2015 నంది హిల్ క్లైంబ్ రేస్ క్యాన్సిల్.. కారణమేంటో తెలుసా..?

By Ravi

కార్ రేస్, బైక్ రేస్ ప్రియులను ప్రతి ఏటా అలరిస్తూ వచ్చిన 'నంది హిల్ క్లైంబ్' రేస్ ఈ ఏడాది రద్దయ్యింది. రేస్ ప్రారంభమైన మొదటి రోజున (జనవరి 21) జరిగిన ఓ విషాద సంఘటన కారణంగా రేస్‌ను మధ్యలోనే నిలిపివేయాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే..

బెంగుళూరులోని ప్రముఖ పర్యాటక ప్రదేశమైన నంది హిల్స్ వద్ద టీమ్ ఇన్నర్ లైన్ రేసింగ్ సంస్థ జనవరి 21వ తేదీన నిర్వహించిన మోటార్‌సైకిల్ రేస్‌లో సమయాభావం కారణంగా కొన్ని విభాగాలకు (తక్కువ సీసీ కలిగిన బైక్‌లకు) మాత్రమే రేస్ నిర్వహించారు.

Nandi Hill Climb 2015 Race Cancelled

మిగిలిన విభాగాలకు (ఎక్కువ సీసీ కలిగిన బైక్‌లు, సూపర్‌బైక్‌లకు) చెందిన ద్విచక్ర వాహనాలకు మరియు కార్లకు జనవరి 22వ తేదీన రేస్ నిర్వహించాలని నిర్వాహకులు భావించారు. అయితే, జనవరి 21వ తేదీన రేస్ జరిగే పరిసర ప్రాంతాల్లో ఓ విషాద సంఘటన చోటు చేసుకుంది.

నంది హిల్ క్లైంబ్ రేస్‌ను వీక్షించడానికి వచ్చిన ఔత్సాహిక బైకర్లలో (రేస్‌లో పాల్గొనే వ్యక్తి కాదు) కొండ క్రింద భాగంలో ఉన్న గ్రామ పరిసర ప్రాంతాల్లో తన బైక్‌పై ఫీట్లు చేస్తూ, మితిమీరన వేగంతో బైక్‌ను నడుపుతూ రోడ్డుపై అడ్డుగా వచ్చిన ఆవుని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఆవు చనిపోగా, సదరు బైక్ తీవ్రంగా గాయపడ్డాడు (గ్రామ ప్రజల సమాచారం సదరు బైకర్ కూడా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది).

Nandi Hill Climb 2015 Race

వాస్తవానికి ఈ సంఘటనకు రేస్ నిర్వాహకులకు ఎలాంటి సంబందం లేకపోయినప్పటికీ.. ఆవు చనిపోవటం, సదరు వ్యక్తి గాయపడటం వంటి సంఘటనల దృష్ట్యా గ్రామస్థులు, పోలీసులు ఈ రేస్‌ను ఆపేయాలని అడ్డుకున్నారు. దీంతో చేసేది లేక నిర్వాహకులు 2015 నంది హిల్ క్లైంబ్ రేస్‌ను మధ్యలోనే అర్థాంతంగా నిలిపివేశారు.

నిజానికి నంది హిల్ క్లైంబ్ రేస్‌లో రసవత్తరమైన రేస్ నేడు జరగాల్సి ఉంది. ఈ రేస్ కోసం కేవలం బెంగుళూరు నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా రేసర్లు తమ కార్లతో నంది హిల్స్ చేరుకున్నారు. కొందరు రేసర్లయితే, తమ మోడిఫైడ్ కార్లను అత్యంత వ్యవప్రయాసలతో ఫ్లాట్ బెడ్ ట్రక్కుల మీద ఈ ప్రాంతానికి తీసుకువచ్చారు.

2015 Nandi Hill Climb

రేస్‌లు ప్రమాదకరమైనవే.. కానీ వీటిని నైపుణ్యం, అనుభవం కలిగిన ప్రొఫెషనల్స్ క్లోజ్డ్ పరిసర ప్రాంతాల్లో నిర్వహిస్తారు. రేస్‌ను చూడటానికి వచ్చి, అత్యుత్సాహంతో కొందరు చేసే ఇలాంటి పనుల వలన ఇతరులు సైతం ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. పబ్లిక్ రోడ్లపై మోటార్‌సైకిళ్లతో స్టంట్స్ చేయటం ఎంత ప్రమాదకరమో మరోసారి ఈ సంఘటన మనకు గుర్తు చేస్తుంది.
Most Read Articles

English summary
The 2015 Nandi Hill Climb race has canceled due to the accident took place on Wednesday.
Story first published: Thursday, January 22, 2015, 16:09 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X