనే వార్తలు గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలో, పాంటెరో అమ్మకాలను యధావిధిగా కొనసాగిస్తామని, ఈ మోడల్‌ను ఆవివేస్తామన్న వార్తల్లో నిజం లేదని కంపెనీ స్పష్టం చేసింది.

ఇదికూడా చదవండి: భారత మార్కెట్లో వరల్డ్స్ ఫాస్టెస్ట్ సైకిల్ విడుదల

తాము కొత్తగా విడుదల చేయబోయే నాలుగు ఉత్పత్తులలో ఓ ఎంట్రీ లెవల్ మోటార్‌సైకిల్ కూడా ఉంటుందని కంపెనీ తెలిపింది. కొలంబియా, నైజీరియా దేశాలతో పాటుగా మరో 2 దేశాలకు తమ టూవీలర్లను ఎగుమతి చేస్తామని, 100-110 సిసీ సెగ్మెంట్లో కొత్త మోటార్‌సైకిల్‌ను ప్రవేశపెడతామని పోప్లి తెలిపారు. పాంటెరో ప్లాట్‌ఫామ్‌పై రూపొందిన యారో బైక్ ఎగుమతులను కొనసాగిస్తామని ఆయన వివరించారు.

Mahindra Pantero

రానున్న రోజుల్లో మహీంద్రా టూవీలర్స్ డీలర్‌షిప్ నెట్‌వర్క్‌ను మరింత విస్తరిస్తామని, విస్తృతమైన నెట్‌వర్క్ వలన దేశీయ అమ్మకాలు పుంజుకోగలవని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. గడచిన జూన్ 2013లో 7,849 యూనిట్లుగా ఉన్న ద్విచక్ర వాహన విక్రయాలు జూన్ 2014లో 14,389 యూనిట్లకు పెరిగి 83 శాతం వృద్ధిని కనబరిచినట్లు మహీంద్రా టూవీలర్స్ పేర్కొంది.

ఈ వీడియో చూశారా? చీమల పుట్టలా వస్తున్న స్కూటరిస్టులు
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/rGp2MpKJ0nA?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>

Most Read Articles

English summary
Indian manufacturer and its only entrant into the Moto3 Championship Mahindra has taken a step into the future. They plan to launch four new products for Indian markets. Mahindra will launch an all new scooter and bike, along with facelift to its models.&#13;
Story first published: Saturday, July 19, 2014, 10:48 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X