బజాజ్ డామినర్ 400 విడుదల: ప్రారంభ ధర రూ. 1.36 లక్షలు

బజాజ్ తమ డామినర్ 400 బైకును ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ. 1.36 లక్షలు గా ప్రకటించింది. చిత్రాలతో కూడిన విడుదల సమాచారాన్ని ఇవాళ్టి స్టోరీలో...

By Anil

భారత దేశపు ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ బజాజ్ నేడు ఇండియన్ మార్కెట్లోకి తమ డామినర్ 400 బైకును విడుదల చేసింది. దీని ప్రారంభ వేరియంట్ ధర రూ. 1.36 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉన్నట్లు బజాజ్ తెలిపింది.

బజాజ్ డామినర్ 400 విడుదల

ఇండియన్ టూ వీలర్ మార్కెట్ ఈ ఏడాదిలో విడుదల కోసం ఎంతగానో ఎదురుచూసిన ఉత్పత్తుల్లో డామినర్ 400 ఒకటి. దీనిని ఏబిఎస్ మరియు నాన్ ఏబిఎస్ వేరియంట్లలో మార్కెట్లోకి విడుదల చేసింది. ( ఏబిఎస్ - యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్)

 బజాజ్ డామినర్ ధరలు

బజాజ్ డామినర్ ధరలు

  • బజాజ్ డామినర్ 400 నాన్ ఏబిఎస్ ధర రూ. 1.36 లక్షలు
  • బజాజ్ డామినర్ 400 ఏబిఎస్ వర్షన్ ధర రూ. 1.50 లక్షలు
  • రెండు ధరలు ఎక్స్ షోరూమ్ ఢిల్లీగా ఉన్నాయి.
    బజాజ్ డామినర్ 400 విడుదల

    స్పానిష్ భాషలో డామినర్ అనగా మాస్టర్ అని అర్థం. బజాజ్ కొత్తగా తమ లైనప్‌లోకి విడుదల చేసిన డామినర్ 400 బైకు ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మహీంద్రా మోజో మరియు సెగ్మెంట్ లీడర్ రాయల్ ఎన్ఫీల్డ్‌లోని టూరింగ్ మోడల్‌కు గట్టి పోటీగా నిలవనుంది.

    ఇంజన్ మరియు సాంకేతిక వివరాలు

    ఇంజన్ మరియు సాంకేతిక వివరాలు

    సాంకేతికంగా బజాజ్ ఇందులో అత్యాధునిక 373.3సీసీ సామర్థ్యం గల లిక్విడ్ కూలింగ్ వ్యవస్థ ఆధారిత సింగల్ సిలిండర్ ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ట్రిపుల్ స్పార్క్ ఇగ్నిషన్ ఇంజన్ అందించింది.

    బజాజ్ డామినర్ 400 విడుదల

    బజాజ్ డామినర్‌లోని బిఎస్-IV ఉద్గార నియమాలను పాటించే ఇంజన్ గరిష్టంగా 8,000ఆర్‌పిఎమ్ వద్ద 34.5బిహెచ్‌పి పవర్ మరియు 6,500ఆర్‌పిఎమ్ వద్ద 35ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేయగలదు.

    బజాజ్ డామినర్ 400 విడుదల

    బజాజ్ డామినర్ 400 కేవలం 8.2 సెకండ్ల కాలంలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది మరియు దీని గరిష్ట వేగం గంటకు 148 కిలోమీటర్లుగా ఉన్నట్లు బజాజ్ తెలిపింది.

    బజాజ్ డామినర్ 400 విడుదల

    బజాజ్ ఇందులో అత్యాధునిక స్లిప్పర్ క్లచ్ ను స్టాండర్డ్‌ ఫీచర్‌గా అందించింది మరియు బాడీ మొత్తాన్ని బీమ్-టైప్ పెరీమీటర్ ఫ్రేమ్‌లో ఇముడింపజేసింది.

     డామినర్ 400 మైలేజ్ మరియు ఇంధన ట్యాంక్ సామర్థ్యం

    డామినర్ 400 మైలేజ్ మరియు ఇంధన ట్యాంక్ సామర్థ్యం

    డామినర్ 400 బైకులో ఇంధన ట్యాంక్ సామర్థ్యం 13 లీటర్లుగా ఉంది. అయితే బజాజ్ దీని మైలేజ్‌కు సంభందించిన వివరాలను వెల్లడించలేదు. ఏదేమైనప్పటికీ దీనికి పోటీగా ఉన్న మహీంద్రా మోజో లీటర్‌కు 36 కిలోమీటర్లు అదే విధంగా రాయల్ ఎన్ఫీల్డ్ గరిష్టంగా 37 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలవు.

