షెవర్లే ఇండియా దేశీయంగా విడుదల చేయనున్న కొత్త కార్లు

Written By:

అమెరికా ఆధారిత కార్ల తయారీ సంస్థ జనరల్ మోటార్స్ కు చెందిన షెవర్లే ఇండియన్ మార్కెట్లోకి అయిదు కొత్త ఉత్పత్తులను విడుదల చేయనుంది. విభిన్న సెగ్మెంట్లలోకి ఈ అయిదింటిని విడుదల చేయనుంది.

షెవర్లే అంతర్జాతీయంగా మంచి ఫలితాలను సాధిస్తున్నప్పటికి దేశీయంగా ఆశించిన స్థాయిలో రాణించలేకపోతోంది. ఇందుకు రెండు ముఖ్య కారణాలు ఉన్నాయి. అందులో తమ లైనప్‌లో అవే పాత మోడల్స్ ను అందివ్వడం మరియు సర్వీసింగ్ ధర ఎక్కువగా ఉండటం. అయితే దేశీయ విపణిలో నిలదొక్కుకోవడానికి రానున్న ఏడాదిలోపు కొన్ని కొత్త కార్లను అందివ్వనుంది. వాటి వివరాలు...

To Follow DriveSpark On Facebook, Click The Like Button
1. షెవర్లే బీట్

1. షెవర్లే బీట్

జనరల్ మోటార్స్ దేశీయంగా అత్యధికంగా అమ్మకాలు సాధించిన పెడుతున్న వాటిలో బీట్ హ్యాచ్‌బ్యాక్ ఒకటి. అయితే కాలం చెల్లిన డిజైన్‌లో ఉన్న దీనిని నెక్ట్స్ జెనరేషన్‌గా అందుబాటులోకి తీసుకురానుంది. దీనిని 2017 నాటికి దేశీయంగా అందుబాటులోకి తీసుకురానున్నారు.

 సాంకేతిక మరియు ధర వివరాలు

సాంకేతిక మరియు ధర వివరాలు

ఇందులో 1.0-లీటర్ డీజల్ ఇంజన్, 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ మరియు 1.4-లీటర్ ఎకో టెక్ ఇంజన్‌తో కూడా రానుంది. అంతే కాకుండా దీనిని 1.2-లీటర్ స్మార్ట్‌టెక్ పెట్రోల్ ఇంజన్‌ను కూడా అందివ్వనున్నారు. దీనిని 4.5 లక్షల నుండి 6.50 లక్షల మధ్య ప్రారంభ ధరతో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.

2. షెవర్లే ఆక్టివ్

2. షెవర్లే ఆక్టివ్

కొత్త తరం బీట్‌తో పాటు కొత్త తరం ఆక్టివ్ ను కూడా రానున్న ఏడాదిలోపు దేశీయం మార్కెట్లోకి విడుదల చేయాలనే ఆలోచనలో ఉంది. ఈ షెవర్లే బీట్ ఆక్టివ్ మోడల్‌ను జనరల్ మోటార్స్ మొదటి సారిగా 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ప్రదర్శించింది.

సాంకేతిక మరియు ధర వివరాలు

సాంకేతిక మరియు ధర వివరాలు

సాంకేతికంగా షెవర్లే ఈ కొత్త తరం బీట్ ఆక్టివ్ లో 1.2-లీటర్ స్మార్ట్‌టెక్ పెట్రోల్, 1.0-లీటర్ స్మార్ట్‌టెక్ డీజల్ ఇంజన్‌లను అందించనుంది.

  • విడుదల అంచనా: 2017 మధ్య భాగంలో
  • ధర అంచనా: 5 నుండి 7.50 లక్షలు
3. షెవర్లే ఎసెన్షియా

3. షెవర్లే ఎసెన్షియా

ఆక్టివ్ మోడల్‌తో పాటు సంస్థ యొక్క అప్ కమింగ్ సెడాన్ ఎసెన్షియాను కూడా 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ప్రదర్శించబడింది. ప్రస్తుతం బీట్ మరియు ఆక్టివ్ వేరియంట్లను అభివృద్ది చేస్తున్న అదే ప్లాట్‌ఫామ్ మీద ఈ నాలుగు మీటర్ల సెడాన్‌ను అభివృద్ది చేస్తోంది.

సాంకేతిక మరియు ధర వివరాలు

సాంకేతిక మరియు ధర వివరాలు

షెవర్లే ఇందులో 77బిహెచ్‌పి పవర్ మరియు 107ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగల 1.2-లీటర్ ఎస్‌టిఇసి పెట్రోల్ ఇంజన్ మరియు 55బిహెచ్‌పి పవర్ మరియు 142.5ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగల 1.0-లీటర్ డీజల్ ఇంజన్‌ను అందివ్వనుంది.

  • విడుదల అంచనా: 2017 మధ్య భాగానికి
  • ధర అంచనా: 5 నుండి 7 లక్షల ప్రారంభ ధరతో
4. షెవర్లే ట్రయల్ బ్లేజర్

4. షెవర్లే ట్రయల్ బ్లేజర్

మొదటి సారిగా షెవర్లే దేశీయ మార్కెట్లోకి విడుదల చేసిన ట్రయల్‌బ్లేజర్ ఆశించిన స్థాయిలో అమ్మకాలను సాధించలేదు. అయితే మరో సారి 2017 ట్రయల్‌బ్లేజర్‌గా విడుదల చేయనుంది. బ్యాంకాక్ అంతర్జాతీయ వాహన ప్రదర్శనలో 2017 కు చెందిన ట్రయల్‌బ్లేజర్‌ను పరిచయం చేయనుంది.

సాంకేతక మరియు ధర వివరాలు

సాంకేతక మరియు ధర వివరాలు

షెవర్లే ఈ ఎస్‌యువిలో 2.8 లీటర్ డ్యూరామ్యాక్స్ డీజల్ మరియు 2.5-లీటర్ డ్యూరామ్యాక్స్ డీజల్ ఇంజన్‌లను అందివ్వనుంది.

  • విడుదల అంచనా: 2017 నాటికి
  • ధర అంచనా : 25 నుండి 30 లక్షల ప్రారంభ ధరతో
5. షెవర్లే క్రూజ్ 2017

5. షెవర్లే క్రూజ్ 2017

షెవర్లేకు చెందిన క్రూజ్ ప్రీమియమ్ సెడాన్ ఇప్పటికే ఇండియాతో పాటు మరిన్ని అంతర్జాతీయ మార్కెట్లలో అమ్మకాల్లో ఉంది. అయితే 2017 కు చెందిన క్రూజ్ ప్రీమియమ్ సెడాన్‌ను డిజైన్ పరంగా ముందు దానికన్నా చాలా విభిన్నంగా అందివ్వనున్నారు.

సాంకేతిక మరియు ధర వివరాలు

సాంకేతిక మరియు ధర వివరాలు

ప్రస్తుతం క్రూజ్ సెడాన్ కేవలం డీజల్ వేరియంట్లలో మాత్రమే అందుబాటులో ఉంది. దీనికి అదనంగా ఇప్పుడు 153బిహెచ్‌పి పవర్ మరియు 240ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ ఉత్పత్తి చేయగల 1.4-లీటర్ ఎకో టెక్ పెట్రోల్ ఇంజన్, అదే విధంగా 164బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయగల 2.0-లీటర్ విసిడిఐ పెట్రోల్ ఇంజన్‌ను అందివ్వనున్నారు.

  • విడుదల అంచనా: 2017 మధ్య భాగానికి
  • ధర అంచనా: 15 నుండి 20 లక్షల ప్రారంభ ధరతో
 
English summary
Read In Telugu:5 New Chevrolet Cars To Be Launched In The Next Year
Story first published: Saturday, September 17, 2016, 12:15 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark