సేఫ్టీ పరంగా ఇండియన్ మార్కెట్లో ఉన్న ఐదు ఉత్తమ కార్లు ఏవో తెలుసా?

ప్రస్తుత ప్రపంచంలో కార్ల ప్రభావం మన మీద చాలా ఉంది. బహుశా ఈ ప్రభావమే కావచ్చు ఎక్కువ మంది కార్లను కొనడానికి అడుగులు వేయిస్తోంది. అయితే మీరు కొంటున్న కార్లు ఎంత వరకు సురక్షితమైనవో తెలుసా ?

By Anil

ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది కార్ల ప్రభావం చాలా ఉంది. బహుశా ఈ ప్రభావమే కావచ్చు ఎక్కువ మంది కార్లను కొనడానికి అడుగులు వేయిస్తోంది. మరి మనం ఎంచుకుంటున్న కార్లు ఎంత వరకు సురక్షితమైనవో తెలుసా ?

అందుకే ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో సేఫ్టీ పరంగా అత్యధిక ఫీచర్లను కలిగి ఉన్న ఐదు బెస్ట్ కార్ల గురించి ప్రత్యేకం కథనం...

భద్రత గురించి కొంచెం వివరంగా....

భద్రత గురించి కొంచెం వివరంగా....

ప్రతి కారుకు మార్కెట్లోకి విడుదల చేసే ముందు రకరకాల భద్రత పరీక్షలు నిర్వహిస్తారు. న్యూ కార్ అస్సెస్‌మెంచ్ ప్రోగ్రామ్ ద్వారా కారులోని ప్రాథమిక భద్రత అంశాలను మరియు కొన్ని క్రాష్ పరీక్షలను నిర్వహించి వాటికి సంభందించిన రేటింగ్‌ను ఇస్తారు. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో చాలా వరకు కార్ల సంస్థలు తమ అన్ని వేరియంట్లలో కూడా ప్రాథమిక భద్రత ఫీచర్లను అందిస్తున్నాయి. అంతే కాకుండా ఇండియాలో తయారయ్యే ప్రతి కారుకు కూడా వచ్చే ఏడాది నుండి దేశీయంగానే భద్రత పరీక్షలు నిర్వహించనున్నారు.

ఫోర్డ్ ఫిగో లోని భద్రత అంశాలు

ఫోర్డ్ ఫిగో లోని భద్రత అంశాలు

ఫోర్డ్ మోటార్స్ సంస్థ తమ ఫిగో మరియు ఆస్పైర్ కార్లలో ముందు మరియు వెనుక వైపున మొత్తం ఆరు ఎయిర్ బ్యాగులను అందించింది. కాబట్టి ఈ రెండు కార్లలో వెనుక సీట్లలో ప్రయాణించే వారు భద్రంగా ప్రయాణించవచ్చు.

ఫోర్డ్ ఫిగో లోని భద్రత ఫీచర్లు

ఫోర్డ్ ఫిగో లోని భద్రత ఫీచర్లు

ఈ రెండింటిలో పెరీమీటర్‌ను అందించారు. దీని ద్వారా కారు దేనినైనా ఢీ కొనే ముందు ఇది ఆక్టివ్ అవుతుంది. ఆ తరువాత వెంటనే హెడ్ లైట్లు, పార్కింగ్ లైట్లు వెలుగుతాయి మరియు ఇంస్ట్రుమెంటల్ ప్యానెల్‌లో థెఫ్ట్ ఇండికేటర్‌ను చూపుతుంది.

ఫోర్డ్ ఫిగో లోని భద్రత అంశాలు

ఫోర్డ్ ఫిగో లోని భద్రత అంశాలు

మీకు ఘాట్ రోడ్లలో డ్రైవింగ్ చేయడం సరిగా రాదు అనుకోండి కొండ మీద నుండి కారు క్రిందకు జారుతూ వస్తుంది. అందుకోసం ఇలాంటి సమస్యలను కంట్రోల్ చేయడానికి ఫోర్డ్ తమ ఫిగో మరియు ఆస్పైర్‌లో హిల్ లాంచ్ అసిస్ట్‌ను కల్పించింది. దీనితో పాటు యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్‌ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ మరియు ఎలక్ట్రానిక్ స్టెబులిటి ప్రోగ్రామ్ వంటివి ఇందులో ఉన్నాయి.

హ్యుందాయ్ ఐ20 భద్రత ఫీచర్లు

హ్యుందాయ్ ఐ20 భద్రత ఫీచర్లు

హ్యుందాయ్ మోటార్స్ వారు తమ ఐ20 హ్యాచ్‌బ్యాక్ కారులో రెండు ఎయిర్ బ్యాగులు, యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్ మరియు స్మార్ట్ పెడల్‌ను అందించారు. స్మార్ట్ పెడల్ ఏంటి అనుకుంటున్నారా ? మీరు బ్రేకు మరియు యాక్సిలరేటర్‌ను ఒకేసారి ప్రెస్ చేశారనుకోండి అపుడు ఈ స్మార్ట్ పెడల్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యి యాక్సిలరేటర్ మీద ఫోర్స్ తగ్గించి బ్రేకు మాత్రమే పనిచేసే విధంగా చేస్తుంది.

 హ్యుందాయ్ ఐ20 భద్రత ఫీచర్లు

హ్యుందాయ్ ఐ20 భద్రత ఫీచర్లు

హ్యుందాయ్‌ ఐ20 కారులోని హెడ్ లైట్లు చీకటిలో అయితే ఆటోమేటిక్‌గా వెలగడం మరియు పగలు అయితే ఆటోమేటిక్‌గా ఆఫ్ అవుతాయి, పూర్తిగా మూసి ఉన్న విండో అద్దాలను మీరు టచ్‌ చేస్తే అవి ఆటోమేటిక్‌గా క్రిందకు కదులుతాయి. వీటితో పాటు రియర్ పార్కింగ్ అసిస్ట్ సిస్టమ్, స్టీరింగ్ మీద ఆడియో కంట్రోల్ సిస్టమ్, పెట్రోల్ తగ్గితే ఇండికేట్ చేయడం, ఇంజన్ ఇమ్మొబిలైజర్ మరియు డ్రైవర్ సీట్ బెల్ట్ పెట్టుకోవాలని గుర్తు చేసే సిస్టమ్ వంటివి కలవు.

 వోక్స్‌వ్యాగన్ పోలో

వోక్స్‌వ్యాగన్ పోలో

సేఫ్టీ పరంగా ఉన్న బెస్ట్ కార్ల జాబితాలో వోక్స్‌వ్యాగన్ వారి పోలో కారు కూడా కలదు. ఇందులో రెండు ఎయిర్ బ్యాగులు, యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఫీచర్లను అన్ని వేరియంట్లలో కూడా అందివ్వడం జరిగింది. అంతే కాకుండా ఇంజన్ ఇమ్మొబిలైజర్, ఆటో డిమ్మింగ్ ఐఆర్‌విఎమ్, హై మౌంటెడ్ స్టాప్ లైట్, ఆటోమేటిక్‌గా క్రిందకు కదిలే విండో అద్దాలు ఇందులో ప్రత్యేకం.

భద్రత పరంగా భారతీయ మార్కెట్లో ఉన్న బెస్ట్ కార్లు

వర్షం వస్తే ఆటోమేటిక్ గా పని చేసే వైపర్లు, లేన్ ఛేంజ్ ఇండికేటర్లు, స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్స్ మరియు రియర్ పార్కింగ్ సెన్సార్లు పోలో కారులో ఉన్నాయి.

హ్యుందాయ్ క్రెటా భద్రత ఫీచర్లు

హ్యుందాయ్ క్రెటా భద్రత ఫీచర్లు

హ్యుందాయ్ మోటార్స్ నూతన ఎస్‌యువి వాహనం క్రెటా ఈ జాబితాలో చోటు సాధించింది. ఇందులో

  • ఆరు ఎయిర్ బ్యాగులు
  • యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్
  • ఎలక్ట్రానిక్ బ్రేక్‌ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్
  • ఎలక్ట్రానిక్ స్టెబిలిటి కంట్రోల్
  • హ్యుందాయ్ క్రెటా భద్రత ఫీచర్లు

    హ్యుందాయ్ క్రెటా భద్రత ఫీచర్లు

    • వెహికల్ స్టెబిలిటి మెనేజ్‌మెంట్ కంట్రోల్
    • హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్
    • కెమెరా గల రియర్ పార్కింగ్ అసిస్ట్
    • లేన్ చేంజ్ ఇండికేటర్
    • లేన్ చేంజ్ ఫ్లాష్ అడ్జెస్ట్‌మెంట్
    • స్పీడ్ సెన్సింగ్ డోర్ లాక్ మరియు స్టీరింగ్ వీల్ కంట్రోల్స్‌ కలవు.
    •  టయోటా లివా మరియు ఎటియోస్‌‌ లోని భద్రత ఫీచర్లు

      టయోటా లివా మరియు ఎటియోస్‌‌ లోని భద్రత ఫీచర్లు

      టయోటా తమ వివా కారులోని అన్ని వేరియంట్లలోరెండు ఎయిర్ బ్యాగులు మరియు ఆప్షనల్‌గా యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్ మరియు ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ వంటివి కలవు వీటితో పాటు ఇంజన్ ఇమ్మొబిలైజర్ మరియు కీ లెస్ ఎంట్రీ ఫీచర్లు ఉన్నాయి.

      భద్రత పరంగా భారతీయ మార్కెట్లో ఉన్న బెస్ట్ కార్లు

      ఇందులో కొన్ని వార్నింగ్ ఫీచర్లు కూడా ఉన్నాయి. డ్రైవర్ సీట్ బెల్ట్ రిమైండర్, డోర్ లాక్ వార్నింగ్, హెడ్ ల్యాప్స్ మరియు రివర్స్ పార్కింగ్ సెన్సార్లు.

      భద్రత పరంగా భారతీయ మార్కెట్లో ఉన్న బెస్ట్ కార్లు
      • దెయ్యాలు ఎక్కువగా ఉన్న టాప్-10 భారతీయ రోడ్లు

Most Read Articles

Read more on: #కార్ #car
English summary
Top 5 Best Safest Cars In India In 2016
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X