కొడియాక్ ఆధారిత 2018 స్కోడా యెటి ప్రదర్శన

Written By:

2018కి చెందిన స్కోడా యెటి తమ సరికొత్త కొడియాక్ ఆధారంతో రూపొందించబడిందని స్కోడా డిజైన్ ఛీఫ్ జోజెఫ్ కబన్ తెలిపాడు. అయితే కబన్ ఈ 2018 మోడల్‌కు చెందిన యెటి గురించి మరే ఇతర సమాచారం వెల్లడించలేదు. అయితే బాక్స్ ఆకారంలో ఉన్న కొడియాక్ డిజైన్‌ను స్కోడా కోల్పోదని మరియు దాని ఆధారంతోనే 2018 స్కోడా యెటిని అభివృద్ది చేసినట్లు తెలిపారు.

2018 స్కోడా యెటి ప్రదర్శన

స్కోడా 2018 యెటి 2017 ఏడాది మధ్య భాగానికి సందర్శకుల ముందుకు రానుంది మరియు 2018 ఏడాదిలో యుకె మార్కెట్లో దీనిని అమ్మకాలకు సిద్దం చేయనున్నారు.

2018 స్కోడా యెటి ప్రదర్శన

స్కోడా పెద్ద ఎస్‌యువి, కొడియాక్ డిజైన్ శైలి తరహాలోనే 2018 యెటి ఉండనుందని కబన్ తెలిపాడు.

2018 స్కోడా యెటి ప్రదర్శన

ప్రస్తుతం స్కోడా యెటి 2009 నుండి వివిధ అంతర్జాతీయ మార్కెట్లలో అమ్మకాల్లో ఉంది. విడుదల చేసిన సమయం నుండి యూరప్‌లో దీని అమ్మకాలు రోజు రోజుకీ పెరుగుతూనే ఉన్నాయి.

2018 స్కోడా యెటి ప్రదర్శన

అయితే స్కోడా గత రెండేళ్ల కాలం నుండి ఆశించిన స్థాయిలో ఫలితాలను సాధించలేకపోతోంది. అయితే వోక్స్‌వ్యాగన్ వారి ఎమ్‌క్యూబి వేదిక ఆధారంగా రూపొందుతున్న సరికొత్త యెటి స్కోడాకు పూర్వ వైభవాన్ని తీసుకురానుంది.

2018 స్కోడా యెటి ప్రదర్శన

2018 స్కోడా యోటిలో అధునాతన డీజల్ మరియు పెట్రోల్ ఇంజన్‌లతో పాటు సరికొత్త స్కోడా కొడియాక్‌లో పరిచయం కానున్న కొత్త ఫీచర్లు కూడా యెటిలో పరిచయం కానున్నాయి.

2018 స్కోడా యెటి ప్రదర్శన

ఎన్నో ఎస్‌యువి తరహా ఉత్పత్తులకు ఆజ్యమైన వోక్స్‌వ్యాగన్ వారి ఎమ్‌క్యూబి ప్లాట్‌ఫామ్ మీద సరికొత్త యెటి రూపొందించబడుతోంది కాబట్టి సీటింగ్ మరియు బాడీ ఇదే వేదిక మీద తయారైన టిగువాన్ మరియు ఆడి క్యూ3 ఎస్‌యువిల తరహాలోనే ఉండనుంది.

2018 స్కోడా యెటి ప్రదర్శన

స్కోడా అధికారిక డిజైనర్ కబన్ తెలిపిన వివరాల మేరకు సరికొత్త యెటి కొడియాక్ యొక్క ముందు మరియు వెనుక వైపున ఉన్న బంపర్ తరహా డిజైన్‌లో రానుంది.

2018 స్కోడా యెటి ప్రదర్శన

కొడియాక్ ఆధారిత 2018 స్కోడా యెటి ప్రదర్శన

  
Read more on: #స్కోడా #skoda
English summary
Read In Telugu: 2018 Skoda Yeti To Be Inspired By New Kodiaq
Story first published: Sunday, October 9, 2016, 9:00 [IST]
Please Wait while comments are loading...

Latest Photos