హిమాలయాలను చేరుకునేందుకు పయనమైన పోలారిస్

Written By:

ప్రపంచపు అగ్రగామి ఆల్-టెర్రైన్ వాహనాల తయారీ సంస్థ పోలారిస్ ఇండస్ట్రీస్‌కి చెందిన పూర్తి భారతీయ అనుబంధ సంస్థ పోలారిస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఈనెల 4వ తేదీ నుంచి ప్రారంభమైన 16వ ఎడిషన్ 'రైడ్ దే హిమాలయ' (ప్రపంచంలో కెల్లా అత్యంత క్లిష్టమైన మౌంటైన్ ర్యాలీలలో ఒకటి)లో భాగం పంచుకుంటోంది.

వరుసగా మూడవసారి పోలారిస్ ఈ ర్యాలీలో పాల్గొంటోంది. రైడ్ దే హిమాలయ ర్యాలీ సెప్టెంబర్ 4 నుంచి సెప్టెంబర్ 10 వరకు జరుగుతుంది. పోలారిస్ ఆర్‌జెడ్ఆర్ ఎక్స్‌పి 900 మోడల్‌తో ఈ ర్యాలీలో పోటీ పడనున్నారు. గడచిన 2012లో మోటో క్వాడ్ క్యాటగిరీలో విజయం సాధించిన రాజ్ సింగ్ రాథోడ్ ఈ వాహనాన్ని నడపనున్నారు.

రాథోడ్‌కు నావిగేటర్‌గా రిహెన్ భరద్వాజ్ వ్యవహరించనున్నారు. ఆప్టిమైజ్డ్ మాస్ డిజైన్‌తో కూడిన పోలారిస్ ఆర్‌జెడ్ఆర్ ఎక్స్‌పి 900 క్వాడ్ (నాలుగు చక్రాల వాహనం) అసలే రోడ్లే లేని హిమాలయ ప్రాంతంలో సమర్థవంతంగా సంచరించగలదు. ఈ ర్యాలీలో పోలారిస్ ఆర్‌జెడ్ఆర్ ఎక్స్‌పి 900తో పాటుగా 49 బైక్‌లు, 94 ఫోర్ వీలర్స్ కూడా పాల్గొననున్నాయి.

Polaris Ready To Raid De Himalaya
English summary
Polaris India Pvt. Ltd., a wholly owned subsidiary of Polaris Industries, one of the biggest off-road and All-Terrain vehicle manufacturers, is participating in the 16th edition of one of the toughest and the world's highest mountain rallies - Raid de Himalaya, which started on the 3rd of October, 2014.
Story first published: Tuesday, October 7, 2014, 16:23 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark