మారుతి సుజుకి స్విఫ్ట్ ఫేస్‌లిఫ్ట్ బుకింగ్స్ ప్రారంభం!

By Ravi

మారుతి సుజుకి ఇండియా అందిస్తున్న పాపులర్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ స్విఫ్ట్‌లో కంపెనీ ఓ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు మనం ఇదివరకటి కథనాల్లో తెలుసుకున్నాం. కాగా.. ఇప్పుడు ఈ కొత్త మోడల్ విడుదలకు దాదాపుగా ముహుర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. వచ్చే నెలలోనే (నవంబర్ 2014) ఈ కొత్త 2014 మారుతి స్విఫ్ట్ మార్కెట్లోకి రాబోతోంది.

ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న మారుతి సుజుకి ఇండియా డీలర్లు కొత్త స్విఫ్ట్ ఫేస్‌లిఫ్ట్ కోసం బుకింగ్‌లను స్వీకరిస్తున్నట్లు సమాచారం. కొత్త స్విఫ్ట్ కోసం కనీస బుకింగ్ మొత్తం రూ.25,000 లుగా ఉంది.
కొత్త 2014 స్విఫ్ట్‌లో కొద్దిపాటి కాస్మోటిక్ అప్‌గ్రేడ్స్ ఉండనున్నాయి. కానీ, మెకానికల్‌గా మాత్రం ఎలాంటి మార్పులు ఉండవని తెలుస్తోంది.

new swift launching soon

రీస్టయిల్డ్ బంపర్స్, పెద్ద ఎయిర్ డ్యామ్స్, ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ ల్యాంప్స్ (బహుశా టాప్-ఎండ్ వేరియంట్లో మాత్రమే), ఎలక్ట్రిక్ ఫోల్డింగ్ సైడ్ మిర్రర్స్ (విత్ టర్న్ ఇండికేటర్స్), రీడిజైన్డ్ సెంటర్ మౌంటెడ్ రియర్ బ్రేక్ లైట్, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్ వంటి పలు కాస్మోటిక్ అప్‌గ్రేడ్స్ ఈ కారులో ఉండొచ్చని తెలుస్తోంది.

ఇంటీరియర్స్‌లో కూడా కొద్దిపాటి మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది. కొత్త 2014 స్విఫ్ట్‌‌లో స్టార్ట్/స్టాప్ బటన్, బ్లూటూత్‌తో కూడిన ఆడియో సిస్టమ్, డ్యూయెల్ టోన్ అప్‌హోలెస్ట్రీ వంటి మార్పులు ఉండనున్నట్లు సమాచారం.

new swift booking open

ఇంజన్ ఆప్షన్స్ విషయానికి వస్తే, ప్రస్తుత స్విఫ్ట్‌లో ఉపయోగిస్తున్న 1.2 లీటర్, 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ మరియు 1.3 లీటర్, 4-సిలిండర్ డీజిల్ ఇంజన్లనే కొత్త స్విఫ్ట్‌లోను ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 87 హార్స్‌పవర్, 114 ఎన్ఎమ్ టార్క్‌‌ను ఉత్పత్తి చేస్తుంది. డీజిల్ ఇంజన్ గరిష్టంగా 75 హార్స్‌పవర్, 190 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఈ రెండు ఇంజన్లు 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభ్యం కానున్నాయి. పెట్రోల్ వెర్షన్ స్విఫ్ట్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో కూడా లభ్యం కావచ్చని తెలుస్తోంది. అయితే ఇందులో రెగ్యులర్ 4-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను ఆఫర్ చేస్తారా లేక కంపెనీ విక్రయిస్తున్న సెలెరియోలో ఆఫర్ చేసినట్లుగా కొత్త స్విఫ్ట్‌లో కూడా ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ (ఏఎమ్‌టి)ని ఆఫర్ చేస్తారా అనే విషయం తెలియాల్సి ఉంది. ఈ కారుకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Maruti Suzuki India is expected to be launch the facelifted Swift in the November, booking for the same have already commenced. The minimum booking amount for the new Maruti Swift is Rs 25,000.
Story first published: Friday, October 24, 2014, 16:52 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X