దీపావళికి కారు కొంటున్నారా ? ఉత్తమ కార్ల ధర, ఋణ, వడ్డీ, నెలసరి వాయిదా వంటి వివరాలు...

Written By:

ప్రతి ఏడాదిలో కూడా చివరి మూడు మాసాలు పండుగలు, పబ్బాలకు ఇండియా ఫేమస్. ఈ మూడు నెలల్లోనే కొనుగోలు, అమ్మకాల్లో భారీగా జోరందుకుంటాయి. అందులో కార్ల అమ్మకాలకు అయితే డోకానే లేదు. ఈ ఏడాది ప్రారంభం నుండి ఈ సందర్భం కోసం వేచి ఉన్న కస్టమర్లు చాలానే ఉన్నారు.

ఎలాగైనా ఈ దీపావళికి ఓ కారును కోనుగోలు చేయాలనుకునే వారి కోసం నేడుడ్రైవ్‌స్పార్క్ తెలుగు ప్రత్యేక కథనం. ఈ కథనంలో 5 నుండి 15 లక్షల మధ్య ధర ఉన్న ఫేమస్ కార్ల ధరలు, సాంకేతిక వివరాలు, వాటిపై వడ్డీ రేటు, నెలసరి వాయిదా పద్దతి వాయిదాల కాలపరిమితి మరియు రీసేల్ వ్యాల్యూ వంటి వివరాలను అందివ్వడం జరిగింది.

మారుతి సుజుకి ఆల్టో 800

మారుతి సుజుకి ఆల్టో 800

మారుతి వారి ఆల్టో 800లో 796సీసీ సామర్థ్యం గల సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది లీటర్‌కు 20.3కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలదు. ఆల్టో 800 ప్రారంభ ధర రూ. 2.49 లక్షలు గా ఉంది.

ఆల్టో 800 రుణ మరియు ఇఎమ్‌ఐ వివరాలు

ఆల్టో 800 రుణ మరియు ఇఎమ్‌ఐ వివరాలు

 • ప్రారంభ వేరియంట్ ధర: రూ. 2.49 లక్షలు
 • ఋణం మొత్తం: ధరలో 80 శాతంగా రూ. 1.99 లక్షలు లోన్
 • వడ్డీ రేటు: 10.5 శాతం
 • నెలసరి వాయిదా: రూ. 6,412 లు (3 సం.), రూ.4,240 లు (5 సం.)
 • రోజు వారి రన్నింగ్ కాస్ట్: రోజుకు సగటున 30 కిమీలు చొప్పున నెలకు రూ. 2,824 లు
 • 5 సంవత్సరాల తరువాత రీసేల్ వ్యాల్యూ: 1.45 లక్షలు (ఐదేళ్లకు)
హ్యుందాయ్ గ్రాండ్ ఐ10

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10

హ్యుందాయ్ వారి బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 1197సీసీసీ సామర్థ్యం గల పెట్రోల్ మరియు 1120సీసీ సామర్థ్యం గల డీజల్ ఇంజన్‌లతో అందుబాటులో ఉంది. పెట్రోల్ ఇంజన్ మైలేజ్18.9కిమీలు మరియు డీజల్ ఇంజన్ మైలేజ్ 24కిమీలు.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 రుణ మరియు ఇఎమ్‌ఐ వివరాలు

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 రుణ మరియు ఇఎమ్‌ఐ వివరాలు

 • ప్రారంభ వేరియంట్ ధర రూ. 4.91 లక్షలు
 • ఋణం మొత్తం: ధరలో 80 శాతంగా రూ. 3.51 లక్షలు లోన్
 • వడ్డీ రేటు: 10.5 శాతం
 • నెలసరి వాయిదా: రూ. 11,9309 లు (3 సం.), రూ.7,479 లు (5 సం.)
 • రోజు వారి రన్నింగ్ కాస్ట్: రోజుకు సగటున 30 కిమీలు చొప్పున నెలకు రూ. 3,516 లు
 • 5 సంవత్సరాల తరువాత రీసేల్ వ్యాల్యూ: 2.46 లక్షలు (ఐదేళ్లకు)
టాటా టియాగో

టాటా టియాగో

టాటా టియాగోలో 1199సీసీ సామర్థ్యం గల పెట్రోల్ మరియు 1047సీసీ సామర్థ్యం గల డీజల్ ఇంజన్‌లు కలవు. ఇవి వరుసగా లీటర్‌కు 23.84 మరియు 27.28 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలవు.

