మళ్లీ అదే కారణం 3,00,000 హోండా కార్లు రీకాల్

హోండా మోటార్స్ ప్రపంచ వ్యాప్తంగా భారీ సంఖ్యలో తమ కార్లను రీకాల్ చేసింది. హోండా వినియోగించిన టకాటా ఎయిర్ బ్యాగులలో లోపం కారణంగా సుమారుగా 3 లక్షల కార్లను వెనక్కి పిలిచింది.

By Anil

హోండా మోటార్స్ ప్రపంచ వ్యాప్తంగా భారీ సంఖ్యలో తమ కార్లను రీకాల్ చేసింది. హోండా వినియోగించిన టకాటా ఎయిర్ బ్యాగులలో లోపం కారణంగా సుమారుగా 3 లక్షల కార్లను వెనక్కి పిలిచింది. నేషనల్ హైవే సేఫ్టీ ట్రాఫిక్ అడ్మినిస్ట్రేషన్ (NHTSA) వారి కథనం మేరకు రీకాల్ చేసిన కార్లలోని ఎయిర్ బ్యాగుల సమస్యను హోండా సవరించాల్సి ఉంది.

హోండా కార్ల రీకాల్

తమ కార్లలో లోపం ఉన్న ఎయిర్ బ్యాగుల సమస్యను సంభందిత డీలర్లను సంప్రదించి జూన్ లోపు సరిచేసుకోవాలని NHTSA కస్టమర్ల సూచించింది. డెట్రాయిట్ వార్తల ప్రకారం ఇప్పటి వరకు సుమారుగా 13,000 కార్లలలో లోపాన్ని సవరించినట్లు తెలిసింది.

హోండా కార్ల రీకాల్

NHTSA అడ్మినిస్ట్రేటర్ మార్క్ రోస్కైండ్ మాట్లాడుతూ, ప్రమాదం జరిగిన సమయాల్లో ప్రాణాలు కోల్పోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకోసం ప్రాణాలను దక్కించుకునేందుకు ఎయిర్ బ్యాగులున్న కార్లను కొనుగోలు చేస్తారు. అయితే తయారీ సంస్థల పొరబాట్ల కారణంగా లోపం ఉన్న ఎయిర్ బ్యాగులను అందిస్తున్నారు. కాబట్టి రీకాల్ జరిగిన వెంటనే విధిగా వినియోగదారులు వీలైనంత త్వరగా లోపాన్ని గుర్తించి పరిష్కరించుకోవాలి.

హోండా కార్ల రీకాల్

గతం మాసంలో విడుదలైన ఒక రిపోర్ట్ ప్రకారం 2001 లో ఒక మహిళ హోండా సివిక్ కారులో లోపం ఉన్న ఎయిర్ బ్యాగ్ కారణంగా మృతి చెందింది. అదే ముందుగా లోపాన్ని గుర్తించి పరిష్కరించి ఉంటే ఆమె బ్రతికి ఉండేది.

హోండా కార్ల రీకాల్

NHTSA అధికారులు ప్రయివేట్ ఇన్వెస్టిగేషన్ ఆధికారులను నియమించింది. రీకాల్‌కు గురైన కార్లను స్వయంగా పర్యవేక్షించి, సాంకేతిక నిపుణులకు సమాచారం అందించి ఎయిర్ బ్యాగులలో లోపాన్ని పరిష్కరించనున్నారు.

హోండా కార్ల రీకాల్

NHTSA అధికారులు హోండా మోటార్స్ ప్రతినిధులతో ఇప్పటికే పలుమార్లు చర్చించి, రీకాల్‌కు గురైన కార్లలో సమస్యను వేగంగా గుర్తించి పరిష్కరించి ప్రమాదాల రేటు తగ్గించాలని కోరినట్లు తెలిపారు.

హోండా కార్ల రీకాల్

ఎయిర్ బ్యాగ్స్: ఎలా పనిచేస్తాయి, ఎన్ని రకాలు, చరిత్ర

Most Read Articles

English summary
Read In Telugu: Recall: 3,00,000 Honda Cars With Faulty Airbags Still Unrepaired
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X