ఆడి నుండి ఆర్ఎస్ 7 పర్ఫామెన్స్ మోడల్ విడుదల
ఆడి ఇండియా దేశీయ విపణిలోకి సరికొత్త ఆర్ఎస్ 7 పర్ఫామెన్స్ ఉత్పత్తిని విడుదల చేసింది. ఇండియన్ మార్కెట్లోని లగ్జరీ సెగ్మెంట్లోకి అస్కారి బ్లూ అనే సరికొత్త రంగులో పరిచయం అయ్యింది.
ఆడి ఇండియా దేశీయ మార్కెట్లోకి సరికొత్త ఆర్ఎస్ 7 పర్ఫామెన్స్ మోడల్ కారును ప్రవేశపెట్టింది. దీనిని ప్రారంభ ధర రూ. 1.60 కోట్లు ఎక్స్ షోరూమ్ ఢిల్లీగా నిర్ణయించింది. ఆడి ఇండియా ఫోర్ట్‌ఫోలియోలో ఈ ఆర్ఎస్ 7 పర్ఫామెన్స్ మోడల్ చేరిక ద్వారా ఆడి శ్రేణి బలం మరింత పెరిగిందని చెప్పవచ్చు.

ఆడి ఆర్ఎస్ 7 పర్ఫామెన్స్ మోడల్‌లో 4.0-లీటర్ సామర్థ్యం ఉన్న వి8 బైటుర్బో ఇంజన్, అవసరాన్ని బట్టి అదనపు సిలిండర్‌ను వినియోగించుకునే ఇంజన్‌ను అందించింది.

ఇందులోని శక్తివంతమైన ఇంజన్ గరిష్టంగా 596.76బిహెచ్‌పి పవర్ మరియు 700ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. మరియు ఓవర్ బూస్ట్ ఫంక్షన్ ద్వారా తాత్కాలికంగా 750ఎన్ఎమ్ వరకు టార్క్ ఉత్పత్తి అవుతుంది.

సరికొత్త ఆడి ఆర్ఎస్7 పర్ఫామెన్స్ కేవలం 3.7 సెంకడ్ల కాలవ్యవధిలో గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది మరియు దీని గరిష్ట వేగం గంటకు 305 కిలోమీటర్లుగా ఉంది.

ఆడి ఈ ఆర్ఎస్ 7 మోడల్‌లోని ఇంజన్‌కు స్పోర్టివ్ ఆపరేషన్ గల పెడల్ షిఫ్టర్స్‌తో ఆపరేట్ చేయగల 8-స్పీడ్ టిప్‌ట్రోనిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ అనుసంధానం కలదు.

ఆడి లైనప్‌లో ఉండే సాధారణ రంగులతో పాటుగా మరో సరికొత్త అస్కారి బ్లూ రంగులో ఆర్ఎస్ 7 పర్ఫామెన్స్ మోడల్ అందుబాటులో ఉంది.

- రెనో క్విడ్ ఏఎమ్‌టి Vs మారుతి సుజుకి వ్యాగన్ఆర్ ఏఎమ్‌టి:ఏది బెస్ట్
- అక్కినేని నాగార్జున 57 వ పుట్టిన రోజు కానుకగా BMW
- ఇండియాలోని ఈ రైల్వే స్టేషన్లకు వెళ్లే వారు జర భద్రం


Click it and Unblock the Notifications