టాటా టియాగో రుణ మరియు ఇఎమ్‌ఐ వివరాలు

టాటా టియాగో రుణ మరియు ఇఎమ్‌ఐ వివరాలు

 • ప్రారంభ వేరియంట్ ధర రూ. 3.20 లక్షలు
 • ఋణం మొత్తం: ధరలో 80 శాతంగా రూ. 2.56 లక్షలు లోన్
 • వడ్డీ రేటు: 10.5 శాతం
 • నెలసరి వాయిదా: రూ. 8,248 లు (3 సం.), రూ.5,455 లు (5 సం.)
 • రోజు వారి రన్నింగ్ కాస్ట్: రోజుకు సగటున 30 కిమీలు చొప్పున నెలకు రూ. 2,997 లు
 • 5 సంవత్సరాల తరువాత రీసేల్ వ్యాల్యూ: 1.71 లక్షలు (ఐదేళ్లకు)
రెనో క్విడ్

రెనో క్విడ్

ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ రెనో దేశీయంగా అందించిన క్విడ్‌లో 799సీసీ సామర్థ్యం గల పెట్రోల్ ఇంజన్‌ను అందించింది. ఇది లీటర్‌కు 25.17 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలదు. రెనో తాజాగా క్విడ్ ను 1.0-లీటర్ ఇంజన్‌తో కూడా పరిచయం చేసింది.

రెనో క్విడ్ రుణ మరియు ఇఎమ్‌ఐ వివరాలు

రెనో క్విడ్ రుణ మరియు ఇఎమ్‌ఐ వివరాలు

 • ప్రారంభ వేరియంట్ ధర రూ. 2.60 లక్షలు
 • ఋణం మొత్తం: ధరలో 80 శాతంగా రూ. 2.11 లక్షలు లోన్
 • వడ్డీ రేటు: 10.5 శాతం
 • నెలసరి వాయిదా: రూ. 6,799 లు (3 సం.), రూ. 4,496 లు (5 సం.)
 • రోజు వారి రన్నింగ్ కాస్ట్: రోజుకు సగటున 30 కిమీలు చొప్పున నెలకు రూ. 2,517 లు
 • 5 సంవత్సరాల తరువాత రీసేల్ వ్యాల్యూ: 1.32 లక్షలు (ఐదేళ్లకు)
డాట్సన్ రెడి గో

డాట్సన్ రెడి గో

దేశీయంగా సరసమైన ఉత్పత్తులను అందించే సంస్థగా పేరుగాంచిన డాట్సన్ ఈ ఏడాదిలో రెనో క్విడ్ ఆధారిత డాట్సన్ రెడి గోను విడుదల చేసింది. ఇందులో కూడా అదే 799సీసీ సామర్థ్యం గల పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది లీటర్‌కు 25.17కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలదు.

డాట్సన్ రెడి గో రుణ మరియు ఇఎమ్‌ఐ వివరాలు

డాట్సన్ రెడి గో రుణ మరియు ఇఎమ్‌ఐ వివరాలు

 • ప్రారంభ వేరియంట్ ధర రూ. 2.38 లక్షలు
 • ఋణం మొత్తం: ధరలో 80 శాతంగా రూ. 1.90 లక్షలు లోన్
 • వడ్డీ రేటు: 10.5 శాతం
 • నెలసరి వాయిదా: రూ. 6,122 లు (3 సం.), రూ. 4,048 లు (5 సం.)
 • రోజు వారి రన్నింగ్ కాస్ట్: రోజుకు సగటున 30 కిమీలు చొప్పున నెలకు రూ. 2,690 లు
 • 5 సంవత్సరాల తరువాత రీసేల్ వ్యాల్యూ: 1.30 లక్షలు (ఐదేళ్లకు)
హ్యుందాయ్ ఎలైట్ ఐ20

హ్యుందాయ్ ఎలైట్ ఐ20

హ్యుందాయ్ ఎలైట్ ఐ20 లో 1197సీసీ సామర్థ్యం గల పెట్రోల్ మరియు 1396సీసీ సామర్థ్యం గల డీజల్ ఇంజన్‌లు కలవు. ఇవి వరుసగా 18.6 మరియు 22.54 కిమీల మైలేజ్ ఇవ్వగలవు.

ఎలైట్ ఐ20 రుణ మరియు ఇఎమ్‌ఐ వివరాలు

ఎలైట్ ఐ20 రుణ మరియు ఇఎమ్‌ఐ వివరాలు

 • ప్రారంభ వేరియంట్ ధర రూ. 6.16 లక్షలు
 • ఋణం మొత్తం: ధరలో 80 శాతంగా రూ. 4.92 లక్షలు లోన్
 • వడ్డీ రేటు: 10.5 శాతం
 • నెలసరి వాయిదా: రూ. 15,744 లు (3 సం.), రూ. 10,367 లు (5 సం.)
 • రోజు వారి రన్నింగ్ కాస్ట్: రోజుకు సగటున 30 కిమీలు చొప్పున నెలకు రూ. 4,323 లు
 • 5 సంవత్సరాల తరువాత రీసేల్ వ్యాల్యూ: 3.10 లక్షలు (ఐదేళ్లకు)
మారుతి సుజుకి బాలెనొ

మారుతి సుజుకి బాలెనొ

 • 1197సీసీ పెట్రోల్ ఇంజన్ మైలేజ్ 21.4 కిమీలు
 • 1248సీసీ డీజల్ ఇంజన్ మైలేజ్ 27.63 కిమీలు
 • రెండు ఇంజన్‌లు కూడా మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ అనుసంధానంతో ఉన్నాయి.
బాలెనొ రుణ మరియు ఇఎమ్‌ఐ వివరాలు

బాలెనొ రుణ మరియు ఇఎమ్‌ఐ వివరాలు

 • ప్రారంభ వేరియంట్ ధర రూ. 5.25 లక్షలు
 • ఋణం మొత్తం: ధరలో 80 శాతంగా రూ. 4.20 లక్షలు లోన్
 • వడ్డీ రేటు: 10.5 శాతం
 • నెలసరి వాయిదా: రూ. 13,440 లు (3 సం.), రూ. 8,850 లు (5 సం.)
 • రోజు వారి రన్నింగ్ కాస్ట్: రోజుకు సగటున 30 కిమీలు చొప్పున నెలకు రూ. 3,228 లు
 • 5 సంవత్సరాల తరువాత రీసేల్ వ్యాల్యూ: 3.06 లక్షలు (ఐదేళ్లకు)
మారుతి సుజుకి వితారా బ్రిజా

మారుతి సుజుకి వితారా బ్రిజా

మారుతి వితారా బ్రిజా కాంపాక్ట్ ఎస్‌యువిలో 1248సీసీ సామర్థ్యం గల డీజల్ ఇంజన్ కలదు. ఇది సుమారుగా 24.3 కిమీల మైలేజ్ ఇవ్వగలదు. దీనికి మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానం చేసారు.

వితారా బ్రిజా రుణ మరియు ఇఎమ్ఐ వివరాలు

వితారా బ్రిజా రుణ మరియు ఇఎమ్ఐ వివరాలు

 • ప్రారంభ వేరియంట్ ధర రూ. 7.19 లక్షలు
 • ఋణం మొత్తం: ధరలో 80 శాతంగా రూ. 5.75 లక్షలు లోన్
 • వడ్డీ రేటు: 10.5 శాతం
 • నెలసరి వాయిదా: రూ. 18.400 లు (3 సం.), రూ. 12.116 లు (5 సం.)
 • రోజు వారి రన్నింగ్ కాస్ట్: రోజుకు సగటున 30 కిమీలు చొప్పున నెలకు రూ. 2.767 లు
 • 5 సంవత్సరాల తరువాత రీసేల్ వ్యాల్యూ: 4.19 లక్షలు (ఐదేళ్లకు)
మారుతి సుజుకి స్విఫ్ట్

మారుతి సుజుకి స్విఫ్ట్

స్విప్ట్‌లో 1197సీసీ సామర్థ్యం గల పెట్రోల్ మరియు 1248సీసీ సామర్థ్యం గల డీజల్ ఇంజన్‌లు కలవు. ఇవి వరుసగా 20.4 మరియు 25.2 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలవు.

స్విఫ్ట్ రుణ మరియు ఇఎమ్ఐ వివరాలు

స్విఫ్ట్ రుణ మరియు ఇఎమ్ఐ వివరాలు

 • ప్రారంభ వేరియంట్ ధర రూ. 5.01 లక్షలు
 • ఋణం మొత్తం: ధరలో 80 శాతంగా రూ. 4 లక్షలు లోన్
 • వడ్డీ రేటు: 10.5 శాతం
 • నెలసరి వాయిదా: రూ. 12,800 లు (3 సం.), రూ. 8,429 లు (5 సం.)
 • 5 సంవత్సరాల తరువాత రీసేల్ వ్యాల్యూ: 2.92 లక్షలు (ఐదేళ్లకు)
మహీంద్రా కెయువి100

మహీంద్రా కెయువి100

మహీంద్రా తమ కెయువి100 క్రాసోవర్‌లో 18.5కిమీల మైలేజ్ ఇవ్వగల 1198సీసీ సామర్థ్యం ఉన్న పెట్రోల్ మరియు 25.32కిమీల మైలేజ్ ఇవ్వగల 1198సీసీ సామర్థ్యం గల డీజల్ ఇంజన్ కలదు.

కెయువి100 రుణ మరియు ఇఎమ్ఐ వివరాలు

కెయువి100 రుణ మరియు ఇఎమ్ఐ వివరాలు

 • ప్రారంభ వేరియంట్ ధర రూ. 5.05 లక్షలు
 • ఋణం మొత్తం: ధరలో 80 శాతంగా రూ. 4.04 లక్షలు లోన్
 • వడ్డీ రేటు: 10.5 శాతం
 • నెలసరి వాయిదా: రూ. 12,928 లు (3 సం.), రూ. 8,513 లు (5 సం.)
 • రోజు వారి రన్నింగ్ కాస్ట్: రోజుకు సగటున 30 కిమీలు చొప్పున నెలకు రూ. 3,708 లు
 • 5 సంవత్సరాల తరువాత రీసేల్ వ్యాల్యూ: 2.86 లక్షలు (ఐదేళ్లకు)
టయోటా ఇన్నోవా క్రిస్టా

టయోటా ఇన్నోవా క్రిస్టా

టయోటా మోటార్స్ ఇన్నోవా క్రిస్టా ఎమ్‌పివిలో 2694సీసీ సామర్థ్యం గల పెట్రోల్ మరియు లీటర్‌కు 15.1 కిమీల మైలేజ్ ఇవ్వగల 2393సీసీ సామర్థ్యం గల డీజల్ ఇంజన్‌ను అందించింది.

ఇన్నోవా క్రిస్టా రుణ మరియు ఇఎమ్ఐ వివరాలు

ఇన్నోవా క్రిస్టా రుణ మరియు ఇఎమ్ఐ వివరాలు

 • ప్రారంభ వేరియంట్ ధర రూ. 13.72 లక్షలు
 • ఋణం మొత్తం: ధరలో 80 శాతంగా రూ. 10.09 లక్షలు లోన్
 • వడ్డీ రేటు: 10.5 శాతం
 • నెలసరి వాయిదా: రూ. 34,864 లు (3 సం.), రూ. 22,858 లు (5 సం.)
 • రోజు వారి రన్నింగ్ కాస్ట్: రోజుకు సగటున 30 కిమీలు చొప్పున నెలకు రూ. 4,803 లు
 • 5 సంవత్సరాల తరువాత రీసేల్ వ్యాల్యూ: 7.27 లక్షలు (ఐదేళ్లకు)
హ్యుందాయ్ క్రెటా

హ్యుందాయ్ క్రెటా

హ్యందాయ్ మోటార్స్ ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసిన క్రెటా ఎస్‌యువిలో 15.29కిమీల మైలేజ్ ఇవ్వగల 1591సీసీ సామర్థ్యం ఉన్న పెట్రోల్ మరియు 21.38 కిమీల మైలేజ్ ఇవ్వగల 1396సీసీ సామర్థ్యం ఉన్న డీజల్ ఇంజన్‌లను అందించింది.

క్రెటా రుణ మరియు ఇఎమ్ఐ వివరాలు

క్రెటా రుణ మరియు ఇఎమ్ఐ వివరాలు

 • ప్రారంభ వేరియంట్ ధర రూ. 10.34 లక్షలు
 • ఋణం మొత్తం: ధరలో 80 శాతంగా రూ. 8.27 లక్షలు లోన్
 • వడ్డీ రేటు: 10.5 శాతం
 • నెలసరి వాయిదా: రూ. 26,283 లు (3 సం.), రూ. 17,232 లు (5 సం.)
 • రోజు వారి రన్నింగ్ కాస్ట్: రోజుకు సగటున 30 కిమీలు చొప్పున నెలకు రూ. 5,130 లు
 • 5 సంవత్సరాల తరువాత రీసేల్ వ్యాల్యూ: 5.79 లక్షలు (ఐదేళ్లకు)
మారుతి సుజుకి సియాజ్

మారుతి సుజుకి సియాజ్

సియాజ్‌లోని 1373సీసీ సామర్థ్యం ఉన్న పెట్రోల్ ఇంజన్ లీటర్‌కు 20.73కిమీల మైలేజ్ మరియు 1248సీసీ సామర్థ్యం ఉన్న డీజల్ ఇంజన్ సుమారుగా 28.09కిమీల మైలేజ్ ఇవ్వగలవు. మారుతి సియాజ్ సెడాన్‌లో హైబ్రిడ్ సాంకేతికతను పరిచయం చేసింది.

సియాజ్ రుణ మరియు ఇఎమ్ఐ వివరాలు

సియాజ్ రుణ మరియు ఇఎమ్ఐ వివరాలు

 • ప్రారంభ వేరియంట్ ధర రూ. 10.28 లక్షలు
 • ఋణం మొత్తం: ధరలో 80 శాతంగా రూ. 8.22 లక్షలు లోన్
 • వడ్డీ రేటు: 10.5 శాతం
 • నెలసరి వాయిదా: రూ. 26,124 లు (3 సం.), రూ. 17,128 లు (5 సం.)
 • రోజు వారి రన్నింగ్ కాస్ట్: రోజుకు సగటున 30 కిమీలు చొప్పున నెలకు రూ. 1,878 లు
 • 5 సంవత్సరాల తరువాత రీసేల్ వ్యాల్యూ: 6 లక్షలు (ఐదేళ్లకు)
హోండా సిటీ

హోండా సిటీ

హోండా సిటి సెడాన్‌లో 17.8కిమీల మైలేజ్ ఇవ్వగల 1497సీసీ సామర్థ్యం ఉన్న పెట్రోల్ ఇంజన్ అదే విధంగా 26కిమీల మైలేజ్ ఇవ్వగల 1498సీసీ సామర్థ్యం గల డీజల్ ఇంజన్‌లు కలవు.

సిటి సెడాన్ రుణ మరియు ఇఎమ్‌ఐ వివరాలు

సిటి సెడాన్ రుణ మరియు ఇఎమ్‌ఐ వివరాలు

 • ప్రారంభ వేరియంట్ ధర రూ. 10.38 లక్షలు
 • ఋణం మొత్తం: ధరలో 80 శాతంగా రూ. 8.30 లక్షలు లోన్
 • వడ్డీ రేటు: 10.5 శాతం
 • నెలసరి వాయిదా: రూ. 26,379 లు (3 సం.), రూ. 17,295 లు (5 సం.)
 • రోజు వారి రన్నింగ్ కాస్ట్: రోజుకు సగటున 30 కిమీలు చొప్పున నెలకు రూ. 3,843 లు
 • 5 సంవత్సరాల తరువాత రీసేల్ వ్యాల్యూ: 5.69 లక్షలు (ఐదేళ్లకు)
హోండా బిఆర్-వి

హోండా బిఆర్-వి

హోండా మోటార్స్ వారి తాజా ఎస్‌యువి బిఆర్‌విలో 1497సీసీ సామర్థ్యం ఉన్న పెట్రోల్ మరియు 1498సీసీ సామర్థ్యం ఉన్న డీజల్ ఇంజన్‌లను అందించింది. ఇవి వరుసగా 15.4 మరియు 21.9 కిమీల మైలేజ్ ఇవ్వగలవు.

బిఆర్-వి రుణ మరియు ఇఎమ్ఐ వివరాలు

బిఆర్-వి రుణ మరియు ఇఎమ్ఐ వివరాలు

 • ప్రారంభ వేరియంట్ ధర రూ. 10.90 లక్షలు
 • ఋణం మొత్తం: ధరలో 80 శాతంగా రూ. 8.70 లక్షలు లోన్
 • వడ్డీ రేటు: 10.5 శాతం
 • నెలసరి వాయిదా: రూ. 27,713 లు (3 సం.), రూ. 18,170 లు (5 సం.)
 • రోజు వారి రన్నింగ్ కాస్ట్: రోజుకు సగటున 30 కిమీలు చొప్పున నెలకు రూ. 4,842 లు
 • 5 సంవత్సరాల తరువాత రీసేల్ వ్యాల్యూ: 5.97 లక్షలు (ఐదేళ్లకు)
దీపావళికి కారు కొంటున్నారా

గమనిక అన్ని ధరలు ఎక్స్ షోరూమ్ ఢిల్లీగా ఉన్నాయి. మరియు ఇందులో ఎంచుకున్న ప్రతి వేరియంట్ ఆ మోడల్‌లో ఉన్న ప్రారంభ వేరియంట్. డీలర్లు మరియు ఋణ సంస్థల ప్రమాణాలకు అనుగుణంగా ఋణం, వడ్డీ రేటు, నెలసరి వాయిదాలలో మార్పులు జరిగే అవకాశం ఉంది. రన్నింగ్ కాస్ట్ ప్రస్తుత పెట్రోల్ ధర ఆధారంగా లెక్కించడం జరిగింది.

  
English summary
Read In Telugu: Affordable Cars For This Festive Season
Story first published: Wednesday, October 5, 2016, 14:38 [IST]
Please Wait while comments are loading...

Latest Photos