దేశీయ విపణిలోకి ఫియట్ లీనియా 125 ఎస్ విడుదల: ఫీచర్లు, ధర మరియు విడుదల వివరాలు

Written By:

ఇటాలియన్ కార్ల తయారీ సంస్థ ఫియట్ ఇండియన్ మార్కెట్లోని తమ ఉత్పత్తుల శ్రేణిలోకి అత్యంత శక్తివంతమైన ఉత్పత్తి లీనియా సెడాన్‌ను విడుదల చేసింది. లీనియా 125 ఎస్ పేరుతో పిలువబడే సరికొత్త సెడాన్‌ను ప్రారంభ ధర రూ. 7.82 లక్షలు ఎక్స్ షోరూమ్‌గా (ఢిల్లీ)గా నిర్ణయించింది.

ఈ ఏడాదిలో ఫిబ్రవరిలో జరిగిన 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదికలో ఫియట్ ఈ లీనియా 125 ఎస్ సెడాన్‌ను ప్రదర్శించింది.

ఫియట్ లీనియా 125 ఎస్ ఇంజన్ వివరాలు

ఫియట్ లీనియా 125 ఎస్ ఇంజన్ వివరాలు

ఫియట్ వారి నయా సెడాన్ లీనియా 125 ఎస్ లో 1.4 లీటర్ సామర్థ్యం ఉన్న నాలుగు సిలిండర్ల టర్బోఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్ కలదు.

పవర్ మరియు టార్క్ వివరాలు

పవర్ మరియు టార్క్ వివరాలు

ఇందులోని ఇంజన్ 5,000 ఆర్‌పిఎమ్ వేగం వద్ద 123బిహెచ్‌పి పవర్ మరియు 2,100ఆర్‌పిఎమ్ వేగం వద్ద 210ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఇతర వివరాలు

ఇతర వివరాలు

గేర్‌బాక్స్: 5-స్పీడ్ మ్యాన్యువల్

బూట్ స్పేస్: 500 లీటర్లు

గ్రౌండ్ క్లియరెన్స్: 190ఎమ్ఎమ్ (ఈ శ్రేణిలో అత్యుత్తమం)

ఫియట్ లీనియా 125 ఎస్ ఫీచర్లు

ఫియట్ లీనియా 125 ఎస్ ఫీచర్లు

  • న్యావిగేషన్ గల 5 అంగుళాల తాకే తెర ఇన్ఫోటైన్‌మెంట్ వ్యవస్థ
  • డ్యూయల్ స్టేజ్ డ్రైవర్ ఎయిర్ బ్యాగులు
  • యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్
  • ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్
  • రియర్ పార్కింగ్ సెన్సార్లు
ఫియట్ లీనియా 125 ఎస్ ఫీచర్లు

ఫియట్ లీనియా 125 ఎస్ ఫీచర్లు

  • 16 అంగుళాల అల్లాయ్ చక్రాలు
  • ఆటోమేటిక్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్
  • రెయిన్ సెన్సింగ్ వైపర్లు
  • సింగిల్ టచ్ పవర్ విండోలు
  • వెనుక వైపున సన్ కర్టెన్‌లు
ఫియట్ లీనియా 125 ఎస్ డిజైన్

ఫియట్ లీనియా 125 ఎస్ డిజైన్

డిజైన్ పరంగా ముందున్న లీనియా సెడాన్‌కు మరియు నూతన సెడాన్‌కు మధ్య గల ఏకైక తేడా ఫ్రంట్ గ్రిల్ డిజైన్. ముందు వైపున్న ఫ్రంట్ గ్రిల్‌ను మెరిసేటటువంటి పదార్థంతో అడ్డంగా ఉన్నటువంటి గీతలతో రూపొందించారు.

ఆఫర్లు కూడా

ఆఫర్లు కూడా

ఫియట్ ఈ లీనియా 125 ఎస్ మీద మూడు ఏళ్లు లేదా 100,000 కిలోమీటర్లు ఉచిత వారంటీని అందిస్తున్నారు, ప్రతి 15,000 కిలోమీటర్లకు సర్వీసింగ్ చేయించుకోవచ్చు.

ఫియట్ లీనియా 125 ఎస్

ఈ సందర్భంగా ఫియట్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మాట్లాడుతూ, ఇండియన్ మార్కెట్లో లీనియా 125 ఎస్ విడుదలైన సెగ్మెంట్లో ఇది ఎంతో శక్తివంతమైనదని తెలిపాడు. అత్యధిక శక్తిని ఇచ్చే ఏకైక సెడాన్‌గా ఇది నిలిచింది. ఇంజన్ యొక్క విస్వసనీయమైన పనితీరు మరియు మా వాహనాల యొక్క భద్రత మా విజయానికి ఎంతో కారణమవుతున్నాయని చెప్పుకొచ్చారు.

పోటీ

పోటీ

ప్రస్తుతం దేశీయ మార్కెట్సో ఫియట్ లీనియా 125 ఎస్ సెడాన్‌కు ఏ విధమైన పోటీ లేదు. ఈ శ్రేణిలో అత్యంత శక్తివంతమైనది ఇదే.

 
Read more on: #ఫియట్ #fiat
English summary
Fiat Linea 125 S Launched in India, Prices Start At Rs. 7.82 Lakh
Story first published: Friday, July 8, 2016, 13:32 [IST]
Please Wait while comments are loading...

Latest Photos