2016 ఇండియన్ ఎక్స్ పో లో మెరవనున్న హోండా జాజ్ ఆర్‌ఎస్

By Anil

హోండా మోటార్స్ వారు 2015 లో ద్వితియార్థంలో భారతీయ మార్కెట్లోకి తన ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ జాజ్ ను విడుదల చేసింది. జపాన్ ‌కు చెందిన హోండా మోటార్స్ వారు జాజ్‌ను సరికొత్త స్పోర్ట్ లుక్‌తో మార్కెట్లోకి విడుదల చేయనుంది. మరియు 2016 లో దీనిని ఆర్‌ఎస్ అనే బ్యాడ్జ్ పేరుతో ప్రదర్శించనున్నారు.

హోండా వారి సరికొత్త జాజ్ ఆర్‌ఎస్ స్పోర్ట్ వెర్షన్‌ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ గురించి మరింత సమాచారం క్రింది కథనంలో

ఆర్‌ఎస్ బ్యాడ్జి

ఆర్‌ఎస్ బ్యాడ్జి

ప్రస్తుతం హోండా మోటార్స్ వారు ఆర్‌ఎస్ బ్యాడ్జ్ పేరుతో భారతీయ మార్కెట్లో మొబిలియో కారును అందుబాటులో ఉంచింది. అయితే జాజ్ ఆర్‌ఎస్ ద్వారా వీటి సంఖ్య రెండుకు చేరుకుంది.

డిజైన్

డిజైన్

ఈ సరికొత్త హోండా జాజ్ కారు నూతనంగా మనకు కనువిందు చేయడానికి దీనిని పూర్తిగా స్పోర్ట్స్ రేస్‌ ఆదర్శంతో రూపొందించారు. అంతే కాకుండా ఇందులో ఉత్తమ పని తీరును కనబరిచే ఇంజన్ ను అందిస్తున్నట్లు తెలిసింది.

ఫీచర్లు

ఫీచర్లు

  • స్పోర్ట్స్ అల్లాయ్ వీల్స్
  • గ్లోసి బ్లాక్ ఫ్రంట్ గ్రిల్
  • ఏరో డైనమిక్ స్పాయిలర్
  • రెండు పొగ గొట్టాలు
  • ఇంకా అనేక కొత్త ఫీచర్లు ఇందులో కలవు
  • పోటి

    పోటి

    సరికొత్త హోండా జాజ్ ఆర్ఎస్ స్పోర్టివ్ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ కారు భారతీయ మార్కెట్లోకి విడుదల అయితే వోక్స్‌వ్యాగన్ వారి పోలో జిటి మరియు ఫియట్ వారి అబర్త్ పుంటో కార్లకు గట్టి పోటిగా నిలవనుంది.

    ధర

    ధర

    హోండా వారి జాజ్ ఆర్‌ఎస్ మార్కట్లోకి విడుదల అయితే ధర దాదాపుగా రూ. 9 లక్షల వరకు ఉండవచ్చు.

    ప్రస్తుతం

    ప్రస్తుతం

    హోండా వారు ప్రస్తుతం ఈ జాజ్ ఆర్ఎస్ కారును ఇండోనేషియాలో అమ్మకాలకు అందుబాటులో ఉంచింది. దీని గురించి మరిన్ని వివరాలు హోండా మోటార్స్ వారు అతి త్వరలో విడుదల చేయనున్నారు. దీని గురించి మరిన్ని వివరాల కోసం డ్రైవ్‌స్పార్క్‌తో కలిసి ఉండండి.

    మరిన్ని కథనాల కోసం...
    1. ఎలక్ట్రానిక్ వాహనాల కొనుగోలు పై ట్యాక్స్‌లు నిషేధించిన మహరాష్ట్ర ప్రభుత్వం
    2. భారతీయ మార్కెట్లోకి హోండా జాజ్ ట్విస్ట్‌ క్రాసోవర్
    3. 25,000 ఫోన్లతో రూపొందించబడిన కారు కావాలా ? అయితే తైవాన్‌కు వెళ్దాం రండి.

Most Read Articles

English summary
Honda Jazz RS Debut Most Likely At 2016 Auto Expo
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X