లాంఛనంగా విడుదలైన రేంజ్ రోవర్ ఎవోక్: ఇంజన్, ధర, మరిన్ని ఫీచర్ల కోసం....

By Anil

రేంజ్‌రోవర్ కార్ల సంస్థ తన రేంజ్‌కు తగ్గట్టుగానే ఎవోక్ ఫేస్ లిప్ట్ కారును అత్యధిక ధరకు భారతీయ మార్కెట్లోకి విడుదల చేసింది. దీని సుమారుగా 47.10 లక్షల నుండి మొదలవనుంది.
Also Read: కొత్తతరం టయోటా ఇన్నోవా: ఫోటోలు మరియు స్పెసిఫికేషన్స్.

కొన్ని రోజుల క్రితమే రేంజ్ రోవర్ ఎవోక్ ఫేస్ లిఫ్ట్ కారుకు సంభందించింన బుకింగ్స్‌ను తమ అన్ని డీలర్ షిప్‌ల వద్ద ప్రారంభించినట్లు తెలిపింది. అయితే ఇంతకు ముందు గల మోడల్‌తో ఈ 2016 రేంజ్ రోవర్ ఎవోక్ ఫేస్‌లిఫ్ట్ కారును పోల్చగా డిజైన్ పరంగా కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి.
Also Read: టయోటాకు చెందిన ఇంత ఖరీదైన కారును చూశారా ?

2016 రేంజ్ రోవర్ ఎవోక్ ఫోస్‌లిఫ్ట్ కారుకు చెందిన మరిన్ని వివరాలు క్రింది కథనాల ద్వారా తెలుసుకుందాం....

ఇంజన్

ఇంజన్

ఈ 2016 రేంజ్ రోవర్ ఎవోక్ ‌ఫేస్‌లిఫ్ట్ మోడల్ కారులో 2.2-లీటర్ టర్బో డీజల్ ఇంజన్ కలదు. ఇది మీకు 188 బిహెచ్‌‌పి పవర్ మరియు 420ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది.

మైలేజ్

మైలేజ్

ఈ సరికొత్త రేంజ్ రోవర్ ఎవోక్ ‌ఫేస్‌లిఫ్ట్‌లో గల 9- స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ అన్ని చక్రాలకు పవర్‌ను అందిస్తుంది. అంతే కాకుండా ఇది లీటర్‌కు 12.7 కిలోమీటర్లు మైలేజ్‌ను అందివ్వడంలో సహాయపడుతుంది.

కొత్త ఫీచర్లు

కొత్త ఫీచర్లు

ఇందులో ముందు మరియు వెనుకవైపున కొత్తగా డిజైన్ చేయబడిన బంపర్లు, ముందువైపు గల కొత్త గ్రిల్ , కొత్తగా డిజైన్ చేయబడిన అల్లాయ్ వీల్స్, ముందు మరియు వెనుకవైపున గల ఆకర్షణీయమైన ల్యాంప్స్.

మల్టీమీడియా

మల్టీమీడియా

ఇందులో 8-అంగుళాల తాకే తెర పరిమాణం గల ఎంటర్‌‌టైన్‌మెంట్ సిస్టమ్ కలదు. 11 స్పీకర్లు గల ఆడియో సిస్టమ్, న్యావిగేషన్ సిస్టమ్ మరియు హెడ్ అప్ డిస్ల్పే కలదు.

ఇంటీరియర్

ఇంటీరియర్

ఈ 2016 రేంజ్ రోవర్‌కు చెందిన ఫేస్‌లిఫ్ట్ కారులో ఇంటీరియర్ కొన్ని కొత్త సొబగులతో మన ముందుకు వచ్చింది. సీట్ల మీద కూర్చున్న వారు అటు ఇటు జరగకుండా సీటు అంచుల వెంబడి ఉబ్బెత్తుగా వచ్చే విధంగా దీని సృష్టించారు. మరియు కారు దిగకుండానే టైర్‌లో గల గాలిని లెక్కగట్టే సిస్టమ్ ఇందులో అందించారు.

 లభించు మోడల్స్

లభించు మోడల్స్

రేంజ్ రోవర్ ఎవోక్ నాలుగు రకాల మోడల్స్‌లో లభించనుంది.

  • రేంజ్ రోవర్ ఎవోక్ ప్యూర్
  • రేంజ్ రోవర్ ఎవోక్ యస్‌ఇ
  • రేంజ్ రోవర్ ఎవోక్ హెచ్‌యస్ఇ
  • రేంజ్ రోవర్ ఎవోక్ హెచ్‌యస్ఇ డైనమిక్
  • ఎయిర్ బ్యాగ్స్

    ఎయిర్ బ్యాగ్స్

    ఇందులో అత్యధికంగా ఎయిర్ బ్యాగ్‌లను అందించారు.

    • డ్రైవర్ మరియు ఇతరులకు ఇందులో ఎయిర్ బ్యాగ్‌లను కల్పించారు.
    • మొదటి వరుసలో ప్రక్కవైపున ఎయిర్ బ్యాగ్
    • రెండవ వరుసలో ప్రక్కవైపున కర్టెన్ ఎయిర్ బ్యాగ్
    • డ్రైవర్ కోసం మోకాలి దగ్గర ఎయిర్ బ్యాగ్‌ను కల్పించారు.
    • భద్రత

      భద్రత

      ఇందులో భద్రత కోసం గల ఫీచర్లు

      యాంటి-లాక్ బ్రేకింగ్ సిస్టమ్(ఎబియస్)

      ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ (టిసియస్)

      హిల్ డిసెంట్ కంట్రోల్

      డైనమిక్ స్టెబిలిటి కంట్రోల్ (డిసియస్)

      రోల్ స్టెబిలిటి కంట్రోల్ (ఆర్.‌‌యస్.సి)

      ధర

      ధర

      రేంజ్ రోవర్ ఎవోక్ ధరలను వేరియంట్ల వారిగా అందించాము:

      • ప్యూర్ ధర రూ. 47.10 లక్షలు
      • యస్‌ఇ ధర రూ. 52.90 లక్షలు
      • హెచ్‌యస్ఇ ధర రూ. 57.70 లక్షలు
      • హెచ్‌యస్ఇ డైనమిక్ ధర రూ. 63.20 లక్షలు
      • గమనిక అన్ని ధరలు ఎక్స్-షో రూమ్ (ముంబాయ్) గా ఇవ్వబడ్డాయి.

         లాంఛనంగా విడుదలైన రేంజ్ రోవర్ ఎవోక్: ఇంజన్, ధర, మరిన్ని ఫీచర్ల కోసం....

Most Read Articles

English summary
Range Rover Launch The 2016 Evoque Facelift In India At Rs. 47.10 Lakh
Story first published: Thursday, November 19, 2015, 17:48 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X