2017 ఫేస్‌లిఫ్టెడ్ స్కోడా ఆక్టావియా విఆర్ఎస్ ఆవిష్కరణ

Written By:

సిజెక్ ప్యాసింజర్ కార్ల తయారీ స్కోడా తమ ఫ్లాగ్ షిప్ పర్ఫామెన్స్ మోడల్ ఆక్టావియా విఆర్ఎస్ ను ఫేస్‌లిఫ్టెడ్ సొబగలతో ఆవిష్కరించింది. ఫేస్‌లిఫ్ట్ ఆక్టావియా ముందు వైపున డిజైన్‌లో స్వల్ప మార్పులతో పాటు ఆకర్షణీయమైన డ్యూయల్ హెడ్ ల్యాంప్స్ సిస్టమ్‌ను కలిగి ఉంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకోగలరు...

2017 ఫేస్‌లిఫ్టెడ్ స్కోడా ఆక్టావియా విఆర్ఎస్

2017 ఫేస్‌లిఫ్టెడ్ స్కోడా ఆక్టావియా విఆర్ఎస్ మోడల్‌లో 2.0-లీటర్ సామర్థ్యం గల టిఎస్ఐ ఇంజన్ కలదు. ఇది మునుపటి మోడల్ కన్నా 9 బిహెచ్‌పి పవర్ అధికంగా ఉత్పత్తి చేయును. అయితే ఆక్టావియా ఆర్ఎస్ లోని మిగతా డీజల్ ఇంజన్ వేరియంట్లు మునుపటి తరహా పనితీరునే ప్రదర్శిస్తాయి.

2017 ఫేస్‌లిఫ్టెడ్ స్కోడా ఆక్టావియా విఆర్ఎస్

ఆక్టావియా విఆర్ఎస్ ముందు వైపున పూర్తి స్థాయిలో ఆడాప్టివ్ ఎల్ఇడి లైట్లను కలిగి ఉంది. మరియు దీని ఇంటీరియర్‌లో నూతన అప్‌హోల్‌స్ట్రేతో పాటు ఆంబియంట్ లైటింగ్ సిస్టమ్ స్టాండర్డ్‌గా కలదు.

2017 ఫేస్‌లిఫ్టెడ్ స్కోడా ఆక్టావియా విఆర్ఎస్

స్కోడా 2017 ఆక్టావియా ఆర్ఎస్ మోడల్‌లో 18-అంగుళాల అల్లాయ్ వీల్స్‌ను అందిస్తోంది మరియు 19-అంగుళాల అల్లాయ్ వీల్స్‌ను ఆప్షనల్‌గా అందిస్తోంది.

2017 ఫేస్‌లిఫ్టెడ్ స్కోడా ఆక్టావియా విఆర్ఎస్

2017 స్కోడా ఆక్టావియా ఆర్ఎస్ వెనుక వైపున శక్తివంతమైన బ్లాక్ డిఫ్యూసర్ కలదు. మరియు దీనికి పై భాగంలో విశాలమైన ఎర్రటి ప్రకాశించే ల్యాంప్ కలదు. ఇందులో ఆంగ్లపు సి-ఆకారంలో ఉన్న ఎల్ఇడి టెయిల్ లైట్లు, మరియు ఎల్ఇడి లైట్ల ఆధారంగా ప్రకాశించే లైసెన్స్ నెంబర్ ప్లేట్ కలదు.

2017 ఫేస్‌లిఫ్టెడ్ స్కోడా ఆక్టావియా విఆర్ఎస్

నూతన ఆక్టావియా ఆర్ఎస్ మోడల్ లోని పెట్రోల్ వేరియంట్ 6.7 సెకండ్ల కాలంలో 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. మరియు ఆక్టావియా ఆర్ఎస్ లోని డీజల్ వేరియంట్ ఇదే వేగాన్ని 7.9 సెకండ్ల కాలంలో అందుకుంటుంది.

2017 ఫేస్‌లిఫ్టెడ్ స్కోడా ఆక్టావియా విఆర్ఎస్

స్కోడా తమ కార్ల నిర్మాణంలో భాగంగా డైనమిక్ ఛాసిస్ కంట్రోల్ సిస్టమ్, డ్రైవర్ ఎంచుకోదగ్గ విభిన్న రకాలైన డ్రైవింగ్ మోడ్స్ స్పోర్ట్, నార్మల్ మరియు కంఫర్ట్ కలవు.

2017 ఫేస్‌లిఫ్టెడ్ స్కోడా ఆక్టావియా విఆర్ఎస్

స్కోడా తెలిపిన సమాచారం మేరకు సరికొత్త ఆక్టావియా ఆర్ఎస్ పెట్రోల్ వేరియంట్ లీటర్‌కు 18.45 కిలోమీటర్లు అదే విధంగా డీజల్ వేరియంట్ ఆర్ఎస్ లీటర్‌కు 26.69 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలవు.

2017 ఫేస్‌లిఫ్టెడ్ స్కోడా ఆక్టావియా విఆర్ఎస్

స్కోడా ఈ ఆక్టావియా ఎర్ఎస్ లో డ్రైవర్ కోసం ప్రత్యేకంగా ట్రైలర్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, రియర్ ట్రాఫిక్ అలర్ట్ దీని ద్వారా వెనక్కి వెళ్లేటపుడు ట్రాఫిక్ సంభందించిన సమాచారాన్ని అందిస్తుంది.

2017 ఫేస్‌లిఫ్టెడ్ స్కోడా ఆక్టావియా విఆర్ఎస్

మీకు తెలియని పది మహీంద్రా వెహికల్స్

చాలా మందికి తెలియని మహీంద్రా అండ్ మహీంద్రా వారి పది వాహనాల గురించి తెలుసుకుందాం రండి.

2017 ఫేస్‌లిఫ్టెడ్ స్కోడా ఆక్టావియా విఆర్ఎస్

ప్రకృతి వైపరీత్యాల్లో ప్రాణాలను కాపాడే వాహనం గురించి పూర్తి వివరాలు

ప్రకృతి వైపరిత్యాల్లో మనుషుల ప్రాణాలను కాపాడుకునేందుకు ప్రత్యేకంగా నిర్మించిన వాహనం (యాక్షన్ మొబైల్ వాహనం) గురించి పూర్తి సమాచారం...

Read more on: #స్కోడా #skoda
English summary
2017 Facelifted Skoda Octavia vRS Revealed
Story first published: Wednesday, December 21, 2016, 19:18 [IST]
Please Wait while comments are loading...

Latest Photos