అత్యంత సరసమైన డాట్సన్ రెడి గొ గురించి మీకు తెలియాల్సిన పది విషయాలు

By Anil

నిస్సాన్ సారథ్యంలో బాగా ప్రాచుర్యం పొందిన అత్యంత సరసమైన కార్లను అందించే డాట్సన్ అతి తక్కువ ధరతో ఇండియన్ మార్కెట్లోకి రెడి గొ కారును విడుదల చేసింది. ఇండియన్ మార్కెట్లో ఇప్పటికే ఉన్న ఆల్టో800, రెనో క్విడ్ మరియు హ్యందాయ్ ఇయాన్ కార్ల కన్నా తక్కువ ధరతో ఇది అందుబాటులోకి వచ్చింది.

డాట్సన్ రెడి గో కారు గురించి అందరూ తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన పది విషయాలు క్రింది కథనంలో.....

 డాట్సన్ రెడి గొ గురించి పది ముఖ్యమైన విషయాలు

1. రెనో వారు తమ క్విడ్ కారును అభివృద్ది చేసిన సిఎమ్‌ఎఫ్-ఎ వేదిక మీదనే ఈ డాట్సన్ రెడి గో ను అభివృద్ది చేశారు. రెనో మరియు నిస్సాన్ సంయుక్తంగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం రెనో క్విడ్‌ను అభివృద్ది చేసింది. డాట్సన్ మరియు నిస్సాన్ రెండు కూడా సంయుక్తంగా ఉండటం వలన అత్యంత సరసమైన ఉత్పత్తులను అందించే డాట్సన్ ఈ సిఎమ్‌ఎఫ్-ఎ వేదికను వినియోగించుకుంది. ఈ వేదిక ఆధారంగా రానున్న రోజుల్లో మరిన్ని సరసమైన ఉత్పత్తులను అందించనుంది. ఈ వేదిక అన్ని లైట్ వెయిట్ ఉత్పత్తులను మాత్రమే అందిస్తున్నారు. తద్వారా ఇవి అధిక మైలేజ్‌ను ఇవ్వగలవు.

 డాట్సన్ రెడి గొ గురించి పది ముఖ్యమైన విషయాలు

2. అద్బుతమైన మైలేజ్ - మీరు రెడి గొ కారును తీక్షణంగా గమనించినట్లయితే ఇది కొద్ది వరకు రెనో క్విడ్ లక్షణాలను పోలి ఉంటుంది. ఇందులో వినియోగించిన 799సీసీ సామర్థ్యం ఉన్న పెట్రోల్ ఇంజన్‌కు 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేశారు. మూడు సిలిండర్లు ఉన్న ఈ ఇంజన్ 53 బిహెచ్‌పి పవర్ మరియు 72ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. సామాన్యులను ఆకట్టుకునే మైలేజ్ పరంగా చూస్తే ఇది లీటర్‌కు 25.17 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలదు.

 డాట్సన్ రెడి గొ గురించి పది ముఖ్యమైన విషయాలు

3. ఉత్తమ కాంపాక్ట్ కారు- డాట్సన్ రెడి గొ పొడవు 3,429 ఎమ్ఎమ్, వెడల్పు 1,560 ఎమ్ఎమ్, 1541 ఎమ్ఎమ్ ఎత్తు మరియు 2348 ఎమ్ఎమ్ వీల్‌బేస్ కలదు. దీని పోటీ దారులలో ఇది అన్నింటికన్నా చిన్న కారు.

 డాట్సన్ రెడి గొ గురించి పది ముఖ్యమైన విషయాలు

4. దీని శ్రేణిలో అత్యంత వేగవంతమైన కారు- డాట్సన్ వారి రెడి గొ కారు రెనో క్విడ్‌కు వినియోగించిన వేదికను ఉపయోగించుకున్నప్పటికి క్విడ్ కన్నా 25 కిలోలు తక్కువ బరువుతో ఉంది. దీని తక్కువ కొలతలు కూడా ఇందుకు కారణం, ఈ రెడి గొ 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని 15.98 సెకండ్ల వ్యవధిలో అందుకుంటుంది. అదే దీని పోటీ దారులు రెనో క్విడ్, మారుతి ఆల్టో 800 మరియు హ్యుందాయ్ ఇయాన్ వరుసగా 16.87, 18.41 మరియు 18.63 సెకండ్ల సమయం తీసుకుంటాయి.

 డాట్సన్ రెడి గొ గురించి పది ముఖ్యమైన విషయాలు

5. బ్రేకింగ్ పనితీరు- బ్రేకులను వినియోగించినపుడు ఈ శ్రేణిలో ఉన్న కార్లు తీసుకునే సమయం కన్నా రెడి గొ చాల తక్కువ వ్యవధిలోనే కారును ఆపుతుంది. బ్రేకులను అప్లే చేసిన తరువాత తక్కువ దూరంలోనే కారును ఆపుతుంది. రెడి గొ గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నపుడు బ్రేకులను ప్రయోగిస్తే కేవలం 32.2 మీటర్ల దూరంలోపు కారును ఆపుతుంది. అదే విధంగా రెనో క్విడ్, హ్యుందాయ్ ఇయాన్ మరియు ఆల్టో800 లు అయితే వరుసగా 3, 33.7 మరియు 34.3 మీటర్ల దూరంలో ఆగుతాయి.

 డాట్సన్ రెడి గొ గురించి పది ముఖ్యమైన విషయాలు

6. ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన రెడి గొ దాదాపుగా 2014 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ప్రదర్శించిన కాన్సెప్ట్‌ను పోలి ఉంది. సిగ్నేచర్ డి-కట్ గ్రిల్, స్వెప్ట్ బ్యాక్ హెడ్‌ల్యాంప్స్, పగటి పూట వెలిగే ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్స్, పొడవుగా ఉండే టెయిల్ ల్యాంప్స్, ఇలాంటి అన్ని ఎక్ట్సీరియర్ అంశాలతో పోల్చితే రెడి గొ చూడటానికి ఎంతో బాగుటుంది.

 డాట్సన్ రెడి గొ గురించి పది ముఖ్యమైన విషయాలు

7. అత్యంత సరసమైన కారు- డాట్సన్ దీనిని ఇండియన్ మార్కెట్లోకి 2.38 లక్షల నుండి 3.34 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) గా అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం దీనికి పోటీగా ఉన్న ఆల్టో800, రెనో క్విడ్ మరియు హ్యుందాయ్ ఇయాన్ కన్నా దీని ధర తక్కువగా ఉంది.

 డాట్సన్ రెడి గొ గురించి పది ముఖ్యమైన విషయాలు

8. ఈ శ్రేణిలో ఉత్తమ గ్రౌండ్ క్లియరెన్స్ గల కారు- దీనికి 185 ఎమ్ఎమ్ గ్రౌండ్ క్లియరెన్స్ కలదు. ఈ విభాగం పరంగా దీనికి పోటీగా ఉన్నఅన్ని కార్లను వెనక్కి నెట్టేసింది. ఇంకా ఆశ్చర్యకరం ఏమిటంటే మారుతి ఎస్-క్రాస్ మరియు హ్యుందాయ్ క్రెటా కన్నా ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంది.

 డాట్సన్ రెడి గొ గురించి పది ముఖ్యమైన విషయాలు

9. సౌకర్యవంతమైన క్యాబిన్ - మీరు ఈ కారులోని ప్రవేశించిన తరువాత పూర్తి స్థాయిలే గ్రే కలర్‌లో ఉన్న ఇంటీరియర్ దర్శనమిస్తుంది. ఇందులో మూడు స్పోక్స్ ఉన్న స్టీరింగ్ వీల్, 1-డిఐఎన్ ఆడియో ప్లేయర్ కలదు. ఫ్యాబ్రిక్ సీట్లు ఎంతో చక్కగా ఉంటాయి. గేర్‌బాక్స్‌ కన్నా ముందుగా పవర్ విండోలకు సంభందించిన బటన్‌లు ఉన్నాయి.

 డాట్సన్ రెడి గొ గురించి పది ముఖ్యమైన విషయాలు

10. టర్నింగ్ రేడియస్ - సిటి ట్రాఫిక్‌లో ఎలాంటి ఇబ్బంది లేకుండా రైడింగ్ చేయడానికి ఇందులో 4.73 మీటర్ల టర్నింగ్ రేడియస్‌ను కల్పించారు.

 డాట్సన్ రెడి గొ గురించి పది ముఖ్యమైన విషయాలు

డాట్సన్ రెడి గొ టెస్ట్ రివ్యూ వివరాలు: ఎంత వరకు ఉత్తమమైనది...?

Most Read Articles

English summary
10 Interesting Things You Should Know Datsun Redi Go
Story first published: Tuesday, June 28, 2016, 12:39 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X