విడుదలకు సిద్దమైన ఫియట్ అవెంచురా అర్బన్ క్రాస్

Written By:

ఇటాలియన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫియట్ తమ అవెంచురా అర్బన్ క్రాస్ ను ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేయడానికి సర్వం సిద్దం చేసుకుంది. ఫియట్ మోటార్స్ ఈ అవెంచురా అర్బన్ క్రాస్ ను కాన్సెప్ట్ రూపంలో 2016 ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించారు.

ఫియట్ అవెంచురా అర్బన్ క్రాస్

ఫియట్ వారి అవెంచురా క్రాసోవర్ కార్లు ప్రస్తుతం భారతీయ రోడ్ల మీద తిరుగుతున్నాయి. అయితే ఈ అవెంచురా క్రాసోవర్‌కు స్వల్ప మార్పులు చేసి అవెంచురా అర్బన్ క్రాసోవర్ రూపంలో అందుబాటులోకి తీసుకురానుంది.

అవెంచురా అర్బన్ క్రాసోవర్‌లోని ప్రత్యేకతలు

అవెంచురా అర్బన్ క్రాసోవర్‌లోని ప్రత్యేకతలు

దీనికి డ్యూయల్ టోన్ పెయింట్ జాబ్‌ను అందించారు, ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్స్, ఫాలో మి హెడ్ ల్యాంప్స్, అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్ టర్న్ ఇండికేటర్స్, ప్యానరమిక్ సన్‌రూఫ్ వంటి కలవు.

ఫియట్ అవెంచురా అర్బన్ క్రాస్

ఇంటీరియర్ లోపల కూడా డ్యూయల్ టోన్ డిజైన్ అందించారు మరియు టెయిల్ ల్యాంప్స్‌కు లోపలి వైపున ఎర్రటి గీతలు ఉండే విధంగా ఎల్‌ఇడి ఆప్టికల్స్ అందించారు అలాగే 17 అంగుళాల అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉంది.

ఫియట్ అవెంచురా అర్బన్ క్రాస్

ఈ ఏడాది లోపు విడుదల కానున్న అవెంచురా ప్రొడక్షన్ రెడి కారు టన్నులోపు బరువుతో రానుంది. మరియు కొన్ని ష్టైలింగ్ డిజైన్ లక్షణాలతో కూడా రానుంది.

ఫియట్ అవెంచురా అర్బన్ క్రాస్

ఇంజన్ పరంగా ఇందులో 1.4 లీటర్ టి-జెట్ పెట్రోల్ ఇంజన్‌తో రానుంది. ఇది సుమారుగా 138బిహెచ్‌పి పవర్ మరియు 210ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయనుంది.

  
Read more on: #ఫియట్ #fiat
English summary
Fiat Avventura Urban Cross Launch Date Revealed
Story first published: Saturday, July 2, 2016, 14:24 [IST]
Please Wait while comments are loading...

Latest Photos