షెవర్లే ఎసెన్షియా కాంపాక్ట్ సెడాన్ విడుదల వివరాలు

Written By:

అమెరికాకు చెందిన ప్రముఖ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ జనరల్ మోటార్స్ వచ్చే ఏడాది నుండి రెండేళ్లలోపు నూతన ఉత్పత్తులను ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేయడానికి సిద్దమవుతోంది. అందులో తమ చౌకైన కాంపాక్ట్ సెడాన్ ఎసెన్షియాను మార్చి 2017 లో విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది.

షెవర్లే ఎసెన్షియా కాంపాక్ట్ సెడాన్

షెవర్లే ఇండియా దేశీయ విపణిలోకి విడుదల చేయడానికి సిద్దమైన తమ ఎసెన్షియా కాంపాక్ట్ సెడాన్‌ను ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ప్రదర్శించింది.

షెవర్లే ఎసెన్షియా కాంపాక్ట్ సెడాన్

ప్రస్తుతం ఆటోమొబైల్ పరిశ్రమలో తాజాగ అందుతున్న సమాచారం ప్రకారం జనరల్ మోటార్స్‌కు చెందిన షెవర్లే ఈ ఎసెన్షియా కాంపాక్ట్ సెడాన్‌ను వచ్చే ఏడాది 2017 మార్చి నాటికి విడుదల చేయనున్నట్లు తెలిసింది.

షెవర్లే ఎసెన్షియా కాంపాక్ట్ సెడాన్

దీనికి తోబుట్టువుగా వ్యవహరించే బీట్ హ్యాచ్‌బ్యాక్ యొక్క డిజైన్ లక్షణాలతో ఈ ఎసెన్షియాను రూపొందించారు. ఈ ఎసెన్షియాను కూడా బీట్ ను అభివృద్ది చేసిన ఫ్లాట్‌ఫామ్ మీదనే అభివృద్ది చేశారు.

షెవర్లే ఎసెన్షియా కాంపాక్ట్ సెడాన్

ప్రస్తుతం ఇండియన్ కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్లో అవే పాత మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఎసెన్షియా విడుదలతో కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్లోకి పూర్తిగా కొత్త గాలి వీచే అవకాశం ఉంది.

షెవర్లే ఎసెన్షియా కాంపాక్ట్ సెడాన్

షెవర్లే ఎసెన్షియా కాంపాక్ట్ సెడాన్ పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ వేరియంట్లలో పరిచయం కానుంది. అందులో 76.8బిహెచ్‌పి పవర్ మరియు 106.5ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయగల 1.2-లీటర్ స్మార్టెక్ పెట్రోల్ ఇంజన్ కలదు.

షెవర్లే ఎసెన్షియా కాంపాక్ట్ సెడాన్

అదే విధంగా 56.3బిహెచ్‌పి పవర్ మరియు 142.5ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయగల 1.0-లీటర్ సామర్థ్యం గల స్మార్టెక్ డీజల్ ఇంజన్ కలదు.

షెవర్లే ఎసెన్షియా కాంపాక్ట్ సెడాన్

ఇందులోని రెండు వేరియంట్లకు కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ అనుసంధానం రానుంది, మరియు కాస్త ఆలస్యంగా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ పరిచయం అయ్యే అవకాశం కలదు.

షెవర్లే ఎసెన్షియా కాంపాక్ట్ సెడాన్

ఎసెన్షియా కాంపాక్ట్ సెడాన్ ఇంటీరియర్ దాదాపుగా బీట్ హ్యాచ్‌బ్యాక్ ఆధారంతో రానుంది. మోటార్ సైకిల్ ప్రేరణతో ఇంటీరియర్ లోని ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ రూపొందించబడింది. మరియు షెవర్లే మైలింక్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కూడా ఇందులో కలదు.

షెవర్లే ఎసెన్షియా కాంపాక్ట్ సెడాన్

భద్రత పరంగా షెవర్లే ఈ ఎసెన్షియా కాంపాక్ట్ సెడాన్‌లో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ మరియు ఎసెన్షియాలోని టాప్ ఎండ్ వేరియంట్లో రివర్స్ పార్కింగ్ కెమెరా వచ్చే అవకాశం కలదు.

షెవర్లే ఎసెన్షియా కాంపాక్ట్ సెడాన్

షెవర్లే ఇండియా ఈ ఎసెన్షియా కాంపాక్ట్ సెడాన్ ను రూ. 4.5 నుండి 7.5 లక్షల మధ్య ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధరతో విడుదలయ్యే అవకాశం ఉంది.

షెవర్లే ఎసెన్షియా కాంపాక్ట్ సెడాన్

ఇది పూర్తి స్థాయిలో దేశీయ కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్లోకి విడుదలైతే ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్, హ్యుందాయ్ ఎక్సెంట్, హోండా అమేజ్, ఫోర్డ్ ఆస్పైర్, వోక్స్‌వ్యాగన్ అమియో మరియు టాటా త్వరలో విడుదల చేయనున్న కైట్ 5 వంటి వాటితో గట్టి పోటీని ఎదుర్కోనుంది.

 
English summary
Chevrolet Essentia To Be Launched In India By March 2017
Story first published: Tuesday, December 13, 2016, 12:50 [IST]
Please Wait while comments are loading...

Latest Photos