మూడేళ్ల కాంట్రాక్టుపై ఫెరారీ జట్టులో చేరిన సెబాస్టియన్ వెటెల్

ఫార్ములా వన్ రేసర్ సెబాస్టియన్ వెటెల్, రెడ్ బుల్ జట్టుకు గుడ్‌బై చెప్పి, ఫెరారీ జట్టులో చేరనున్నట్లు తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఇదివరకటి కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే. ఇప్పుడు ఈ విషయాన్ని ఇరు కంపెనీలు అధికారికంగా ధృవీకరించాయి. మూడేళ్ల కాంట్రాక్టుపై వెటెల్ ఫెరారీ జట్టులో చేరనున్నాడు. వచ్చే ఏడాది (2015) ఫార్ములా వన్ సీజన్ నుంచి వెటెల్ ఫెరారీ జట్టుకు సారధ్యం వహిస్తాడు.

కాగా.. ప్రస్తుతం ఫెరారీ జట్టులో కీలకంగా వ్యవహరిస్తున్న ఫెర్నాండో అలోన్సో ఆ జట్టును తొలగిపోయి మెక్‌లారెన్ జట్టులో చేరనున్నట్లు సమాచారం. అయితే, ప్రస్తుతం ఫెరారీ జట్టులో మరో మరో డ్రైవర్ కిమి రైక్కొనెన్ మాత్రం యధావిధిగా అదే జట్టులోనే కొనసాగనున్నాడు.

Sebastian Vettel

రెడ్ బుల్ జట్టులో సెబాస్టియన్ వెటెల్ అత్యంత కీలకంగా వ్యవరించి, ఆ జట్టుకు ఎన్నో విజయాలను తెచ్చిపెట్టాడు. ఇండియాలో జరిగిన మూడు గ్రాండ్ ప్రి సిరీస్‌లలో కూడా సెబాస్టియన్ వెటెల్ వరుస విజయాలను నమోదు చేశాడు.

గతంలో (2004)లో వరుసగా 7 విజయాలను సాధించిన ఎఫ్1 డ్రైవర్‌గా మైఖేలు షుమాకర్ రికార్డు సృష్టించగా, 2013లో జరిగిన అబుదాబి గ్రాండ్‌ప్రిలో విజయం సాధించిన వెటల్, షుమాఖర్‌తో ధీటుగా ఈ రికార్డును సమం చేశాడు.

ఫార్లుమా వన్ దిగ్గజం మైఖేల్ షుమాకరే తనకు మార్గదర్శకమని, స్కుడెరియా ఫెరారీ కాక్‌పిట్‌‍లో కూర్చోవాలనేది తన కలని వెటెల్ చెప్పాడు. ఫెరారీ కోసం డ్రైవ్ చేయటం గర్వంగా ఉందని, ఆ జట్టు గౌరవాన్ని నిలబెట్టేందుకు కృషి చేస్తానని అన్నాడు.

Most Read Articles

English summary
The Italian manufacturer has confirmed Alonso will be replaced by quadruple Formula One World Champion Sebastian Vettel. The German ace has signed a three year contract with Scuderia Ferrari. He will share the paddock with current Ferrari driver Kimi Raikkonen.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X