ఇలాంటి కారును ఎప్పుడైనా చూశారా?

By Anil

దిగ్గజ లగ్జరీ కార్ల తయారి సంస్థ మెర్సిడెస్-బెంజ్ ప్రస్తుతం టోక్యోలో జరుగుతున్న మోటార్ షోలో తన ఐదు సీట్ల కాన్సెప్ట్ కారు-విజన్ టోక్యో అనే పేరుతో ప్రదర్శించింది. కాన్సెప్ట్ కారు యొక్క రూపకల్పన మరియు భవిష్యత్తు యొక్క డిజైన్ ను జాతీయం చేయడం పట్ల వివిధ కంపెనీలు దీని డిజైన్ గురించి రకరకాలుగా విమర్శిస్తున్నారు. చూడటానికి ఎంతో అందంగా కనిపిస్తున్న ఈ విజన్ టోక్యో కారు టోక్యో మోటార్ షోలో విశేష అంతర్జాతీయ ప్రజాదరణ పొందుతోంది.

Also Read: భారతీయులుగా మన దేశం గురించి తెలుసుకోవలసిన ముఖ్య విషయం

మెర్సిడెస్-బెంజ్ వారి ట్యోక్యో విజన్ గురించి మరిన్ని ఆశక్తికరమైన విషయాలు క్రింది ఫోటో ఫీచర్ ద్వారా తెలుసుకోండి.

డిజైన్ :

డిజైన్ :

ప్రతి ఒక్కరిని ఆకట్టుకొనేది డిజైన్. మెర్సిడెస్-బెంజ్ టోక్యో విజన్ కాన్సెప్ట్ కారును మెర్సిడెస్-బెంజ్ యొక్క గ్లోబల్ నెట్‌వర్క్ అఫ్ అడ్వాన్స్‌డ్ డిజైన్ స్టుడియోస్ వారు డిజైన్ చేశారు.

Also Read: టోక్యో మోటార్ షో ప్రదర్శనలో ఉన్న మరిన్ని కార్ల గురించి.

 త్రీ డైమెన్షన్‌ :

త్రీ డైమెన్షన్‌ :

ఇందులో త్రీ డైమెన్షన్‍‌లో కనపడే కొన్ని అడ్వాన్స్‌డ్ టెక్నాలజీలను అందిచారు. వీటి ద్వారా కారులో గల అప్లికేషన్లు, మ్యాప్‌లను, డిస్ల్పే‌లను వంటి ఇతర వాటిని త్రీ డైమెన్షన్‌లో చూసే అవకాశం కల్పించారు. మరియు వీటన్నింటిని కూడా ఇంటీరియర్ మద్యలో అమరే విధంగా ఏర్పాటు చేశారు.

ఎక్స్‌టీరియర్ :

ఎక్స్‌టీరియర్ :

టోక్యో విజన్ కారు యొక్క బాహ్య నిర్మాణం తిరుగులేనిది. కిటికీలు మరియు అద్దాలు ఎంతో అందంగా తీర్చిదిద్దారు. మరియు దీని సైడ్ విండో అద్దాల మీద మోనోక్రోమ్ అలుబీమ్ రంగుతో ఫినిషింగ్ చేయబడి ఉంది.

స్పెషల్ ఫీచర్స్ :

స్పెషల్ ఫీచర్స్ :

టోక్యో విజన్ కాన్సెప్ట్ కారులో విభిన్నమైన అదునాతన ఫీచర్లు కలవు.

  • 26-అంగుళాల చక్రాలు
  • సైడ్ స్కర్ట్స్
  • నీల రంగులో ఉన్న ఉపరితలం
  • 360 డిగ్రీలలో తిరగ గల కెమెరాని కారు పైభాగాన అమర్చారు.
  • విజన్ టోక్యో కారు కొలతలు :

    విజన్ టోక్యో కారు కొలతలు :

    • పొడవు 4803 ఎమ్ఎమ్
    • వెడల్పు 2100 ఎమ్ఎమ్
    • ఎత్తు 1600 ఎమ్ఎమ్
    • సీటింగ్ కెపాసిటి :

      సీటింగ్ కెపాసిటి :

      ఈ అత్యాధునిక విజన్ టోక్యో కాన్సెప్ట్ కారు లో దాదాపుగా ఐదు మంది సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. దీని క్యాబిన్‌లో మంచం వంటి నిర్మాణం కలదు. వాహనాన్ని నడిపే వ్యక్తి కూడా మిగతావారితో పాటు కూర్చుని కారును నడపవచ్చు. దీనికి ఒక డ్రైవింగ్ మోడ్‌ని ఏర్పాటు చేశారు.

      డ్రైవింగ్ మోడ్ :

      డ్రైవింగ్ మోడ్ :

      విజన్ కంట్రోల్ మోడల్ కారును దాదాపు మ్యాన్యువల్‌గా కంట్రోల్ చేయవచ్చు. ఇదులో ఉన్నమంచం మీద కూర్చొని ట్రావెల్ డైరెక్షన్ మరియు స్టీరింగ్ వీల్ కదలికలు అన్నింటిని కూడా ఈ డ్రైవింగ్ మోడ్ ద్వారా నియంత్రించవచ్చు.

      Also Read: లండన్‌లో పరుగులు పెట్టనున్న భారతదేశపు స్పోర్ట్స్ కారు

      మరిన్ని ఆశ్చర్యకరమైన విషయాలు వీటిని కూడా చదవండి.

      జపాన్ అణు విపత్తు యొక్క విషయాలు-నిర్ఘాంతపోయే సత్యాలు

      మరిన్ని మెర్సిడెస్-బెంజ్ వాహనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

      మహిళలు అత్యధికంగా ఇష్టపడుతున్న కార్లు


Most Read Articles

English summary
Mercedes-Benz showcases an advanced five-seater concept car—the Vision Tokyo. This concept car's design speaks volumes of the progressive and futuristic design idiom.
Story first published: Thursday, October 29, 2015, 13:50 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X