ఉప్పు నీటితో నడిచే కారును తయారు చేసిన విద్యార్థులు

By Ravi

భూమిలో శిలాజ ఇంధనాలు అంతరించిపోతున్న నేపథ్యంలో, భవిష్యత్తులో కార్లలో ఉపయోగించదగిన ప్రత్యామ్నాయ ఇంధనాలపై ఇప్పటికే అనేక సంస్థలు పరిశోధనలు చేస్తున్నాయి. తాజాగా.. థానేకి చెందిన సరస్వతి విద్యాలయ హై స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ ఆఫ్ సైన్స్‌కి చెందిన విద్యార్థుల బృందం ఉప్పు నీరు (సాల్ట్ వాటర్) మరియు సౌర్ విద్యుత్ (సోలార్ ఎనర్జీ)తో నడిచే కారును తయారు చేశారు.

మణిపాల్ యూనివర్సిటీ నిర్వహించిన టీనోవేటర్స్ అనే ఆల్-ఇండియా కాంపిటీషన్‌లో భాగంగా విద్యార్థులు ఈ కాన్సెప్ట్ కారును డిజైన్ చేశారు. వాస్తవానికి ఇది లైఫ్-సైజ్ కారు కాకపోయినప్పటికీ, ఈ సాంకేతికను భవిష్యత్తులో పెద్ద కార్లలో సైతం ఉపయోగించుకోవచ్చవని విద్యార్థులు చెబుతున్నారు. ఎన్ఏసిఎల్ (సోడియం క్లోరైడ్) నుంచి తయారు చేసిన ఫ్యూయెల్ సెల్ ఆధారంగా ఇది పనిచేస్తుంది.

విద్యార్థులు ఈ కారును 'అల్టిమేట్ పవర్ కార్' అని పిలుస్తున్నారు. వారు ఈ కారు గురించి వివరిస్తూ.. ఇది చూడటానికి సాధారణ పెట్రోల్ లేదా డీజిల్ కారు మాదిరిగానే కనిపిస్తుందని, కాకపోతే ఇందులో ఇంజన్స్ గట్రా ఉండవని, అంతేకాకుండా ఈ కారు వలన వాయి కాలుష్యం లేదా నీటి కాలుష్యం జరగదని తెలిపారు. ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించే సౌరశక్తిని ఉపయోగించుకొని పనిచేసే ఈ కారు, సాంప్రదాయ పెట్రోల్, డీజిల్‌తో నడిచే కార్ల కన్నా తక్కువ రన్నింగ్ కాస్ట్‌ను కలిగి ఉంటుందని వారు వివరించారు.

Most Read Articles

English summary
Thane based SVPT's Saraswati Vidyalaya High School and Junior College Of Science students devolved a car that runs on a fuel cell made up of NaCl (aq), ie normal salt water and solar energy.
Story first published: Saturday, January 17, 2015, 17:15 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X