సీటింగ్ సిస్టమ్ కోసం టాటా-మాగ్నా జాయింట్ వెంచర్

Written By:

ప్రముఖ ఆటోమొబైల్ విడిభాగాల తయారీ సంస్థ టాటా ఆటోకాంప్‌ సిస్టమ్స్‌ మరియు మాగ్నా ఇంటర్నేషనల్‌ ఐఎన్‌సీల మధ్య ఓ ఒప్పందం కుదిరింది. ఇరు సంస్థల మధ్య సమాన భాగస్వామ్యంతో ఏర్పడిన ఈ జాయింట్ వెంచర్ (జేవీ)లో భాగంగా, భారత వాణిజ్య వాహన పరిశ్రమకు అవసరమైన సీటింగ్ సిస్టమ్‌ను ఈ జేవీ అందజేయనుంది.

వాణిజ్య వాహనాలకు సీటింగ్‌ సిస్టం వ్యాపారంలో 50:50 నిష్పత్తిలో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం, ఈ సంస్థలు వినూత్న పద్ధతిలో వాణిజ్య వాహనాలకు సీటింగ్‌ సిస్టమ్‌ను సమకూర్చనున్నారు. ఈ వాణిజ్య వాహనాలలో బస్సులు కూడా ఉంటాయని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.

Tata AutoComp And Magna Enter Into A Joint Venture

మాగ్నా ఇంటర్నేషనల్‌ ఐఎన్‌సీ భారత మార్కెట్లో తమ సీటింగ్‌ ఫోర్ట్‌పోలియోను మరింత విస్తరించే దిశగా టాటా ఆటోకాంప్‌తో ఈ డీల్‌ను కుదుర్చుకుంది. దేశంలో మౌలికరంగం శరవేగంగా విస్తరించడంతో దూరప్రాంతాలకు వెళ్లే వాహనాలకు డిమాండ్‌ పెరుగుతుందని, దీనికి అనుగుణంగా సౌకర్యంగా ఉండే సీటింగ్‌ను సమకూరుస్తామని, డ్రైవర్‌తో పాటు ప్రయాణికులు భద్రతను కూడా పరిగణనలోకి తీసుకుంటామని టాటాఆటో కాంప్‌ సిస్టమ్స్‌ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో అజయ్ టాండన్ తెలిపారు.

English summary
Tata AutoComp Systems Limited (Tata AutoComp) and Magna International Inc. have signed a 50/50 Joint Venture agreement to provide seating systems to the Indian commercial vehicle industry. The JV will be focused on delivering innovative seating systems to commercial vehicle manufacturers as well as buses. 
Story first published: Wednesday, September 24, 2014, 13:54 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark