ఇండియాలో బెస్ట్ మైలేజ్ ఇవ్వగల డీజల్ కార్లు

By Anil

దేశీయంగా కొన్ని వందల కార్లు అందుబాటులో ఉన్నాయి. అందులో సెడాన్‌లు, హ్యాచ్‌బ్యాకులు, ఎస్‌యువిలు, లగ్జరీ సెడాన్ కార్లు ఇలా రూపాన్ని బట్టి అనేక రకాలుగా అందుబాటులో ఉన్నాయి. అందులో కూడా పెట్రోల్ , డీజల్ మరియు సిఎన్‌జి వంటి ఇంధన రకాలతో మరియు బడ్జెట్, లగ్జరీ వంటి అనేక అంశాల పరంగా కార్లను విభజించారు. అయితే మధ్య తరగతి వారు చూపు ఎప్పుడు కూడా తక్కువ బడ్జెట్ మరియు తక్కువ ధర గల కార్ల మీదే ఉంటుంది.

అందుకోసం 2016 సంవత్సరానికి దేశ వ్యాప్తంగా అందుబాటులో ఉన్న ఉత్తమ మైలేజ్ ఇవ్వగల ఎనిమిది డీజల్ కార్ల గురించి ప్రత్యేక శీర్షిక ద్వారా ఇవ్వడం జరిగింది. పూర్తి వివరాలకు క్రింద గల స్లైడర్లను పరిశీలించండి.

 8. హోండా అమేజ్ ఫేస్‌లిఫ్ట్

8. హోండా అమేజ్ ఫేస్‌లిఫ్ట్

హోండా మోటార్స్ వారు ఇంతకు ముందు ఉన్న అమేజ్ కారుకు కొన్ని మెరుగులుదిద్ది అమేజ్ ఫేస్‌లిఫ్ట్‌గా మార్కెట్లోకి ఈ నెల మొదటి వారంలో విడుదల చేశారు. దీని ప్రారంభ ధర రూ. 5.29 లక్షలుగా ఉంది.

 అమేజ్ ఫేస్‌లిఫ్ట్ మైలేజ్

అమేజ్ ఫేస్‌లిఫ్ట్ మైలేజ్

హోండా అమేజ్ ఫేస్‌లిఫ్ట్ కారులో 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజల్ ఇంజన్ అందుబాటులో ఉన్నాయి. ఇందులోని డీజల్ ఇంజన్ లీటర్‌కు అత్యధికంగా 25.8 కిలోమీటర్ల మైలేజ్‌ని ఇస్తుంది.

7. ఫోర్డ్ ఫిగో/ఆస్పైర్

7. ఫోర్డ్ ఫిగో/ఆస్పైర్

ఫోర్డ్ సంస్థ హ్యాచ్‌బ్యాక్ మరియు సెడాన్‌ల మార్కెట్లోకి ఒకేసారి రెండు మోడళ్లను విడుదల చేసింది. అందులో ఫిగో మరియు ఆస్పైర్‌లు ఉన్నాయి. రెండు కూడా మూడు ఇంజన్ ఆప్షన్లలో అందుబాటులో ఉన్నాయి. అందులో ఫిగో హ్యాచ్‌బ్యాక్‌లోని పెట్రోల్ మరియు డీజల్ వేరియంట్ల ప్రారంభ ధరలు వరుసగా 4.29 మరియు 5.29 లక్షలు ఎక్స్ షోరూమ్‌గా ఉన్నాయి.

 ఇండియాలో బెస్ట్ మైలేజ్ ఇవ్వగల డీజల్ కార్లు
  • 1.2-లీటర్ కెపాసిటి గల పెట్రోల్ ఇంజన్ లీటర్‌కు 18.16 కిమీలు
  • 1.5-లీటర్ కెపాసిటి గల పెట్రోల్ ఇంజన్ లీటర్‌కు 17.0 కిమీలు
  • 1.5-లీటర్ కెపాసిటి గల డీజల్ ఇంజన్ లీటర్‌కు 25.83 కిమీలు
  • 6. హోండా సిటి

    6. హోండా సిటి

    సెడాన్‌లలో హోండా మోటార్స్ తమ సిటి కారుతో ఆశించిన స్థాయిలో అమ్మకాలు సాధిస్తోంది. ప్రస్తుతం హోండా తమ సిటి కారుని పెట్రోల్ మరియు డీజల్ వేరియంట్లలో అందుబాటులో ఉంచింది. పెట్రోల్ మరియు డీజల్ ప్రారంభ వేరియంట్ ధరలు వరుసగా 7.96 మరియు 9.22 లక్షలు ఎక్స్‌షోరూమ్‌గా ఉన్నాయి.

     ఇండియాలో బెస్ట్ మైలేజ్ ఇవ్వగల డీజల్ కార్లు

    1498 సీసీ కెపాసిటి గల డీజల్ ఇంజన్ లీటర్‌కు 26 కిలోమీటర్లు మరియు 1497 సీసీ కెపాసిటి గల పెట్రోల్ ఇంజన్ లీటర్‌కు 17.8 కిలోమీటర్ల మైలేజ్‌ని ఇస్తుంది.

    5.మారుతి సుజుకి డిజైర్

    5.మారుతి సుజుకి డిజైర్

    ఇండియాలో టాప్-10 బెస్ట్ సెల్లింగ్ కార్లలో మారుతి సుజుకి వారి స్విఫ్ట్ డిజైర్ కారు రెండవ స్థానంలో ఉంది అదేవిధంగా సెడాన్ కార్లలో అత్యధికంగా అమ్మకాలు సాధిస్తున్న వాటిలో ఇది మొదటి స్థానంలో ఉంది. డిజైర్ పెట్రోల్ మరియు డీజల్ వేరియంట్ల ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధరలు వరుసగా 5.19 మరియు 5.99 లక్షలుగా ఉన్నాయి.

     ఇండియాలో బెస్ట్ మైలేజ్ ఇవ్వగల డీజల్ కార్లు

    1248సీసీ కెపాసిటి గల డీజల్ ఇంజన్ లీటర్‌కు 26.59 కిలోమీటర్లు మరియు 1197సీసీ కెపాసిటి గల పెట్రోల్ ఇంజన్ లీటర్‌కు 20.85 కిలోమీటర్లు మైలేజ్‌ని ఇస్తాయి.

    4. హోండా జాజ్

    4. హోండా జాజ్

    హోండా నుండి మరొక కారు జాజ్ బెస్ట్ మైలేజ్ డీజల్ కార్ల జాబితాలో స్థానం సంపాదించింది. హోండా తమ జాజ్ కారును పెట్రోల్ మరియు డీజల్ వేరియంట్లలో అందుబాటులో ఉంచింది. వీటి ఎక్స్ షోరూమ్ ప్రారంభ వేరియంట్ ధరలు వరుసగా 5.50 మరియు 6.79 లక్షలుగా ఉంది.

     ఇండియాలో బెస్ట్ మైలేజ్ ఇవ్వగల డీజల్ కార్లు

    హోండా జాజ్ అందుబాటులో ఉన్న 1498 సీసీ కెపాసిటి గల డీజల్ ఇంజన్ 27.3 కిలోమీటర్లు మరియు 1198సీసీ కెపాసిటి గల పెట్రోల్ ఇంజన్‌తో అందుబాటులో ఉన్న జాజ్ 18.7 కిలోమీటర్ల మైలేజ్‌ని ఇస్తుంది.

    3. మారుతి సుజుకి బాలెనొ

    3. మారుతి సుజుకి బాలెనొ

    మారుతి సుజుకి తాజాగా అభివృద్ది చేసిన బాలెనొ కారు అమ్మకాల పరంగా టాప్-10 జాబితాలో చోటు దక్కించుకుంది. ప్రస్తుతం బాలెనొ పెట్రోల్ మరియు డీజల్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. వీటి ప్రారంభ వేరియంట్ ఎక్స్‌షోరూమ్ ధరలు వరుసగా 5.15 మరియు 6.34 లక్షలుగా ఉన్నాయి.

     ఇండియాలో బెస్ట్ మైలేజ్ ఇవ్వగల డీజల్ కార్లు

    మారుతి సుజుకి తమ బాలెనొలో అందించిన 1197సీసీ కెపాసిటి గల పెట్రోల్ ఇంజన్ లీటర్‌కు 21.4 కిలోమీటర్లు మరియు 1248సీసీ కెపాసిటి గల డీజల్ ఇంజన్ లీటర్‌కు 27.39 కిలోమీటర్ల మైలేజ్‌ని ఇస్తాయి.

    2. మారుతి సుజుకి సెలెరియో

    2. మారుతి సుజుకి సెలెరియో

    మారుతి సుజుకి ఆల్టో కన్నా కొంచెం హెచ్చు స్థానంలో అందించిన బడ్జెట్ కారు సెలెరియో. ప్రస్తుతం సెలెరియో పెట్రోల్ మరియు డీజల్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. వీటి ప్రారంభ వేరియంట్ ఎక్స్ షోరూమ్ ధరలు వరుసగా 4 మరియు 4.72 లక్షలుగా ఉన్నాయి.

     ఇండియాలో బెస్ట్ మైలేజ్ ఇవ్వగల డీజల్ కార్లు

    మారుతి సుజుకి వారు తమ సెలెరియో అందించిన రెండు ఇంజన్ ఆప్షన్లు కూడా మంచి మైలేజ్‌ని ఇస్తాయి. అందులో 998సీసీ కెపాసిటి గల డీజల్ ఇంజన్ దాదాపుగా 23.7 కిలోమీటర్లు మరియు 793 సీసీ కెపాసిటి గల డీజల్ ఇంజన్ 27.62 కిలోమీటర్ల మైలేజ్‌ని ఇస్తాయి.

    1. మారుతి సుజుకి సియాజ్

    1. మారుతి సుజుకి సియాజ్

    బెస్ట్ మైలేజ్ డీజల్ కార్ల జాబితాలో మారుతి సుజుకి నుండి నాలుగవ కారు సియాజ్ ఎంపికై మొదటి స్థానంలో ఉంది. సియాజ్ కారు పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ వేరియంట్లలలో అందుబాటులో ఉంది. వీటి ప్రారంభ వేరియంట్ ఎక్స్‌ షోరూమ్ ధరలు 7.53 మరియు 8.23 లక్షలుగా ఉన్నాయి.

     ఇండియాలో బెస్ట్ మైలేజ్ ఇవ్వగల డీజల్ కార్లు

    మారుతి సుజుకి తమ సియాజ్ కారులో అందించిన 1373సీసీ కెపాసిటి గల పెట్రోల్ ఇంజన్‌ లీటర్‌కు 20.73 కిలోమీటర్లు మరియు 1248సీసీ కెపాసిటి గల డీజల్ ఇంజన్ లీటర్‌కు 28.09 కిలోమీటర్లు అత్యధిక మైలేజ్‌తో మొదటి స్థానంలో నిలిచింది.

    మరిన్ని కథనాల కోసం....
    • టాప్-10 జాబితాలో రాజ్యమేలుతున్న మారుతి సుజుకి !
    • భద్రత పరంగా భారతీయ మార్కెట్లో ఉన్న బెస్ట్ కార్లు
    • టాటా టియాగో కొనాలనుకుంటున్నారా ? టియాగో యొక్క ప్రతికూలతలు మరియు ప్రయోజనాలు

Most Read Articles

Read more on: #కారు #car
English summary
Top 8 Best Fuel Efficient Diesel Cars In India 2016
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X