    బజాజ్ డామినర్ 400 విడుదల

    బజాజ్ డామినర్ 400 మొదటి సారిగా 2014 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద సిఎస్400 పేరుతో కాన్సెప్ట్ రూపంలో ప్రదర్శించబడింది. హెడ్ లైట్ మీద బోర్లించిన చిన్న గిన్నె డిజైన్ ఆకారం మినహా దీనికి సంభందించిన ఏ విధమైన డిజైన్ వివరాలను వెల్లడించకుండా చివరి వరకు గోప్యంగా ఉంచింది.

    బజాజ్ డామినర్ 400 విడుదల

    బజాజ్ డామినర్ 400 లో టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ కలదు (అయితే కాన్సెప్ట్ దశలో ఇందులో అప్ సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్స్ ఉండేవి), వెనుక భాగంలో అడ్జెస్ట్ చేసుకునే వెసులుబాటున్న మోనో షాక్ అబ్జార్వర్ కలదు.

    బజాజ్ డామినర్ 400 విడుదల

    రెండు చక్రాలకు డ్యూయల్ ఛానల్ యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్ గల డిస్క్ బ్రేకులు కలవు, పూర్తి స్థాయిలో డిజిటల్ మయం చేయబడిన ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ తో పాటుగా ఇంధన ట్యాంకు మీద మరో డిస్ల్పే ను అందించింది.

    బజాజ్ డామినర్ 400 విడుదల

    బజాజ్ ఆటో ఈ డామినర్ 400 ఎల్ఇడి హెడ్ లైట్‌ను అందించింది(ఫస్ట్ ఇన్ క్లాస్), ఈ లైట్ రేయింబవళ్లు ఆన్ లోనే ఉంటుంది. త్వరలో భద్రత ప్రమాణాల కోసం భారత ప్రభుత్వం ఈ ఫీచర్‌ని బైకుల్లో తప్పనిసరి చేయనుంది.

    లభించే రంగులు

    లభించే రంగులు

    బజాజ్ డామినర్ 400 బైకు మూడు విభిన్న రంగుల్లో లభించును. అవి, ట్విలైట్ ప్లమ్, మిడ్‌నైట్ బ్లూ మరియు మూన్ వైట్.

    బుకింగ్స్ మరియు డెలివరీ వివరాలు

    బుకింగ్స్ మరియు డెలివరీ వివరాలు

    ఈ డామినర్ 400 కి సంభందించిన బుకింగ్స్ ఇప్పుటికే ప్రారంభమయ్యాయి. దీనిని 9,000 ల ప్రారంభ ధరతో బుక్ చేసుకోవచ్చు మరియు బుక్ చేసుకున్న వారికి 2017 జనవరి మధ్య భాగం నుండి డెలివరీ ఇవ్వనుంది. అంతే కాకుండా వచ్చే ఏడాది ఫిబ్రవరి నుండి ఎగుమతులకు కూడా సిద్దం చేయనున్నట్లు తెలిపారు.

    బజాజ్ డామినర్ 400 కీ స్పెసిఫికేషన్స్

    బజాజ్ డామినర్ 400 కీ స్పెసిఫికేషన్స్

    • ఇంజన్ 373.3సీసీ
    • పవర్ 34.5బిహెచ్‌పి 8,000ఆర్‌పిఎమ్
    • టార్క్ 35ఎన్ఎమ్ 6,500ఆర్‌పిఎమ్
    • బరువు 182కిలోలు
    • 0 నుండి 100 కిమీల వేగం 8.2 సెకండ్ల కాలంలో
    • గరిష్ట వేగం గంటకు 148 కిమీలు
    • బజాజ్ డామినర్ 400 విడుదల

      • ఇంధన ట్యాంక్ సామర్థ్యం 13 లీటర్లు
      • ముందు టైరు 110/70 - 17 అంగుళాలు
      • వెనుక టైరు 150/60 - 1 అంగుళాలు
      • టైర్లు ఎమ్ఆaర్ఎఫ్ రెవ్జ్ సి1
      • గ్రౌండ్ క్లియరెన్స్ 157ఎమ్ఎమ్
      • బజాజ్ డామినర్ 400 అఫీషియల్ వీడియో క్లిప్

        బజాజ్ డామినర్ 400 విడుదల

        • విమానంలో కూర్చోవడానికి అత్యంత సురక్షితమైన చోటు ఏది ?
        • షెవర్లే ఎసెన్షియా కాంపాక్ట్ సెడాన్ విడుదల వివరాలు
        • మహీంద్రా నుండి మరో కాంపాక్ట్ SUV

Most Read Articles

Read more on: #బజాజ్
English summary
Bajaj Dominar 400 Launched In India [Images + Price List]
Story first published: Thursday, December 15, 2016, 16:53 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X