అవెంచురా అర్బన్ క్రాస్ విడుదల, ప్రారంభ ధర రూ. 6.85 లక్షలు

Written By:

ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్స్ (FCA) ఇండియా తమ అవెంచురా అర్బన్ క్రాస్ ను దేశీయ విపణిలోకి విడుదల చేసింది. క్రాస్-హ్యాచ్‌గా పిలువబడే దీని ప్రారంభ ధర రూ. 6.85 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా నిర్ణయించింది. ఫియట్ వారి క్రాస్ హ్యాచ్ అవెంచురా అర్బన్ క్రాస్ గురించి పూర్తి వివరాలు...

ఫియట్ అవెంచురా అర్బన్ క్రాస్

ఫియట్ ఇండియా ఈ అవెంచురా అర్బన్ క్రాస్ కార్లను అక్టోబర్ 1, 2016 నుండి దేశవ్యాప్తంగా ఉన్న ఫియట్ షోరూమ్‌ల ద్వారా డెలివరీ ఇవ్వనుంది.

ఫియట్ అవెంచురా అర్బన్ క్రాస్

ఫియట్ ఇండియా విడుదల చేసిన ఈ అవెంచురా అర్బన్ క్రాస్ కారు దీని సెగ్మెంట్లో అత్యంత సరసమైన డీజల్ ఉత్పత్తి అని తెలిపింది.

ఫియట్ అవెంచురా అర్బన్ క్రాస్

అవెంచురా అర్బన్ క్రాస్ ఆక్టివ్ మరియు డైనమిక్ అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది.

ఫియట్ అవెంచురా అర్బన్ క్రాస్

అవెంచురా అర్బన్ క్రాస్ లోని రెండు వేరియంట్లు కూడా 1.3-లీటర్ సామర్థ్యం గల మల్టీ జెట్ డీజల్ ఇంజన్ కలదు.

ఫియట్ అవెంచురా అర్బన్ క్రాస్

ఇందులోని శక్తివంతమైన ఇంజన్ సుమారుగా 94బిహె‌చ్‌పి పవర్ ఉత్పత్తి చేయును. ఈ ఇంజన్‌కు 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేశారు.

ఫియట్ అవెంచురా అర్బన్ క్రాస్

ఫియట్ తమ అబర్త్‌లో వినియోగించిన 1.4-లీటర్ టి-జెట్ పెట్రోల్ ఇంజన్‌ను తమ అవెంచురా అర్బన్ క్రాస్‌లో అందించారు.

ఫియట్ అవెంచురా అర్బన్ క్రాస్

పెట్రోల్ ఇంజన్ గల అవెంచురా అర్బన్ క్రాస్ ను ఎమోషన్ అనే వేరియంట్లో అందించారు.

ఫియట్ అవెంచురా అర్బన్ క్రాస్

ఎమోషన్‌లో అందించిన శక్తివంతమైన పెట్రోల్ ఇంజన్ 138బిహెచ్‌పి పవర్‌ ఉత్పత్తి చేయగలదు. ఇందులోని ఇంజన్‌కు 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేశారు.

ఫియట్ అవెంచురా అర్బన్ క్రాస్

ఫియట్ ఇంతకు మునుపు ఈ అవెంచురా అర్బన్ క్రాస్‌ను కాన్సెప్ట్‌ రూపంలో 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ప్రదర్శించారు. డిజైన్ పరంగా సరికొత్త ఫ్రంట్ గ్రిల్, ముందు మరియు వెనుక వైపున డ్యూయల్ టోన్ బంపర్లను అదే విధంగా ప్రక్కవైపున స్కిడ్ ప్లేట్లను అందించారు.

ఫియట్ అవెంచురా అర్బన్ క్రాస్

స్పోర్టివ్ డిజైన్‌ను సొంతం చేసుకోవడానికి 16-అంగుళాల అల్లాయ్ వీల్స్, పియాన్ బ్లాక్ పెయింట్ గల తొడుగులు, స్పోర్టివ్ స్పాయిలర్, స్మార్ట్ సైడ్ బాడీ క్లాడింగ్ మరియు రూఫ్ రెయిల్స్ అందించారు.

ఫియట్ అవెంచురా అర్బన్ క్రాస్

ఫీచర్ల పరంగా ఇందులో సెంట్రల్ మరియు ఆటోమేటిక్ డోర్ లాక్, డ్యూయల్ టోన్ డ్యాష్ బోర్డ్, సాఫ్ట్ టచ్ ఫ్రంట్ ప్యానెల్, రియర్ ఏ/సి వెంట్‌లు, ఆటో డౌన్ స్మార్ట్ విండోలు కలవు.

ఫియట్ అవెంచురా అర్బన్ క్రాస్

స్మార్టెక్ 5-అంగుళాల మ్యూజిక్ సిస్టమ్, తాకే తెర గల న్యావిగేషన్ సిస్టమ్ (అన్ని వేరియంట్లలో తప్పనిసరిగా అందించారు). బ్లూటూత్ ద్వారా ఆడియో ప్లే చేయగలిగే ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

ఫియట్ అవెంచురా అర్బన్ క్రాస్
 
Read more on: #ఫియట్ #fiat
English summary
Read In Telugu: Fiat Avventura Urban Cross Launched In India; Prices Start At Rs 6.85 Lakh
Story first published: Saturday, September 24, 2016, 16:31 [IST]
Please Wait while comments are loading...

Latest Photos