షెవర్లే వారి ఆఫర్లు: ప్రతి కొనుగోలు మీద ఖచ్చితమైన బంగారు మరియు క్యాష్ బ్యాక్

Posted By:

అమెరికాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ షెవర్లే ఇండియా, దేశీయంగా ఆఫర్లను అందించడంలో ఎప్పుడు ముందుంటుంది అని చెప్పాలి. ప్రతి నెలా వివిధ రకాల ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకునే షెవర్లే ఈ ఏడాది దేశీయంగా ప్రారంభమైన పండుగ సీజన్ సందర్భంగా ఆద్బుతమైన ఆఫర్లను ప్రకటించింది.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
షెవర్లే ఇండియా పండుగ ఆఫర్లు

షెవర్లే ఇండియా దేశీయంగా అందుబాటులో ఉంచిన తమ అన్ని ఉత్పత్తుల మీద భారీ డిస్కౌంట్లు మరియు ప్రతి కొనుగోలుపై ఉచితంగా బంగారు బహుకరిస్తున్నారు.

షెవర్లే ఇండియా పండుగ ఆఫర్లు

షెవర్లే ఇండియా ప్రతి కొనుగోలు మీద గరిష్టంగా 1.12 లక్షలు మరియు కనిష్టంగా 52,000 రుపాయల వరకు డిస్కౌంట్‌గా అందిస్తున్నారు మరియు నాలుగు గ్రాముల బంగారు నాణేలను కూడా అందిస్తున్నారు.

షెవర్లే ఇండియా పండుగ ఆఫర్లు

షెవర్లే వారి ప్రీమియమ్ సెడాన్ క్రూజ్ మీద గరిష్టంగా 1,12,000 రుపాయల లాభాలను ప్రకటించారు. ఇందులో 50,000 రుపాయలు ఎక్స్‌చ్చేంజ్ మరియు 50,000 రుపాయలు అదనపు లాభంతో పాటు నాలుగు గ్రాములు బరువున్న బంగారు నాణాన్ని అందిస్తున్నారు.

షెవర్లే సెయిల్

షెవర్లే సెయిల్

షెవర్లే సెయిల్ మీద సుమారుగా 77,000 రుపాయల వరకు డిస్కౌంట్లను ప్రకటించింది. మరియు మొదటి సంవత్సర భీమాను ఉచితంగా అందిస్తోంది. సెయిల్ సెడాన్ మీద కూడా నాలుగు గ్రాముల బంగారు నాణాన్ని అందిస్తున్నారు.

షవర్లే బీట్

షవర్లే బీట్

షెవర్లే ఇండియా బీట్ హ్యాచ్‌బ్యాక్ మీద సుమారుగా 74,000 రుపాయల వరకు లాభాలను ప్రకటించారు. మొదటి ఏడాది ఉచిత ఇన్సూరెన్స్‌తో పాటు గోల్డ్ కాయిన్ కూడా అందిస్తున్నారు.

షెవర్లే తవేరా

షెవర్లే తవేరా

షెవర్లే ఇండియా దేశీయంగా అందుబాటులో ఉంచిన తవేరా ఎమ్‌పివి మీద సుమారుగా 52,000 రుపాయల విలువైన ఎక్స్‌చ్చేంజ్ బోనస్, 25,000 రుపాయల క్యాష్‌బ్యాక్ ను అందిస్తోంది షెవర్లే. తవేరా మీద కూడా గోల్డ్ కాయిన్‌ను ఉచితంగా అందిస్తోంది.

షెవర్లే ఇండియా పండుగ ఆఫర్లు

షెవర్లే ఇండియా దేశవ్యాప్తంగా అందుబాటులో ఉంచిన ఈ అన్ని ఆఫర్లకు గడువు అక్టోబర్ 31, 2016 వ తేదీగా ఉంది.

షెవర్లే ఇండియా పండుగ ఆఫర్లు
  
English summary
Read In Telugu: Chevrolet Offering 4gm Gold Coin & Cash Benefits During 2016 Festive Season
Story first published: Monday, October 3, 2016, 12:26 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark