షెవర్లే ట్రయల్‌బ్లేజర్ టెస్టింగ్: ఫోటోలు మరియు సాంకేతిక వివరాలు
షెవర్లే వారి అప్ కమింగ్ ఎస్‌యువి ట్రయల్‌బ్లేజర్‌ను పూనేలో పరీక్షించారు. అమెరికాకు చెందిన ఈ నెక్ట్స్ జెన్ ఎస్‌యువి 2017 నాటికి మన ముందుకు రానుంది.
షేవర్లే ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేయాలనుకుంటున్న ఐదింటిలో ఇది ఒకటి. దీనిని మొదటి సారిగా 2016 బ్యాంకాక్ ఇంటర్నేషనల్ మోటార్ షో లో ప్రదర్శించారు.

షెవర్లే సంస్థ దీనిని ఇది వరకే బ్యాంకాక్ మోటార్ షో లో ప్రదర్శించినప్పటకీ ఇంకా అత్యంత రహస్యంగా పూర్తిగా నల్లటి స్టిక్కర్లతో కనబడకుండా చేసి రహదారి పరీక్షలు నిర్వహిస్తున్నారు.

ఈ ఎస్‌యువిలో ముందు వైపున రెండు పెద్ద ఫ్రంట్ గ్రిల్‌లు ఉన్నాయి. మరియు పెద్ద యాంగులర్ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి.

వెనుక వైపు డిజైన్‌లో టెయిల్ ల్యాంప్‌ను పూర్తి గా కప్పివేశారు. అయితే వెనుక వైపు డిజైన్ మొత్తం బ్యాంకాక్‌లో ప్రదర్శించబడిన ట్రయల్‌బ్లేజర్‌ను పోలి ఉంది.

ఈ ట్రయల్‌బ్లేజర్‌లో చోటు చేసుకున్న పెద్ద మార్పులు, ఇంటీరియర్‌వే అని చెప్పాలి. అందులో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో వంటి ఫీచర్లు ఉన్నాయి.

షెవర్లే ట్రయల్‌బ్లేజర్‌లో 2.8-లీటర్ సామర్థ్యం ఉన్న డ్యురామ్యాక్స్ డీజల్ ఇంజన్ కలదు.

ఇందులోని శక్తివంతమైన ఇంజన్ సుమారుగా 197బిహెచ్‌పి పవర్ మరియు 500ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

- టాప్-10 కార్ల సంస్థలకు ఆ పేర్లు ఎలా వచ్చాయి ?


Click it and Unblock the Notifications








